బల్లి మీద పడితే ఏం జరుగుతుందో తెలుసా ?

148

బల్లి మన ఇంటి గోడలపై ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. బల్లి విషపురుగుగా చెబుతుంటారు. బల్లి కరవకపోయినా, బల్లి పడ్డ ఆహారాన్ని తీసుకుంటే దాని విషం వలన ప్రాణాలు పోతాయనే అపోహ కూడా ఉంది. అయితే అప్పుడప్పుడు బల్లి మనమీద పడ్డప్పుడు గానీ. మన మీద పాకుతూ వెళ్లినప్పుడు ఏదైనా అశుభం జరుగుతుందని, భవిష్యత్ లో ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుందని పెద్దలు చెబుతుంటారు. బల్లి మీద పడినప్పుడు దుష్పలితాలు ఎదురవుతాయని అంటారు. బల్లిశాస్త్రము ప్రకారం బల్లి మనుషుల శరీరంపై పడితే ఎటువంటి శుభఅశుభాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

మగవారిపై బల్లి మీద పడ్డప్పుడు : తలపై భాగాన పడితే మరణం వెంటాడుతున్నట్లు అని అర్థం. అదే ముఖంఫై పడితే ఆర్ధిక సమస్యలు తొలగి, లాభాల బాట పడతారని అర్థం. అదే ఎడమ కన్నుపై పడితే అంతా శుభమే జరుగుతుందని అర్థం. కుడి కన్నుపై పడితే చేసిన పని విజయవంతం కాదని అర్థం. ఏ పని చేసిన అపజయం ఎదురవుతుంది. అలాగే నుదురుపై పడితే ఇతర సమస్యలలో చిక్కుకోవడం, విడిపోవడం లాంటి పరిణామాలు ఎదురవుతాయి. కుడి చెంపపై పడితే ఏదో ఒక విషయంలో బాధపడతారని అర్థం. ఎడమ చెవిపై పడితే ఆదాయం బాగా వస్తుంది. పై పెదవిపై పడితే కలహాలు వెంటపడుతాయి. కింది పెదవిపై పడితే ఆదాయంలో లాభం కలుగుతుంది. రెండు పెదవుల మధ్య పడితే మృత్యువు సంభవిస్తుందని అర్థం. వీపుపై ఎడమ భాగంలో పడితే విజయం కలుగుతుంది. వీపుపై కుడి వైపు పడితే రాజ భయం ఉంటుంది. మణికట్టుపై పడితే అలంకార ప్రాప్తి కలుగుతుంది. అదే మోచేయిపై పడితే డబ్బు నష్టం కలుగుతుందని అర్థం. వ్రేళ్ళపై పడితే అనుకోకుండా బంధువులు, స్నేహితులు వస్తారని అర్థం. కుడి భుజంపై పడితే కష్టాలు, సమస్యలు వస్తాయి. ఎడమ భుజంపై పడితే పదిమందిలో అగౌరవం జరుగుతుంది. తొడలపై పడితే దుస్తులు, వస్త్రాలు నాశనం అవుతాయి. మీసాలపై పడితే కష్టాలు వెంటాడుతాయి. కాలి వేళ్ళ పై పడితే అనారోగ్య సమస్యలు వస్తాయి. పాదాలపై పడితే ప్రయాణానికి సిద్ధం అవ్వాలని అర్థం.

Image result for బల్లి మీద పడితే ఏం జరుగుతుందో తెలుసా ?

ఇక బల్లి స్త్రీల శరీరంపై పడ్డప్పుడు ఈ విధంగా ఉంటుంది. తలపై పడితే మరణ భయం, కొప్పుపై పడితే రోగాల భయం, పిక్కలపై పడితే బంధువుల రాక, ఎడమ కన్నుపై పడితే మీ భర్త / దగ్గరైన వారి ప్రేమ పొందుతారు. కుడి కన్నుపై పడితే మనోవ్యధ, అనవసరమైన టెన్షన్స్ వస్తాయి. రొమ్ము లేక వక్షస్థలంపై పడితే మంచి జరుగుతుంది. కుడి చెంపపై పడితే మగ శిశువు జన్మిస్తాడని అర్థం. కుడి చెవిపై పడితే ధన లాభం, పై పెదవిపై పడితే విరొధములు కలుగుతాయి. కింది పెదవిపై పడితే కొత్త వస్తువులను కొంటారు. రెండు పెదవులపై పడితే కష్టాలు, సమస్యలు ఫేస్ చేయాలి. వీపుపై పడితే మరణ వార్త వింటారు. గోళ్ళపై పడితే చిన్న చిన్న కలహాలు, గొడవలు వస్తాయి. చేతులపై పడితే ధన లాభం కలుగుతుంది. ఎడమ చేయిపై పడితే మెంటల్ స్ట్రెస్, అనవసరమైన ఒత్తిళ్లు ఉంటాయి. వేళ్ళపై పడితే నగల ప్రాప్తి కలుగుతుంది. కుడి భుజంపై పడితే కామరాతి ప్రాప్తి కలుగుతుంది. భుజంపై పడితే నగల ప్రాప్తి, తొడలపై పడితే కామము, మోకాళ్ళపై పడితే ఆదరణ, అభిమానం, బంధాలు పెరుగుతాయి. చీలమండముపై పడితే కష్టాలు వస్తాయి. కుడి కాలుపై పడితే శత్రు నాశనం జరుగుతుంది. కాలి వేళ్ళపై పడితే పుత్రుడు జన్మిస్తాడు.

ఇలా బల్లి అనేది మగవారిపై పడితే ఒకలా, ఆడవారిపై పడితే ఒకలా జరుగుతుంది. మీ మీద కూడా బల్లి ఎప్పుడైనా పడితే ఏం జరుగుతుందో ముందే తెలుసుకోండి.

Content above bottom navigation