బయ్య సన్నీ యాదవ్ రియ‌ల్ స్టోరీ

95

అత‌ను హీరో కాదు క్రికెట‌ర్ కాదు ఓ సివిల్ స‌ర్వెంట్ కాదు
సాధార‌ణ బైక్ రైడ‌ర్ అదే అత‌నికి సెల‌బ్రెటీ స్ధాయిని తెచ్చింది
యూ ట్యూబ్ లో బైక‌ర్ గా త‌న క్రేజ్ ని అమాతం పెంచేసింది
నార్త్ ఇండియాకే ప‌రిమితం అయిన ఈ క్రేజ్ సౌత్ ఇండియాలో అత‌నికి ద‌క్కింది
నేను ప‌లానా ప్లేస్ కు వ‌స్తున్నా అని చిన్న పోస్ట్ పెడితే వెల్ కం ప‌లికేందుకు వంద‌ల మంది వ‌స్తున్నారు
ఇది అత‌ను సంపాదించుకున్న అభిమానం..కోట్లు పెట్టినా దొర‌క‌ని ప్రేమ‌
అత‌ను ఎక్క‌డికి వెళ్లినా సెల్ఫీల కోసం పోటీ పడుతున్నారు.
బైక్‌ రైడర్‌గా రెండేళ్ల లోనే యూట్యూబ్‌లో లక్షల మంది సబ్‌స్ర్కైబర్లతో పాటు
రెండు తెలుగు రాష్ర్టాల్లో వేలాది మంది అభిమానులను సైతం సంపాదించుకున్నాడు
మోటో వ్లాగర్స్‌ బైక్‌ రైడింగ్స్ తో తెలుగులో అద‌ర‌గొడుతున్నాడు..
నేపాల్‌తోపాటు లడఖ్‌ ట్రిప్‌ సైతం పూర్తి చేసి ఘనత సాధించాడు.
అత‌నే తెలంగాణ ముద్దుబిడ్డ‌ బయ్య సన్నీ యాదవ్
అత‌ని రియ‌ల్ స్టోరీ తెలుసుకుందాం.


బయ్య సన్నీ యాదవ్‌.. యూట్యూబ్‌ చూసే వాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండల కేంద్రం స‌న్నీ స్వస్థలం. తల్లిదండ్రులు బయ్య శ్రీదేవి, రవీందర్ … సన్నీ అసలు పేరు సందీప్‌ యాదవ్‌. కబడ్డీ ప్లేయర్‌ అయిన సన్నీ తమ్ముడు కల్యాణ్‌ ప్రస్తుతం ప్రో కబడ్డీకి ఎంపికయ్యాడు. 8వ తరగతి నుంచే బైక్‌ డ్రైవింగ్‌ చేయడం నేర్చుకున్న సన్నీకి.. లాంగ్‌ రైడ్‌ వెళ్లాలనే కోరిక ఉండేది, 2012లో పదో తరగతి పూర్తి చేసిన తర్వాత డిప్లోమాలో చేరినా పూర్తి చేయలేకపోయాడు. ఆ తర్వాత ఓపెన్‌ డిగ్రీ పూర్తి చేశాడు. తల్లిదండ్రుల సహకారంతో 2013లో పల్సర్‌ 220సీసీ బైక్‌ను కొన్న సన్నీ.. అప్పటి నుంచే రైడింగ్‌ చేయడం ప్రారంభించాడు.

Image result for bayya sunny yadav

తల్లిదండ్రులు నిర్వహించే మెడికల్‌ షాపులో చేదోడు వాదోడుగా ఉంటూ.. చదువుతోపాటు వాలీబాల్‌ ఆటను సైతం ఇష్టంగా ఆడటం మొదలుపెట్టాడు. తండ్రి రవీందర్‌ ప్రొఫెషనల్‌ వాలీబాల్‌ ప్లేయిర్‌ కావడంతో.. తన పిల్లలను సైతం చదువు అనే కోణంలోనే కాకుండా క్రీడల్లోనూ ప్రోత్సహిస్తూ వచ్చారు. సన్నీ 2016లో కేటీఎమ్‌ ఆర్సీ200బైక్‌ కొనుగోలు చేసిన తర్వాత లాంగ్‌ రైడ్స్‌ వెళ్లడం స్టార్ట్‌ చేశాడు. తనకు ఇష్టమైన మెటో వ్లాగింగ్‌ కోసం యూట్యూబ్‌లో వెతికితే.. తెలుగులో ఎవరూ చేయడం లేదని గుర్తించి తానే మొదలుపెట్టాలని నిర్ణయించాడు. 2017లో బయ్య సన్నీ యాదవ్‌ అనే తన పేరుతోనే యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభించాడు.


అస‌లు సన్నీ యాదవ్ ఆలోచ‌న ఏమిటి
అస‌లు ఎలా ఈ ఛాన‌ల్ స్టార్ట్ చేసి ఏ టూర్ ప్లాన్ చేశాడు
ఏ ప్రాంతాల‌కి వెళ్లాడు .. ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ని ఎలా సంపాదించుకున్నాడు
త‌న‌కు ఇంత పేరు ఎలా వ‌చ్చింది.
స‌న్నీ చేస్తున్న కార్య‌క్ర‌మాలు ఏమిటి
బైక్ రైడ‌ర్ నుంచి బైక్స్ లాంచ్ చేసే స్టేజ్ కు ఎలా వెళ్లాడు..
అభిమానుల‌కు ఆక‌ట్టుకునేలా స‌న్నీలో ఉన్న ఆ స్పెషాలిటీ ఏమిటి ఇప్పుడు చూద్దాం


స‌న్నీయాద‌వ్ ముందు ప్లాన్ చేసుకుని త‌న టూర్ అంతా వీడియో తీస్తూ ల‌డ‌ఖ్ వెళ్లాడు, అక్క‌డ నుంచి వ‌చ్చిన త‌ర్వాత‌
ఒక్కసారిగా ఫాలోవర్స్‌ పెరగడంతోపాటు.. ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేక కార్యక్రమాలు సైతం చేయాల్సి వచ్చింది. రెండు తెలుగు రాష్ర్టాల్లోని అనేక జిల్లా కేంద్రాలు, చిన్న చిన్న పట్టణాల్లోనూ ఫ్యాన్స్‌ మీట్‌ నిర్వహించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియాలోని తన ఖాతాలో మెసేజ్‌ చేయడం ద్వారానే ప్రతీ మీట్‌ అప్‌కూ కనీసం 200మంది అభిమానులు స్వచ్ఛందంగా వచ్చి సన్నీ కోసం ఎదురు చూస్తున్నారు. సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ స్పోర్ట్స్‌ బైక్‌ షోరూమ్‌ నిర్వాహకులు సైతం బయ్య సన్నీ యాదవ్‌తో తమ కొత్త మోడల్‌ బైక్‌ను ఇండియాలో లాంచ్‌ చేయించారు.

అనారోగ్యానికి గురైన తమ కుమారుడి కోసం ఒక్కసారి తన ఇంటికి రావాలని గుంటూరులోని ఓ ప్రముఖ డాక్టర్‌ సన్నీని పిలిచి మరీ తన కొడుకు ముచ్చట తీర్చాడంటే సన్నీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ అర్థం చేసుకోవచ్చు. లడఖ్‌ ట్రిప్‌ తర్వాత మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్‌ ట్రిప్‌లే కాకుండా ఇటీవలే నేపాల్‌ ట్రిప్‌ కూడా వెళ్లొచ్చాడు. 16రోజులపాటు సుమారు 8వేల కిలోమీటర్ల ప్రయాణం సాగించాడు. లండన్‌ వరకు బైక్‌పై వెళ్లే టూర్‌ టార్గెట్‌గా భవిష్యత్తు ప్రణాళికలతో సన్నీ ముందుకు సాగుతున్నాడు. ఆసక్తితోపాటు శ్రమించే గుణం ఉంటే విజయం మన వెంటే ఉంటుందని.. రైడింగ్‌ మాత్రమే కాదు కెమెరా షూటింగ్‌, వీడియో ఎడిటింగ్‌ సహా అన్ని పనులూ తానే చేసుకుంటూ ఉంటాడ‌ట‌.


స‌న్నీయాధ‌వ్ ఛాన‌ల్ స్టార్ట్ చేసిన స‌మ‌యంలో చాలా ఇబ్బందులు వ‌చ్చాయట‌
అంత సులువుగా ఈ క్రేజ్ ఫేమ్ రాలేదు అంటున్నాడు
క్రీడ‌ల‌కు సంబంధించిన వీడియోల నుంచి ఈ స్దాయికి వ‌చ్చాడు
టూర్ల‌కు డ‌బ్బు కూడా వేల‌ల్లో ఖ‌ర్చు అవుతుంది.
త‌ల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా ఉంద‌ట‌.
త‌ను గ‌తంలోప‌డిన క‌ష్టాలు చెబుతున్నాడు అవి చూద్దాం.

మొదట్లో తన యూట్యూబ్‌ చానెళ్లో చుట్టు పక్కల గ్రామాల్లో తాను తీసిన కబడ్డీ, వాలీబాల్‌ టోర్నమెంట్లు, ఇతర వీడియోలు పోస్ట్‌ చేసే వాడు. వాటికి పెద్దగా రెస్పాన్స్‌ రాలేదు. తాను రైడింగ్‌కు వెళ్తున్నందున వాటిని కూడా పోస్ట్‌ చేయాలనే ఆలోచనతో.. 2018 డిసెంబర్‌లో తాను వెళ్లిన విశాఖపట్నం టూర్‌ వీడియోలతో రైడర్‌గా యూట్యూబ్‌ ప్రయాణం ప్రారంభించాడు. తొలి ట్రిప్‌లోనే 1400కిలోమీటర్లు ప్రయాణం చేసిన సన్నీ.. జర్నీ వివరాలతోపాటు మధ్య మధ్యలో తనకు కనిపించే ప్రతి సన్నివేశాన్నీ వివరిస్తూ వచ్చాడు. సొంతంగానే వీడియో షూటింగ్‌తోపాటు ఎడిటింగ్‌ నేర్చుకోవడమే కాకుండా.. అన్ని పనులు తానే చేసుకుంటూ ఇప్పటి వరకు పదికి పైగా టూర్లు పూర్తి చేశాడు. 2018లోనే కేటీఎమ్‌ డ్యూక్‌ 390 బైక్‌ కొనుగోలు చేసిన సన్నీ.. వైజాగ్‌ తర్వాత 1200కిలో మీటర్లతో తిరుపతి టూర్‌.. జనవరి 2019లో శ్రీశైలం-మహానంది-గండి కోటకు 1200 కిలోమీటర్లు.. కర్ణాటకలో ని హంపి టూర్‌.. ఆ తర్వాత మూడు వేల కిలోమీటర్లతో దక్షిణ భారత దేశంలోని నందిహిల్స్‌-మైసూర్‌-ఊటీ- కొచ్చి- కన్యా కుమారి- మధురై- పుదుచ్చే రి టూర్‌ పూర్తి చేశాడు. గోవా, లక్నవ రం, సూర్య లంక, మహారాష్ట్రలోని లోనావాలా ఇలా మోటార్‌ సైకిల్‌ పైనే సన్నీ చుట్టి వచ్చిన రైడ్లు చాలా ఉన్నాయి.

ముందు తల్లిదండ్రుల సహకారంతో టూర్లకు డబ్బులు సమకూర్చు కున్నా.. ఆ తర్వాత యూట్యూబ్‌ ద్వారా వచ్చే ఆదాయంతోపాటు స్పాన్సర్ల సహకారంతో ప్రయాణాలు పూర్తి చేస్తున్నాడు. 2019 జూన్‌లో నూతనకల్‌ నుంచి హిమాలయాల్లో ఉన్న లడఖ్‌ టూర్‌కు వెళ్లాడు. 22రోజులపాటు మొత్తం 7500కిలోమీటర్ల ప్రయాణం చేసిన సన్నీ.. ఎన్నో సాహసాలు, ఎన్నో ప్రమాదకర ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఆర్మీ క్యాంపులో బస చేయడం తో పాటు.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అప్పటికి 50వేలు మాత్రమే ఉన్న సంఖ్య.. లడఖ్‌ టూర్‌తో బైక్‌ రైడర్‌గా సన్నీ యూట్యూబ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య లక్షన్నరకు పెరిగింది. అప్పటి నుంచి ఇక వెనుతిరిగి చూసు కోకుండా ప్రతి నెలా వెయ్యికి పైగా సబ్‌ స్ర్కైబర్లు పెరుగుతూనే ఉన్నారు. నూతనకల్‌ నుంచి మొదలు పెట్టిన ప్రయాణం సూర్యాపేట-హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ -ఆగ్రా-ఢిల్లీ-అమృత్‌ సర్‌- సోన్‌మార్గ్‌- అనంతనాగ్‌ జమ్మూకాశ్మీర్‌)-శ్రీనగర్‌-కార్గిల్‌- లేహ్‌-మనాలి- చండీగడ్‌-ఢిల్లీ మీదుగా సాగింది.


లండన్‌ ట్రిప్‌ నా డ్రీమ్‌ రైడ్‌.. అంటున్నాడు స‌న్నీయాద‌వ్..
త‌న కుమారుడు న‌చ్చిన ప్రొఫెష‌న్ లో వెళ్లాడ‌ని, అదే త‌న‌కు స‌క్సెస్ తెచ్చింది అని సంతోషిస్తున్నారు అత‌ని త‌ల్లిదండ్రులు..
బైక్‌పై లండన్‌ వెళ్లడం నా డ్రీమ్‌ రైడ్‌. అంటున్న స‌న్నీకి అత‌ని కోరిక త్వ‌ర‌లో నెర‌వేరాలి అని మ‌నం కూడా విష్ చేద్దాం

Content above bottom navigation