పైన ఒక అమ్మాయి, కింద ఇద్దరమ్మాయిలు… ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన కవల..

159

మనం ఈమద్య కాలంలో అవిభక్త కవలల గురించి తరచుగా వింటూనే ఉన్నాం. పలు సందర్బాల్లో అవిభక్త కవలల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కొందరు అవిభక్త కవలలు విడదీయబడ్డారు, కాని కొందరు మాత్రం విడదీయడం సాధ్యం కావడం లేదు. అవిభక్త కవలలు ఎక్కువగా విడదీస్తే చనిపోతున్నారనే టాక్‌ ఉంది. అందుకే అవిభక్త కవలలు విడిపోయేందుకు భయపడుతున్నారు. ఇండియాలో ఒకటి రెండు చోట్ల మాత్రమే కనిపించే అవిభక్త కవలలు ప్రపంచ మొత్తం మీద వందల సంఖ్యలో ఉన్నారు. అయితే మనం ఇప్పటి వరకు విన్న అవిభక్త కవలలకు ఇప్పుడు నేను చెప్పబోయే అవిభక్త కవలలకు చాలా తేడా ఉంది. మరి ఆ అవిభక్త కవలల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ఒకప్పటి లింకన్‌ దేశంలో 1869లో నాలుగు కాళ్లతో కార్బిన్‌ జన్మించింది. ఆమెను చూసి డాక్టర్స్, ఆమె కుటుంబ సభ్యులు అంతా కూడా ఆశ్చర్యపోయారు. కార్బిన్‌ కు నాలుగు కాళ్లు ఉండటంతో పాటు, ఆమెకు రెండు జననేంద్రియాలు కూడా ఉన్నాయి. అంటే ఆమె అవిభక్త కవలలు అని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే అప్పుడున్న టెక్నాలజీతో ఆమెను మరింతగా పరీక్షించలేకపోయారు. నడుము పై భాగం వరకు ఒక్క అమ్మాయి కాగా, నడుము కింది బాగంలో ఇద్దరు అమ్మాయిలు. ఆమెలో రెండు జననేంద్రియాలు, రెండు గర్బాశయాలు ఉన్నట్లుగా డాక్టర్స్ నిర్థారించారు.

మొదట ఆమె కొన్ని రోజులు మాత్రమే బతికి ఉంటుందని డాక్టర్స్ భావించారు. నాలుగు కాళ్లు ఉన్నా కూడా రెండు కాళ్లు చాలా చిన్నగా ఉండటంతో పాటు, ఒక కాలు వంకర తిరిగి ఉన్న కారణంగా ఆమె ఒక్క కాలుపైనే నడిచే పరిస్థితి ఉండేది. నాలుగు కాళ్లలో మూడు కాళ్లు పని చేయకున్నా కూడా ఆమె ధైర్యంగా జీవితం సాగించింది. చిన్న వయసులోనే ఓ సర్కస్‌ కంపెనీలో చేరింది. అప్పట్లోనే వారానికి 450 డాలర్లను సంపాదించింది.

Image result for పైన ఒక అమ్మాయి, కింద ఇద్దరమ్మాయిలు

19 ఏళ్ల వయసులో కార్బిన్‌ ను ఒక డాక్టర్‌ పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడు. పెళ్లి తర్వాత కార్బిన్‌ ఒక మగ పిల్లాడు, నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ఆ పిల్లలు అంతా కూడా ఒక్క గర్బాశయం నుండి జన్మించలేదని అప్పట్లో డాక్టర్స్ అన్నారు. అంతటి అంగవైకల్యం ఉన్నా కూడా 60 ఏళ్ల పాటు ఆమె జీవించింది. ఆమె మృతి చెందిన తర్వాత పరిశోదనలకు ఆమె మృతదేహం అప్పగించాలని కోరారు. అందుకు భారీగా డబ్బులు చెల్లించేందుకు కూడా ముందుకు వచ్చారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఆమె మృతదేహం ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ఆమె మృతదేహంను కాంక్రీట్‌ తో వేశారు. దాంతో ఆమెకు సంబంధించిన రహస్యాలు అన్ని కూడా అలాగే ఉండిపోయాయి. ఒకవేళ ఏమైనా పరిశోధనలు చేసి ఉంటె ఆమె గురించి మరిన్ని వివరాలు ప్రపంచానికి తెలిసేవి.

Content above bottom navigation