బ్రేకింగ్ఏపీలో తొలి కరోనా కేసు నమోదు జగన్ సంచలన నిర్ణయం

120

భారత్‌ను కరోనా భయం వీడడం లేదు. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య క్రమ క్రమం పెరుగుతోంది.
కేరళ రాష్ట్రంలో ఓ మూడేళ్ల బాలుడికి వైరస్ లక్షణాలు కనిపించడంతో కలకలం రేపింది. చిన్నారి కుటుంబం ఇటీవలే ఇటలీకి వెళ్లివచ్చింది. అక్కడ కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 07వ తేదీన వారు భారత్‌కు తిరిగి వచ్చారు. కోచి ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించారు. బాలుడికి కరోనా లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రును వేరుగా ఉంచారు. వీరి రక్తనమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు.

ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా భారత్‌లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 41కి పెరిగింది. ఈ స‌మ‌యంలో తెలంగాణ‌తో పాటు ఏపీలో కూడా ఈ క‌రోనా భ‌యాలు మ‌రింత పెరిగాయి, ఇప్ప‌టి వ‌ర‌కూ వైర‌ల్ వార్త‌లు వినిపించాయి కాని ఈసారి ఏకంగా ఏపీలో క‌రోనా పాజిటీవ్ కేసు న‌మోదు అయింది..

కరోనా వైరస్ లక్షణాలతో నిన్న నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో చేరిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. అతడి రిపోర్ట్స్ పాజిటివ్‌గా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఏపీలో నమోదైన తొలి కరోనా కేసుగా వెల్లడించారు వైద్యాధికారులు.
నగరంలోని చిన్న బజారులో ఓ వ్యక్తి రెండు రోజుల క్రితమే ఇటలీ నుంచి వచ్చారు. అతడు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో మంగళవారం అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. సదరు వ్యక్తికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించగా, వైరస్ లక్షణాలు కనిపించడంతో కరోరనా భాదితుల కోసం ప్రత్యేకించి ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వైద్యశాఖ అప్రమత్తమైంది

అంతేకాదు అత‌ని కుటుంబం అలాగే అత‌ను ఎవ‌రితో ట్రావెల్ చేశాడు ఇలా అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు, వారికి కూడా చికిత్స అవ‌స‌ర‌మైతే అందించ‌నున్నారు, ఒక్క‌సారిగా ఈ వార్త వైర‌ల్ అవ్వ‌డంతో నెల్లూరు జిల్లాలో ప్ర‌జ‌లు అల‌ర్ట్ అయ్యారు. దీనిపై జిల్లా వైద్య అధికారులు ఈ విష‌యం సెక్ర‌టేరియ‌ల్ ఉన్న‌త అధికారుల‌కి తెలిపారు, దీనిపై జిల్లా మంత్రులు అల‌ర్ట్ అయ్యారు, అన్నీ ఆస్ప‌త్రుల్లో డాక్ట‌ర్లు అందుబాటులో ఉంచేలా చూస్తున్నారు, ఎక్క‌డ ఎవ‌రికి ఎలాంటి స‌మ‌స్య రాకుండా స‌మ‌న్వ‌యం చేసుకోవాలి అని రోగులు సంఖ్య పెర‌గ‌కూడ‌దు అని సీఎం జ‌గ‌న్ తెలిపార‌ట‌.

చైనా నుంచి ఈ వైరస్ వ్యాపించింది. ప్రపంచంలోని పలు దేశాల్లోకి విస్తరించింది. భారత దేశంలోని మొట్టమొదట కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఇతర రాష్ట్రాల్లో పోల్చినా..కేరళ రాష్ట్రంలో అత్యధికంగా వైరస్ కేసులు రికార్డయ్యాయి. వైరస్ వ్యాపిస్తుండడంతో కేరళ ప్రభుత్వం పకడ్బంది చర్యలు తీసుకొంటోంది. లక్షణాలు బయటపడిన వారిని ఐసోలేషన్ కేంద్రంలో పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఇతరులతో మాట్లాడనీయడం లేదు. వీరు బయట తిరిగితే…ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Content above bottom navigation