ఫ్యాక్ట్ చెక్ వ్యాధి సోకిన వేల మందిని అధికారికంగా హతమార్చుతున్న చైనా..

అక్కడ బ‌తికి ఉన్న జంతువుల‌ని వేడి వేడి సూప్ తో తింటారు
లైవ్ గా జంతువుల‌ని తిన‌డంలో వారికి ఆనందం ఉంటుందట
కిరాత‌క‌మైన ఫుడ్ హ్యాబిట్స్ అంటే చైనీయుల‌వే అని చెప్పాలి
ఎక్క‌డైనా కొత్తర‌కం జంతువు మాంసం క‌నిపిస్తే ఎంత రేటైనా తింటారు
ఇదే చివ‌ర‌కు ఆ దేశానికి అన‌ర్దం తెచ్చింది.
పాములు పురుగులు నుంచి ఏనుగులు మొస‌ళ్ల వ‌ర‌కూ అన్నింటిని తింటారు
ఇదే కొత్త వైర‌స్ లు పుట్టించి వారి ప్రాణాల‌ను హ‌రిస్తోంది.

Image result for karona virus

జంతువులు బతికి ఉన్నప్పుడే వాటిని అత్యంత క్రూరంగా హింసించి తినేసే కిరాతకులు చైనీయులు. ఎంతో కాలంగా ఎన్నో జీవరాశులను జాలి, దయ లేకుండా చంపేసిన చైనీయులను కరోనా వైరస్ రూపంలో దేవుడు శిక్షిస్తాడని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అలాగే కరోనా వైరస్ వచ్చి చాలామంది చైనీయులు చనిపోతున్నారు.. .

అయితే, చైనా దేశానికి సంబంధించిన ఒక వార్త గత కొన్ని రోజులుగా నెట్టింట హల్ చల్ చేస్తుంది. అదేంటంటే.. కరోనా వైరస్ సోకిన కొన్ని వేల మంది పేషంట్లను చైనా చంపబోతుందని.. అలా చంపకపోతే.. ఆ వైరస్ ఇతర వారికి కూడా సోకి వారి దేశ ప్రజలంతా చనిపోయే పరిస్థితి వస్తుందని ఒక ప్రముఖ ఇంగ్లీషు వెబ్సైటు ప్రచురించింది. దాని తర్వాత చాలా ఇతర వెబ్ సైట్ లు కూడా ఈ వార్తని ప్రచురించాయి. కానీ చైనా దేశం కరోనా వైరస్ కి విరుగుడు కనిపెట్టకుండా, వ్యాధి సోకిన వారికి చికిత్స చేయకుండా చంపేస్తుందా? అని ప్రశ్నిస్తే అది అబద్ధం అని చెప్పవచ్చు.

ఎందుకంటే ఈ వార్తని మొట్టమొదటిగా ప్రచురించింది ab-tc అనే ఒక ఇంగ్లీషు ఆన్లైన్ వార్తాపత్రిక. అయితే గతంలో ఈ వెబ్సైట్ రాసే వార్తలన్ని అవాస్తవమని ప్రపంచవ్యాప్తంగా వెబ్సైట్ల క్రెడిబిలిటీని చెక్ చేసే snopes కూడా తేల్చి చెప్పేసింది. మరోవైపు చైనా దేశంలో ప్రముఖ వార్తా వెబ్సైట్లు చైనా ప్రభుత్వం వ్యాధిగ్రస్తులను చంపేస్తున్నట్లు ఎటువంటి సమాచారాన్ని ప్రచురించలేదు. దీంతో ఈ వార్త కేవలం కల్పించి రాసినదని స్పష్టమవుతుంది.

ఒకవేళ కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చేయలేనంత స్థాయికి చేరుకుంటే… ఆ వైరస్ సోకిన వారిని ఏ మాత్రం ఆలోచించకుండా చంపడానికి చైనా వెనకాడదని చెప్పుకోవచ్చు. కొందరు దీనిని అవును చైనా సీక్రెట్ మిషన్ గా చేయవచ్చు, కుటుంబాలని ఒప్పించవచ్చు అని కూడా కొందరు అంటున్నారు.. ఏదేమైనా కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం చైనా దేశంలోని జంతువులు చంపబడడం లేదు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చాలామంది సంబరపడిపోతున్నారు. అలాగే శాశ్వతంగా జంతువులను చంపి తినడం మానేస్తే… భవిష్యత్తులో కరోనా లాంటి భయంకరమైన వైరస్ లు వ్యాపించవని చైనా ప్రజలకు చాలా మంది సలహాలు ఇస్తున్నారు. కొంద‌రు మాత్రం ఆ జంతువుల‌ని ఇటీవ‌ల చంపారు ఇప్పుడు మార్పు వ‌చ్చి వాటిని అడ‌వుల్లో తోట‌ల్లో వ‌దిలేస్తున్నారు.. అయినా చైనా ఓ సంవ‌త్స‌రం పాటు ఇలా జంతు హింస మానేస్తే , క‌చ్చితంగా కొత్త వైరస్ లు పుట్టుకురావు అనేది ప్ర‌పంచ వైద్య ఆరోగ్య స‌ర్వే కూడా చెబుతోంది.

Content above bottom navigation