పాల కంటైనర్ ను చెక్ చేసిన పోలీసులకు లోపల ఏం దొరికిందో తెలిస్తే ఒక్కసారిగా దిమ్మతిరుగుతుంది

150

అది పైకి చూడటానికి ఒక పాల కంటైనర్ కానీ దాని లోపల ఏముందో అని చూసిన పోలీసులకు దిమ్మతిరిగింది. అక్రమ మార్గంలో, ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం బాటిళ్ల లోడుతో వెళుతున్న కంటైనర్ ను సోమవారం వేకువ జామున ప్రతాప్ ఘడ్ వద్ద పట్టుకున్నారు. ఈ పట్టుబడిలో ఏకంగా 25 లక్షల మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

ప్రతాప్ ఘడ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, స్థానిక ఎక్సైజ్ సీఐ తెలిపిన వివరాల మేరకు..రాజస్థాన్ నుంచి గుజరాత్ కు మద్యం అక్రమంగా సప్లై అవుతుందని సమాచారం అందింది. దాంతో ఆ రూట్లో వెళ్లే ప్రతి వెహికల్ ను చెక్ చేశారు. ఏ వెహికల్ ను కూడా వదలకుండా చెక్ చేశారు. అప్పుడే అక్కడికి ఒక పాల కంటైనర్ వచ్చింది. అయితే ఆ పాల కంటైనర్ ను చూసి ముందు పోలీసులు డౌట్ పడలేదు కానీ పోలీసులను చూడగానే ఆ డ్రైవర్ కంగారు పడ్డాడు. వారిని చూసి ఒక దాబా వద్ద బండిని ఆపాడు. దాంతో పోలీసులకు అతని మీద డౌట్ వచ్చింది. దాంతో పోలీసులు అనుమానంతో లారీ వద్దకు వెళ్లి ఆ డ్రైవర్‌ ను ప్రశ్నించారు.

అతని వద్ద గుజరాత్ రాష్ట్రంలో ప్రవేశానికి గాను ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వారు వెంటనే సదరు కంటైనర్ ను చెక్ చేశారు. చెక్ చెయ్యగా పైన పాల ప్యాకెట్స్ ఉన్నాయి కానీ వారి కింద 164 పెట్టెల మద్యం సీసాలు ఉన్నాయి. వెంటనే పోలీసులు స్వాధీన పరచుకొని ఎక్సైజ్ స్టేషన్‌ కు తరలించారు. కాగా ఈ లారీలో సుమారుగా రూ.25 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ఉన్నాయని, ఇందుకుగాను టాక్స్ రూపేణా గుజరాత్ రాష్ట్రానికి రావాల్సిన ఎనిమిది లక్షలను చెల్లించకుండా వెళుతున్నట్లు తేలిందన్నారు. వారి వద్ద రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించి పర్మిట్లు, వే బిల్లులు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ మేరకు లారీ డ్రైవర్ తోపాటు క్లీనర్ తోంబేను వారు అరెస్ట్ చేశారు. లారీని ప్రతాప్ ఘడ్ ఎక్సైజ్ సూపరిండెంట్ కార్యాలయానికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ ఎస్‌ఐలు తెలిపారు.

Content above bottom navigation