ఫేస్‌బుక్ ప్రేమ…దివ్యాంగుడిని పెళ్లాడిన అందాల తార

155

ప్రేమ ఎలాంటి స్వార్థాన్ని కోరుకోదు.. స్వచ్ఛమైన ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని చెప్పాలి
ప్రేమకు వయస్సు అడ్డు కానే కాదు.. అది ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఎవరు చెప్పలేరు.
కులం మతం ప్రాంతం విభేదాలు దేనికైనా ఉంటాయి కాని ప్రేమ‌కు మాత్రం ఉండ‌వు
ఎన్ని ప్ర‌తిబంధ‌కాలు వ‌చ్చినా అనుబంధంగా క‌లిసే ఉంటాయి కొన్ని ప్రేమ జంట‌లు
అమ్మాయి స్వ‌ర్గ‌లోక‌పు సుంద‌రిలా ఉంటే ఆమెకు వ‌చ్చే సంబంధాలు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు
కోటీశ్వ‌రుల సంబంధాలు ఆమె ఇంటికి వ‌స్తున్నాయి
అయినా ఆమె స్వ‌చ్చ‌మైన ప్రేమ‌తో ఓదివ్యాంగుడ్ని ప్రేమించింది
అత‌నినే వివాహం చేసుకుంది
ఈ ల‌వ్ స్టోరీ విన్న‌వారు ఎవ‌రైనా ఆ అమ్మాయిని చూసి, 50కేజీల అందాల బంగారు బొమ్మ అంటున్నారు
మ‌రి ఆమె ఫేస్ బుక్ ల‌వ్ స్టోరీ నుంచి మ్యారేజ్ డైరీ వ‌ర‌కూ ఈ స్టోరీలో చూద్దాం.

ఆమె చూడ‌టానికి బంగారు బొమ్మ అందానికి పర్యాయపదంలా ఉంటుంది.
అనుకోకుండా ఓ దివ్యాంగుడిని ఫేస్‌బుక్‌లో చూసి ప్రేమించింది. పెద్దలు వద్దని చెబుతున్నా వినకుండా అతడినే పెళ్లాడింది. ఇదేం నిజంగా ఇది కేరళలో జరిగిన ఓ యథార్థ సంఘటన.

This Kerala couple proves love knows no 'handicap', ఫేస్‌బుక్ ప్రేమ…దివ్యాంగుడిని పెళ్లాడిన యువతి

కేరళ త్రిశూర్​ జిల్లాలోని తాజెకాడ్​కు నివశించే పవన్… ఆరేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు. ఈ ప్రమాదంలో ప్రాణం పోలేదు కానీ తుంటి కింద భాగం మొత్తం చచ్చుబడిపోయింది. వీల్ ఛైర్ లేకపోతే అతడు ఎక్కడికి కదలలేడు. చిన్న, చిన్న అవసరాలకు సైతం పక్కవాళ్లపై ఆధారపడాల్సిన పరిస్థితి. అయినా అతడు ఆత్మవిశ్వాసం కొల్పోలేదు. రకరకాల ఆలయాలకు వెళ్తూ, ఉత్సవాలలో పాల్గొంటూ స్పూర్తిదాయక ప్రసంగాలు చేసేవాడు. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అత‌ను పెద్ద స్టార్ అయ్యాడు, అత‌ను చెప్పే మాట‌ల‌కు అంద‌రూ అభిమానులు అయ్యారు.

ఆ వీడియోలు తిరువనంతపురానికి చెందిన షహానా అనే యువతి కంటపడ్డాయి. వెంటనే ఫేస్‌బుక్ ద్వారా ప్రణవ్ ఫోన్ నంబర్ తీసుకుని అతడితో మాట్లాడింది. కొన్ని రోజుల తర్వాత అతడికి తన ప్రేమని వ్యక్తపరిచింది, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. ప్రణవ్‌కు షహానా అంటే ఇష్టమున్నా, తన పరిస్థితి దృష్యా వివాహానికి వెనకడుగు వేశాడు. అయినా షహానా పట్టు వీడలేదు. అతని కోసం ఇంట్లో నుంచి వచ్చేసింది. ఇరు కుటుంబాలు నచ్చజెప్పినా వినలేదు. ప్రణవ్​ను డైరెక్ట్‌గా చూశాక కూడా ఆమె అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది, బంధం మనసుకు సంబంధించినది అని చెప్పింది. దీంతో కొడుంగల్లూర్​లోని ఓ ఆలయంలో ఫిబ్రవరి 3న ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకొని ఒక్కటైంది.

అయితే ఆమె తల్లిదండ్రులు అత‌ని త‌ల్లిదండ్రులు ఇద్ద‌రికి తోడు ఉంటాము అన్నారు, అక్క‌డ స్దానికులు అంద‌రూ కూడా ఈ వివాహ‌నికి హ‌జ‌రయ్యారు, ఈ వివాహం పై వారిని మీడియా ప్ర‌శ్నించ‌గా, అత‌ని వైక‌ల్యం కాదు అత‌ని మ‌న‌సు చూసి ఇష్ట‌ప‌డ్డాను అని ఆమె చెబుతోంది. అత‌ను కూడా ఆమె అందం కాద‌ని ఆమె మ‌న‌సు చూసి న‌చ్చింది అని చెప్పాడు, వీరి లైఫ్ జ‌ర్నీ నిండు నూరేళ్లు బాగోవాల‌ని మ‌నం కూడా కోరుకుందాం.

Content above bottom navigation