పెట్రోల్ కొట్టించుకునేటప్పుడు కారు డోర్ ఓపెన్ చేస్తే ఏమవుతుందో తెలుసా

మ‌నం పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించే స‌మ‌యంలో సెల్ ఫోన్ మాట్లాడ‌కూడ‌దు అని వింటూనే ఉంటాం.. దీని వ‌ల్ల మంట‌లు వ్యాపిస్తాయి అని చెబుతారు.. ఇలా పెట్రోల్ బంకుల్లో మంటలు వ్యాపించి ఘోర ప్రమాదాలు జరిగిన ఉదంతాలు ఎన్నో చూసుంటాం. అందుకు మ‌నం చేసే కొన్ని త‌ప్పులు ఈ ప్ర‌మాదాల‌కు ప్రధాన కారణమైన‌ ఘటనలు ఎన్నో ఉన్నాయి. అది కాకుండా దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదాలు చూశాం. కానీ పెట్రోల్ బంకులో ఇంధనం కొట్టించుకునేటప్పుడు కారు డోర్ ఓపెన్ చేస్తే ప్రమాదం జరుగుతుందనే విషయం మీకు తెలుసా? అదేంటి అలా కూడా జరుగుతుందా.. అని అనుకుంటున్నారా.. నిజమండి. పెట్రోల్ బంకులో ఫ్యూయల్ ఫిల్ చేసుకునే సమయంలో కారు డోర్ ఓపెన్ చేసి కాలు కింద పెడితే ఎంత పెద్దగా మంటలు వ్యాపించాయో ఇక్క‌డ ఫోటో చూడండి, అస‌లు ఇలా ఎలా జ‌రిగింది ? కార‌ణం ఉందా అనేది చూద్దాం.

చూశారుగా ఆ డ్రైవర్ అదృష్టం బాగుండి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పెట్రోల్ కొట్టించుకునేందుకు అక్కడకు వచ్చిన ఓ వ్యక్తి కారు డోర్ ఓపెన్ చేసి అక్కడున్న ఇంధనం నింపుతున్న మరో వ్యక్తితో మాట్లాడేందుకు కారు డోర్ ఓపెన్ చేసి కాలు కిందపెట్టి అలాగే ఉంచాడు. ఇదే సమయంలో పెట్రోల్ పైపు చివరన అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఆయిల్ నింపే వ్యక్తి అక్కడి నుంచి పారిపోగా.. డ్రైవర్ తెలివిగా పక్క సీటులోకి జారి అక్కడ నుంచి కారు డోర్ ఓపెన్ చేసుకొని బయటపడ్డాడు. తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. త‌ర్వాత అక్కడున్న వారు స్పందించి మంటలు అదుపు చేశారు. ఇది జరిగింది మనదేశంలో కాకపోయినప్పటికీ ఇది అంద‌రికి ఓ ఎక్సాంపుల్ గా చెప్పాలి. ఇంతకీ అక్కడ ఏం జరిగింది అనేగా మీ అనుమానం. ఈ ఘటనకు కారణం స్థిర విద్యుత్ ఏర్పడటం అని చెబుతున్నారు.

స్థిర విద్యుత్ గురించి మనం చిన్నప్పుడు పాఠాల్లో చదువుకుందే . ఒక వస్తువును మరో వస్తువుతో రుద్దడం ద్వారా కలిగిన ఘర్షణ వల్ల వాటిలోని పరమాణువులు ఎలక్ట్రాన్లను గ్రహించడమో లేదా కోల్పోవడమో జరుగుతుంది. అప్పుడు ఆ వస్తువులపై స్థిరవిద్యుత్(స్టాటిక్ ఎలక్ట్రిసిటీ) ఏర్పడుతుంది. ఉదాహరణకు దువ్వెనతో పొడి జుట్టును దువ్వుకుని.. కాగితపు ముక్కలకు దగ్గరగా పెడితే ఆ కాగితపు ముక్కలు వాటంతటా అవే దువ్వెనకు అతుక్కుంటాయి. అంతేకాదు ఆకాశంలో రెండు మేఘాలు పరస్ఫరం ఢీకొన్నప్పుడూ స్థిరవిద్యుత్ ఏర్పడుతుంది. అలా ఏర్పడిన స్థిర విద్యుత్ భూమి దిశగా ప్రసరించినపుడు మెరుపులు వస్తాయి.

పెట్రోల్ బంకులో మంట ఎందుకు వచ్చిందంటే…
ఈ సంఘటనలో జరిగింది ఏంటంటే.. అప్పటి వరకు గమనంలో ఉన్న కారు ఒక్కసారిగా ఆగింది. అందులో ఉన్న డ్రైవర్ అప్పుడే పెట్రోల్ బంక్ దగ్గర ఆగి కారు డోర్ ఓపెన్ చేసి కాలు కింద పెట్టాడు. అంటే కాలు ఎర్త్ కు కనెక్ట్ అయి ఉండడతో ఎలక్ట్రాన్లు ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో అతడిలో స్థిర విద్యుత్ ఏర్పడింది. అదే సమయంలో పెట్రోల్ నింపడం రెండింటి మధ్య ఎలక్ట్రాన్ల అస్థిరత్వం వల్ల పంపు చివరన చిన్న మెరుపులా ఏర్పడి మంటకు కారణమైంది. అయితే ఈ ఘటన చాలా అరుదుగా జరుగుతుంటుంది.

ఈ పరిస్థితిని ఎలా నియంత్రించాలి అంటే..
పెట్రోల్ బంకులో కారు ఇంజిన్ ఎల్లప్పుడూ ఆపే ఉంచాలి. ఏదోక లోహపు పదార్థాన్ని పట్టుకుంటే శరీరం న్యూట్రల్ స్థితికి వస్తుంది. పెట్రోల్ కొట్టించుకునే సమయంలో వీలైనంతవరకు కారు లోపలే ఉంటే మంచిది. ఇవే జాగ్రత్తలు ఇతర వాహనాలకూ వర్తిస్తాయి. కాబట్టి ఇక మీదట పెట్రోల్ బంకుల్లో ఇంధనం కొట్టించుకునే ముందు కాలు బయట పెట్టకుండా ఉంటే బెటర్.

ఈ క్రింద వీడియో చూడండి: