పాము కనిపిస్తే చాలు పిజ్జాలా తింటాడు.. విషాన్ని కూల్ డ్రింక్‌ లా తాగుతాడు..

153

పాము..ఈ పేరు వింటే చాలు చాలా మంది ప్యాంట్ తడిసిపోతుంది. ఎందుకంటే అది చాలా డేంజరస్ జీవి కాబట్టి. అక్కడ పాము ఉందని తెలిస్తే చాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని మనం అస్సలు వెళ్ళం. అయినా గానీ అవే మనం ఉన్నచోటుకు అప్పుడప్పుడు వస్తు ఉంటాయి. అయితే వీధిలోకి వచ్చినా లేదా ఇంట్లోకి వచ్చినా కూడా కనపడితే దానిని చంపేసో లేదా తరిమో పంపించేస్తాం. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం అవి కనిపిస్తే చాలు పండుగ చేసుకుంటాడు. అతనికి అది ఓ ఆట వస్తువుల కనిసిస్తోంది. పామును పట్టుకుని దాని విషాన్ని కూల్ డ్రింక్‌లా తాగేస్తాడు. శరీరాన్ని పిజ్జాలా కొరికేస్తాడు. ఇంతకి ఆ వ్యక్తి ఎవరు, అతని కథేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రకాశం జిల్లా నేతివారిపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు పాము కనిపిస్తే చాలు దాని పట్టుకుని కరకర నమిలి పారేస్తాడు. ఇతనికి పాములు కనిపిస్తే పండగ చేసుకుంటాడు. చాకచక్యంగా వాటిని బంధించడమే కాదు… ఆ తర్వాత వాటిని పకోడిలా నమిలి మింగేస్తాడు. చిన్నప్పటి నుంచి ఇతని సాహసం పాములతోనే. సాధారణంగా పాములు మనుషులను భయపెడతాయి కానీ ఇతను మాత్రం పాములను భయపేడతాడు. అతనికి చిక్కమో చచ్చాంరా అనేంతలా వాటికి నరకాన్ని చూపిస్తాడు. ఎంతటి విషసర్పాలతోనైనా ఆడుకుంటాడు. నాగుపాములను సైతం మెడలో వేసుకుని మురిసిపోతాడు. పాములు పడగవిప్పి నాట్యం చేస్తుంటే, శేషపాన్పులా పవళించి ఎంజాయ్ చేస్తుంటాడు.

వెంకటేశ్వర్లు గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటాడు. చూట్టూ పక్కల గ్రామాలలో ఉన్నవారి ఇళ్లలోకి పాములు వస్తే వెంటనే ఆయన్ని సంప్రదిస్తుంటారు. ఎలాంటి సర్ఫమైన సరే సులభంగా పట్టేసి దాంతో ఆటలు ఆడేస్తాడు. అందరిలా పాములు పట్టుకుని అడవుల్లో వదిలేస్తే తనకంటూ ప్రత్యేక ఏముంటుందని అనుకున్నాడో ఏమో, ఆ పాములను టేస్ట్‌ చేయడానికి రుచిమరిగిన ఈ వెంకటేశ్వర్లు, పాములను పట్టుకున్న తర్వాత వాటిని తన నాలుక, చేతులపై కసిగా కాటువేయించుకుటాడు. ఆ తర్వాత వచ్చే విషాన్ని ఆనందంగా మింగేసి అసలైన సంతృప్తి పొందుతాడు. అంతేకాదు పాము తలను తననోటితో కొరికి కరకరా నమిలేస్తాడు. అతనికి చిన్నప్పటి నుంచి పాము విషం సేవించడం ఓ అలవాటుగా మారిపోయింది. విషాన్ని తాగినప్పటికీ అతనికి మాత్రం ఎలాంటి ప్రాణ హాని కలగదు. చిన్నప్పటి నుంచి పాముల విషం తాగుతుండడంతో అతని శరీరం కూడా విషతుల్యం అయిపోయింది. అతను ఏదైనా జంతువును నోటితో కరిచిన వాటి ప్రాణానికి కూడా ముప్పే. ఆయన ఒళ్ళు విషమయమని తెలిసిన కూడా అతనితో స్నేహితులు, గ్రామస్థులు స్నేహంగానే మెలుగుతారు. అతను కూడా వారితో కలుపుగోలుగా ఉంటూ సాధారణ వ్యక్తిలానే జీవిస్తుంటాడు. అతను ఓ ముద్దుపేరు కూడా ఉంది. ఆ ఊరి వారు అతన్ని ముద్దుగా పున్నమి నాగు అని పిలుచుకుంటారు.

man-drinking-snake-venom-in-prakasam-district

పాముకి తలలో, తేలుకి తోకలో విషం ఉంటుందని అంటారు. కానీ తనకు మాత్రం ఒళ్లంతా విషమే అంటున్నారు వెంకటేశ్వర్లు. తనను ఏం కరిచినా అది కాటికి పోవడం ఖాయమంటున్నాడు. ఇక ఇతని జనవిజ్ఞాన వేదిక వాళ్ళు మాట్లాడుతూ.. కడుపులో ఎటువంటి గాయాలు లేనంత వరకు పాము విషం తాగినా మనిషికి ఏమీ కాదంటున్నారు జన విజ్ఞాన వేదిక సభ్యులు. పాము తలను కొరికి తిన్నా అది జీర్ణమై పోతుందని చెబుతున్నారు. అయితే కడుపులో ఏవైనా గాయాలు ఉంటే మాత్రం ఉంటే మాత్రం అతని ప్రాణం పోతుందని, వెంకటేశ్వర్లు కడుపులో గాయాలేవీ లేకపోవడం వల్లే అతడికి ఏమీ కావడం లేదని చెప్పారు.

Content above bottom navigation