ప్రేమ జంటపై చేతబడి .

116

చేతబడి గురించి మీరు చాలా విని ఉంటారు. దానితో మనిషి జీవితాన్నే మార్చేయవచ్చని మీరు వినే ఉంటారు. అది ఉందొ లేదో కానీ ఒకప్పటి కాలంలో చేతబడి అనేది ఎక్కువగా వినిపించేది. అంతేకాదు మన అమ్మమ్మలు తాతయ్యలు ప్రత్యక్షంగా చూశామని చెబుతుంటారు. చేతబడికి గురైనవాళ్లను, చేతబడి చేయించేవాళ్లను గుర్తించామని చెబుతుండేవారు. కానీ ఈ టెక్నికల్ యుగంలో కూడా చేతబడిని నమ్మేవాళ్లు ఉన్నారంటే.. అతిశయోక్తి కాదు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో తమపై క్షుద్రపూజల జరిగినట్టు ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

కడప జిల్లా కమలాపురానికి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి తమపై క్షుద్రపూజలు చేశారని ఓ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ తల్లిదండ్రులే తమపై ఈ రకమైన పూజలు చేయించారని ఆరోపించారు. ఏడాది క్రితం నెల్లూరు కు చెందిన ప్రత్యూష, మునిభార్గవ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు ఒప్పుకోరేమో అని ఆ వారిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ప్రేమ పెళ్ళికి ప్రత్యూష్ తల్లిదండ్రులు అంగీకరించలేదు. అంతేకాదు అప్పటి నుంచి భర్తను వదిలిరావాలని ప్రత్యూషపై ఆమె తల్లిదండ్రుల ఒత్తిడి తీసుకొస్తున్నారు.

అయితే ప్రత్యూష మాత్రం తాను భర్తను వదిలి రానని వారికి స్పష్టం చేసింది. ఎక్కువగా విసిగిస్తే కేసు పెట్టాల్సి ఉంటుందని తల్లిదండ్రులను బెదిరించింది. దాంతో కొన్ని రోజులు సైలెంట్ గానే ఉన్న ప్రత్యూష తల్లిదండ్రులు మళ్ళీ ఆమెను ఇబ్బందిపెడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా భార్గవ్ అనారోగ్యానికి గురయ్యాడు. ఎంతో హుషారుగా ఉండే భార్గవ్ ఒక్కసారిగా మంచానా పడ్డాడు. డాక్టర్స్ కు చూపించిన కూడా లాభం లేకుండా పోయింది. దీంతో ప్రత్యూషకు తన తల్లిదండ్రుల మీద అనుమానం వచ్చింది. ఆ వైపుగా విచారించగా, ఈ మధ్యనే ప్రత్యూష తల్లిదండ్రులు పూజలు చేయించినట్టు తెలిసింది. ఆ పూజలు బాణామతి పూజలు అని ప్రత్యూష తెలుసుకుంది.

తన తల్లిదండ్రులు తన భర్తపై బాణామతి చేయించారని ప్రత్యూష, ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప జిల్లా కమలాపురానికి చెందిన పవన్ క్షుద్రపూజలు చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తాను ఎలాంటి క్షుద్రపూజలు చేయలేదని, కేవలం గణపతి పూజలు మాత్రమే చేశానని పవన్ కుమార్ పోలీసులకు తెలిపారు. మరోవైపు తమకు క్షుద్ర పూజలు చేయాల్సిన అవసరం లేదని ప్రత్యూష తల్లిదండ్రులు వాదిస్తున్నారు.

Content above bottom navigation