ప్రధాని మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి ?

121

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌.. ప్రస్తుతం 173 దేశాలకు వ్యాప్తిచెందింది. దాదాపు 2 లక్షల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. సుమారు పది వేల మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్, స్పెయిన్‌లో వైరస్ మరణాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. అయితే దీని భారిన భారత్ పడకుండా ఉండటానికి భారత ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. జనతా కర్ఫ్యూ అనే కార్యక్రమానికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు. అసలు జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి..దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

కరోనా వైరస్ కట్టడి కోసం ప్రధాని మోదీ ‘జనతా కర్ఫ్యూ’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. కోవిడ్ మహమ్మారిని అందరం కలిసి కట్టుగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ఇందుకోసం మార్చి 22న ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు..దీన్నే ఆయన జనతా కర్ఫ్యూగా అభివర్ణించారు.

జనతా కర్ఫ్యూను కరోనాపై అతిపెద్ద యుద్ధంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇది ప్రజల కోసం ప్రజల ద్వారా ప్రజలు విధించుకునే కర్ఫ్యూ అని.. దీని గురించి అందరికీ అవగాహన కల్పించాలని ప్రధాని పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూ పాటించడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవడంతోపాటు ఈ దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడుకోవచ్చని మోదీ తెలిపారు. కరోనాపై పోరాటంలో మానవత్వ తప్పక గెలుస్తుందని, భారత్ విజయం సాధించి తీరుతుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే కొద్ది వారాలపాటు భారతీయులంతా జాగ్రత్తగా ఉండాలని.. అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రధాని మోదీ సూచించారు. సీనియర్ సిటిజన్లు కచ్చితంగా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు.

Image result for జనతా కర్ఫ్యూ

కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉన్నప్పటికీ లక్షలాది మంది హాస్పిటళ్లు, విమానాశ్రయాలు, ఆఫీసుల్లో పని చేస్తున్నారు. డెలివరీ బాయ్‌ లు, మీడియా ప్రతినిధులు తమ విధులను నిర్వర్తిస్తున్నారన్న మోదీ.. వారికి సంఘీభావం ప్రకటించడం కోసం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఇంటి తలుపులు, కిటికీల వద్ద చప్పట్లు కొడుతూ గంటలు మోగించాలన్నారు. కొద్ది వారాల పాటు అత్యవసరం అయితేనే సర్జరీలు చేయించుకోవాలన్న ప్రధాని.. డాక్టర్లతో ఫోన్లో మాట్లాడాలని సూచించారు. హాస్పిటళ్లు, వైద్య సిబ్బందిపై అనవసర ఒత్తిడి తగ్గించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. పాలు, మందులు లాంటి అత్యవసరాల కొరత రాకుండా చర్యలు తీసుకున్నామన్న ప్రధాని మోదీ.. కరోనా భయంతో అవసరానికి మించి ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయొద్దని సూచించారు.

Content above bottom navigation