ఫోటో తెచ్చిన తంట‌.! క‌ష్టాల్లో ప్రేమ‌జంట‌.!!

ప్రేమ అనేది చాలా గొప్పది.దానిని వర్ణించడానికి మాటలు సరిపోవు.ఈ స్పృష్టిలో ఉన్న పదాలన్నిటిని కలిపినా ప్రేమ గొప్పతనం గురించి చెప్పలేము.అంత గొప్పది ప్రేమ.అయితే ఈకాలం ప్రేమలు ఇలా ఉన్నాయా అంటే అస్సలు లేవు.లవ్ చెయ్యడం నచ్చకపోతే వదిలేయడం ఇదే ఈ కాలం కుర్రాళ్లకు తెలిసిన ప్రేమ.అయితే కొంతమంది చిన్న వయసులో ప్రేమలో పడతారు.ప్రేమ అంటే ఏమిటో కూడా తెలియని వయసులో ప్రేమలో పడడం పెళ్లి చేసుకోవడం తర్వాత అంతా మంచిగా ఉంటె కలిసుండడం లేదా విడిపోవడం..ఇలా చాలా మంది చేస్తున్నారు.ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా కొంచెం అలాంటిదే.చిన్న వయసులో ప్రేమలో పడిన ఇద్దరు ప్రేమికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.మరి వారు పెట్టిన ఆ పోస్ట్ వివరాలు తెలుసుకుందామా..

కేర‌ళ‌లోని అట్టింగ‌ల్ ప్రాంతానికి చెందిన హ్యారీస్ క్రిస్టియ‌న్ మ‌త‌స్థుడు, అత‌ను షాహానా అనే ఓ ముస్లీం అమ్మాయిని ప్రేమించాడు.ప్రేమ గురించి ఇంట్లో చెబితే ఒప్పుకోరు ఎందుకంటే ఇద్దరి మతాలు వేరు.కులాలు వేరు అయితే ఒప్పుకోరు ఇక మతాలు వేరైతే ఒప్పుకుంటారా చెప్పండి.ఒప్పుకోరు అందుకే ఒక నిర్ణయానికి వచ్చారు.10 రోజుల క్రితం ఇద్ద‌రూ ఇంటి నుండి పారిపోయి పెళ్ళిచేసుకున్నారు.పెళ్లి చేసుకున్నారు సరే మరి ఈ విషయం అందరికి తెలిసేలా చెయ్యాలి కదా అందుకే వారి పెళ్లికి సంబంధించిన ఫోటోల‌ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.పోస్ట్ చెయ్యగానే ఈ విషయం స్నేహితులకు అమ్మాయి బంధువులకు అబ్బాయి బంధువులకు అందరికి తెలిసింది. ఆ తర్వాత అమ్మాయి త‌ర‌ఫు బందువులు హ్యరీస్ ను బెదిరించ‌డం స్టార్ట్ చేశారు.ఇటీవ‌లే వివాహం చేసుకున్న ఆ జంట త‌మ‌కొచ్చిన క‌ష్టాన్ని సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది.

Image result for ఫోటో తెచ్చిన తంట‌.! క‌ష్టాల్లో ప్రేమ‌జంట‌.!!

మ‌మ్మ‌ల్ని చంప‌డం ద్వారా మీరేం పొందుతారు…! నా ప్రేమ‌ను స‌మాధి చేసుకోవ‌డం నాకిష్టం లేదు, మా పెళ్ళినాటి ఫోటో ఓ ఫ్రేమ్ గా మిగిలిపోవ‌డం మాకిష్టం లేదు. నాకు ఆమె ఇష్టం, ఆమెకు నేను ప్రాణం.మ‌తాల ప్ర‌స్తావ‌నను మా ప్రేమ‌లోకి లాగ‌కండి.మా అంత‌ట మ‌మ్మ‌ల్ని ప్ర‌శాంతంగా బ‌త‌క‌నివ్వండి అంటూ ఆ యువ‌కుడు సోష‌ల్ మీడియా ద్వారా త‌న బాధ‌ను పంచుకున్నాడు.అంతే సోష‌ల్ మీడియా నుండి ఈ జంట‌కు ఫుల్ స‌పోర్ట్ ల‌భిస్తోంది. హ్యారీస్ వాళ్ళ పేరెంట్స్ ను కూడా బెదిరించ‌డంతో హ్యారీస్ పోలీసుల‌ను ఆశ్రయించాడు.అయితే వీరి ప్రేమకు అడ్డు తగలలా లేదా ఒప్పుకోవాలా అని పోలీసులు కూడా ఆలోచిస్తున్నారు.ఎందుకంటే వీరిద్దరి వయసు 20 ఏళ్ల లోపే.వీరి ప్రేమ నిజ‌మే అయితే మంచిదే కానీ ఇద్ద‌రి వయ‌స్సు 20 లోపు కావ‌డమే ఈ బంధం క‌ల‌కాలం నిలుస్తుందా? అనేది డౌట్ అంటున్నారు కొంత‌మంది.అయితే వారి ప్రేమ నిజం అయితే వాళ్ళు ఎలాంటి కష్టం లేకుండా సంతోషంగా ఉండాలని కోరుకుందాం.మనం కూడా ఆ ప్రేమికులకు తోడుగా నిలుద్దాం.వారిని విడదీయవద్దని సోషల్ మీడియా ద్వారా ఆ పోలీసులకు తెలియజేద్దాం.

Content above bottom navigation