బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో మ‌రిన్ని స‌డ‌లింపులు- ఇవేనా..?

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ కార‌ణంగా విధించిన లాక్ డౌన్ కొన‌సాగుతుంది. కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం ఇప్ప‌టికే ప‌లు స‌డ‌లింపులు ఇచ్చిన రాష్ట్ర ప్ర‌భుత్వం… మరిన్ని స‌డ‌లింపులు ఇచ్చే అవ‌కాశం క‌న‌ప‌డుతోంది.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి:

క‌రోనా వైర‌స్ పై బుధ‌వారం సాయంత్రం సీఎం కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఇప్ప‌టికే వ‌ర‌కు రాష్ట్రంలో లాక్ డౌన్ స‌డ‌లింపులు, పెరుగుతున్న క‌రోనా కేసులు, దేశంలో ఉన్న ప‌రిస్థితుల‌పై చ‌ర్చించ‌నున్నారు.

రాష్ట్రంలో ఇప్ప‌టికే ప్ర‌జా రవాణా వ్య‌వ‌స్థ మొద‌లైన గ్రేట‌ర్ ప‌రిధిలో బ‌స్సులు ఇంకా మొద‌లు కాలేదు. జిల్లాల్లోనూ హైద‌రాబాద్ వ‌చ్చే కీల‌క‌మైన స‌ర్వీసుల‌ను మాత్ర‌మే ఆర్టీసీ న‌డుపుతోంది. దీంతో గ్రేట‌ర్ ప‌రిధిలోని బ‌స్సుల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోబోతుంది.

ఇక వ‌ల‌స వెళ్లి వ‌చ్చిన వారికి కోర‌నా కేసులు భారీగా భ‌య‌ట‌ప‌డుతున్నాయి. సూర్యాపేట‌కు వ‌చ్చిన త‌బ్లీగ్ కేసుల లింకుల ద్వారా ఇంత భారీగా కేసులు రావ‌టం ఇద ప్ర‌థ‌మం. దీంతో వీటి విష‌యంలో ఏం చేయాల‌న్న అంశంపై కూడా చ‌ర్చించ‌నున్నారు.

ఇక తాజాగా రాష్ట్రంలో క‌రోనా టెస్టులు అతి త‌క్కువ‌గా చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు రావ‌టం, ప్ర‌భుత్వం తీరుపై హైకోర్టు కూడా ఘాటుగా స్పందించిన నేప‌థ్యంలో… ప్ర‌భుత్వప‌రంగా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించ‌నున్నారు.

ఇక రాష్ట్రంలో ఐటీ కంపెనీలు మొద‌లు కావ‌టంతో మెట్రో స‌ర్వీసుల‌పై కూడా ఓ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే విమానాలు సైతం మొద‌ల‌వ్వ‌టంతో మెట్రో సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌పై చ‌ర్చ సాగుతోంది. ఫూర్తిగా శానిటైజ్ చేసి మెట్రో సేవ‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని మెట్రో యాజ‌మాన్యం కోరుతున్న‌ట్లు తెలుస్తోంది.

దీంతో స‌ర్కార్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న అంశాల‌పై ఉత్కంఠ కొనసాగుతోంది.

Content above bottom navigation