ఫేస్ బుక్ లో పెళ్ళైన మహిళ ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు..చివరికి వాళ్ళ గతి ఏమైందో తెలిస్తే షాక్..

కొన్ని పరిచయాలు భవిష్యత్ లో మంచి పరిణామాలకు దారితీస్తే కొన్ని పరిచయాలు మాత్రం విషాదాలు నింపుతాయి.ముఖ్యంగా ఈ మధ్య యువత ఎక్కువగా ఫేస్ బుక్ పరిచయాలు చేసుకుంటున్నారు. ఎవరో తెలియని వ్యక్తితో ఫేస్ బుక్ పరిచయం చేసుకుని తర్వాత చాటింగ్ చేసుకుని ప్రేమలో మునిగితేలుతున్నారు. అయితే అలాంటి పరిచయాలు కొందరి జీవితాలలో శోకాన్ని నింపుతున్నాయి. అయితే ఇప్పుడు ఒక పెళ్లి కానీ యువకుడు పెళ్ళైన మహిళతో పరిచయం చేసుకున్నాడు. తర్వాత ప్రేమించుకున్నారు కూడా.మరి చివరికి వాళ్ళ గతి ఏమైంది. ఇప్పుడు పూర్తీ వివరాలతో తెలుసుకుందాం.

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాసులు కుమారుడు శ్రావణ్‌ (30) పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరులోని థర్మల్‌ ప్రాజెక్టులో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పని చేస్తున్నారు. అదే జిల్లా పులివెందులకు చెందిన రఘు భార్య దివ్యతో శ్రావణ్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. రఘుకు దివ్య స్వయాన అక్క కూతురు. పదేళ్ల క్రితం వీరి వివాహమైంది. ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన దివ్య, శ్రావణ్‌ కొంత కాలం నుంచి ప్రేమాయణం నడిపిస్తున్నారు. ఇద్దరూ ఊరు వదిలిపెట్టి ఒకటిగా జీవించాలనుకున్నారు. అయితే 13వ తేదీన ఊరు వదిలిపెట్టి పోయారు. భర్త రఘు దివ్య ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దివ్య, శ్రావణ్‌ 15 వ తేదీ గురువారం నంద్యాలకు చేరుకున్నారు. ఉదయం నంద్యాల రైల్వేస్టేషన్‌కు చేరుకున్న శ్రావణ్‌ తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు చెప్పారు. వెంట తెచ్చుకున్న పురుగుల మందును కూల్‌డ్రింక్‌ లో కలుపుకుని ఇద్దరూ తాగారు.

అపస్మారక స్థితిలో ఉన్న వీరిని స్థానికులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రావణ్‌ చికిత్స పొందుతూ మృతి చెందగా దివ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. దివ్యను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.అయితే ఈ ఘటనలో రైల్వే, సివిల్‌ పోలీసుల తీరు విమర్శలకు తావిచ్చింది. అపస్మారకస్థితిలో ఉన్న వీరిని 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఇంతజరిగినా రైల్వే పోలీసులుగానీ, త్రీటౌన్‌ పోలీసులుగానీ స్పందించక పోవడం గమనార్హం. రైల్వేస్టేషన్‌లో ఆత్మహత్యాయత్నం చేశారని త్రీటౌన్‌ పోలీసులు, బయట పురుగుమందుతాగి స్టేషన్‌లోకి వచ్చారని రైల్వే పోలీసులు ఎవరికి వారు తమకు సంబంధం లేదంటూ పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఏది ఏమైనా ఫేస్ బుక్ పరిచయం ఇద్దరి ప్రాణాలు పోయేలా చేసింది.ఆ అమ్మాయి అయినా బతకాలని కోరుకుందాం.

Content above bottom navigation