బిచ్చగత్తె అనుకోని దగ్గరికి వెళ్లి అరెస్ట్ చేశారు.! తర్వాత అసలు నిజం తెలిసి వణికిపోయారు

105

బిచ్చగాడు సినిమా చూశారు కదా… అందులో హీరో కోటీశ్వరుడైనా గుడి మెట్ల దగ్గర బిచ్చమెత్తుకుంటాడు. అమ్మ కోసం అతను ఈ మార్గాన్ని ఎంచుకుంటాడు. ఆ సినిమా ఎంత హిట్టయ్యిందో అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఒక యాచకురాలు కూడా యాచకవృత్తిని చేపట్టింది. ఆర్థిక పరిస్థితులు బాగోలేకనో, లేక ఇంట్లో వారి కోసమో అనుకుంటే పొరపాటే. ఆమె కూడా బిచ్చగాడు సినిమాలో లాగా కోటీశ్వరురాలే. కానీ అమ్మకోసమో, నాన్న కోసమో అయితే అస్సలు కాదు. ఆమె వయసు 57 ఏళ్లు. ఆమెకు ఇప్పటికే ఐదు భవనాలు.. కోటిన్నర నగదు కూడా ఉంది. కానీ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఎందుకు..? అసలేమైంది..? అనే వివరాల్లోకి వెళ్తే..

ఈజిప్టుకు చెందిన నఫిసా చాలా కాలం నుంచి స్థానికంగా ఉండే మసీదులు, యాత్రా స్థలాల వద్ద యాచిస్తున్నది. కాళ్లు లేనిదానిగా వీల్ చైర్ మీద కూర్చుని అందరి సానుభూతి పొందుతూ, అక్కడికి వచ్చిపోయేవారిని అడుక్కుంటుంది.. చాలా కాలంగా ఆమె ఆ చుట్టూ పక్కల తిరుగుతూ అడుక్కుంటుంది. అయితే ఉన్నట్టుండి ఈజిప్టు పోలీసులు ఆమెను ఇటీవలే అరెస్టు చేశారు. ఆమెకు అంగవైకల్యం లేదని, నాటకాలు ఆడుతూ డబ్బులు సంపాదిస్తుందని, అలాగే ఆ చుట్టుపక్కల ఉండే ఒక ఇంట్లో దొంగతనం జరిగిందని, ఆ దొంగతనం చేసింది ఈమెనే అని పోలీసులకు అనుమానం వచ్చింది.

అనుకన్నదే తడువుగా ఆమెను పరీక్షించగా నఫీసాకు ఎటువంటి వైకల్యం లేదని తేలింది. ఆమె రెండు కాళ్లు సాఫీగానే ఉన్నాయని వైద్యులు తేల్చారు. వేరే ప్రాంతం నుంచి యాచించడానికి యాత్రాస్థలాలు, జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రదేశానికి రావడం, అక్కడ వీల్ చైర్ మీద కూర్చుని అడుక్కోవడం, ఆపై అక్కడ పని అయిపోగానే తిరిగి సాధారణంగా లేచి పోవడం చేయడాన్ని చూసిన పలువురు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఆమెను మోసం చేసిన కేసులో అదుపులోకి తీసుకున్నారు.

నఫీసాను విచారించగా పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. అయితే ఆమె యాచకురాలు కాదని, బాగా డబ్బున్న వ్యక్తి అని, అయితే కొడుకులు ఆమెను ఇంట్లో నుంచి వెలివేశారని చెప్పింది. అంతేకాకుండా కొడుకుల మీద ఉన్న కోపంతో యాచకురాలిగానే డబ్బులు సంపాదించానని చెప్పింది. ఇన్నాళ్లు యాచక వృత్తి ద్వారా ఆమె బాగానే సంపాదించింది. ఈజిప్టులోని గార్బియా, కులియుబియా లో ఆమెకు ఐదు ఇల్లులు ఉన్నాయి. అంతేగాక నఫీసా బ్యాంకు ఖాతాలో కోటిన్నర రూపాయల దాకా నగదు కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీల్ చైర్ మీద కూర్చుని, తనకు కాళ్ల లేవని నమ్మించి మోసం చేసినందుకు గానూ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణ జరుగుతున్నదని వారు తెలిపారు.

Content above bottom navigation