ప్రముఖుల వెనుక ఉండే సెక్యూరిటీ గార్డులు నల్ల కళ్ళద్దాలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

519

మన దేశంలో రాజకీయ ప్రముఖుల వెనుక ఉండే సెక్యూరిటీ గార్డులని మీరు చూసే ఉంటారు. రాజకీయ నాయకులకు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని 24 గంటలు సెక్యూరిటీ ఇస్తూనే ఉంటారు. అయితే మీరు వాళ్ళను జాగ్రత్తగా చూస్తే, వాళ్ళు ఎప్పుడు కళ్ళకు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని ఉంటారు. ఆ కళ్లద్దాలు లేకుండా ఆ సెక్యూరిటీ గార్డులు బయటకు అస్సలు రారు.. పబ్లిక్ మీటింగ్లకు హాజరయ్యే ప్రతి వీఐపీ వెనుక కళ్ళద్దాలతో వీరు ఉంటారు. అయితే అసలు వారు అలా కళ్ళద్దాలతోనే ఎందుకు ఉంటారు ? అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? వాళ్ళు అలా నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి.

సెక్యూరిటీ గార్డులు తమ కళ్ళతో కనపడే ఏరియా మొత్తం కవర్ చేస్తుంటారు. అయితే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ చూస్తున్నారో అనే విషయం ఇతరులు గమనించకుండా ఉండటం కోసం వాళ్ళు నల్ల కళ్లద్దాలు పెట్టుకుంటారు. అలాగే దాడి చేస్తే, సెక్యూరిటీ వారి కదలికలను కనిపెట్టలేమని దాడి చేయడానికి ఆలోచిస్తారు దుండగులు. అలాగే బహిరంగ సభలు , పర్యటనలలో దుమ్ము, ధూళి అనేది కామన్, అటువంటి పరిస్థితుల్లో కళ్ళద్దాలు కళ్ళను కాపాడుతాయి. ఎందుకంటే దుండగులు ఎప్పుడైనా సరే దాడి ఓపెన్ ఏరియాలోనే చేయడానికి ప్లాన్ చేస్తారు. అటువంటి సమయాల్లో వారి కళ్ళు దుమ్ము, దూళి వల్ల మూసుకుంటే అసలుకే మోసం వస్తుంది కదా. అలాగే పేలుళ్లు లేదా ఫైరింగ్ గనుక జరిగితే, కళ్ళద్దాలు పెట్టుకున్న వ్యక్తి చూపు, పెట్టుకోని వారి కంటే చురుకుగా ఉంటుంది. దాంతో కౌంటర్ ఎటాక్ వెంటనే చేసే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు అప్రమత్తమయ్యి వెంటనే ప్రమాదాన్ని అరికట్టడానికి ఉపయోగపడతాయి. అలాగే ఏదైనా ఎటాక్ జరిగితే వారి హావభావాలను దుండగులకి అర్ధమవకుండా ఉండడానికి నల్ల కళ్లద్దాలు ఉపయోగపడతాయి. ఒక వేల దాడి జరిగితే వీరు షాక్ కి గురి అయినట్టు ఎదుటి వ్యక్తులకి కనపడితే, వారు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. కళ్ళద్దాలు అలాంటి దానిని బ్లాక్ చేసి, వారిని సమర్ధవంతంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తాయి. అంతేకాకుండా సూర్యుడికి ఎదురుగా ఉన్నా సరే ఇవి పెట్టుకుంటే పెద్దగా కళ్ళు మండవు, సూర్యకిరణాల వల్ల కళ్ళు మూసే ఇబ్బందీ ఉండదు.

Image result for సెక్యూరిటీ గార్డులు నల్ల కళ్ళద్దాలు

ఇలా రకరకాలుగా ఆ నల్ల కళ్లద్దాలు పనిచేస్తాయి. అందుకే ఏ వీఐపీ వెనుక ఉండే సెక్యూరిటీ అయినా సరే ఖచ్చితంగా నల్ల కళ్లద్దాలు పెట్టుకుని వస్తారు. రాజకీయ నాయకులకు ఈ సెక్యూరిటీలే లేకుంటే ఇప్పటికి ఎన్నో దాడులు జరిగేవి. వీరిని చూసే చాలామంది దుండగులు భయపడి దాడులు చెయ్యడానికి భయపడతారు. రాజకీయ నాయకులకు వీరు రక్షణ కవచంలా పనిచేస్తారు.

Content above bottom navigation