బ‌స్సులో ప్ర‌యాణించే ప్ర‌తీ మ‌హిళా త‌ప్ప‌కుండా చూడండి

76

ఈమ‌ధ్య దొంగ‌ల‌బెడ‌ద చాలా పెరిగిపోయింది
అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చోర క‌ల‌లో త‌మ హ‌స్తం ప్ర‌ద‌ర్శిస్తున్నారు.
ఈ చేతివాటాల‌కు చాలా మంది త‌మ విలువైన వ‌స్తువులు పోగోట్టుకుంటున్నారు.
గ‌తంలో సిజ‌రింగ్ కేవ‌లం పురుషులుచేస్తే ఇప్పుడు ప‌ర‌సు జేబులు క‌టింగ్ అమ్మాయిలు చేస్తున్నారు.
కాస్త ఏమ‌ర‌పాటుగా ఉంటే చాలు మ‌నం వేసుకున్న బ‌ట్టలు కూడా విప్పేసి అర్ద‌న‌గ్నంగా నిల‌బెట్టే న‌యా మోస‌గాళ్లు ఉన్నారు.. అంతేకాదు వారికి అడ్డు వ‌స్తే పీక కోసి ప్రాణాలు తీయ‌డానికి కూడా వెన‌క‌డాని కృరులు ఉన్నారు. తాజాగా ఇలాగే ఇద్దరు మ‌హిళ‌లు ఓ దొంగ‌త‌నం చేశారు, సినిమాటిక్ గా జ‌రిగిన ఈ దొంగ‌త‌నం. మ‌నం ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలో గుణ‌పాఠంగా చెబుతోంది.

దేవిపట్నం పక్కన ఉన్న ఒక గ్రామంలో కుంజరం అనే మహిళ నివసిస్తోంది..ఈమె వయసు 62 సంవత్సరాలు..ఈమె ఒక రోజు రామనాధ పురం వెళ్ళే బస్సెక్కింది..కుంజరం ఎక్కిన బస్ జ‌నంతో చాలా రష్ గా ఉంది… అందులో ఇద్దరు మహిళలు బురఖా ధరించి నిల్చొని ఉన్నారు..ఈ స‌మ‌యంలో కుంజరం ముసలావిడ కాబ‌ట్టి నిల్చోలేదు కనుక ఆమె కూర్చుంది..ఈ ముసలావిడ పక్కనే వారొచ్చి నిల్చున్నారు.. అప్పుడు మెల్ల‌గా ఆమెతో మాటలు కలిపారు..

Image result for womens in bus

అలా మాట్లాడుతూ ఆ ముసలావిడ మెడలో చేయి వేసి బంగారు చైన్ దొంగిలించాలి అని వారి ప్లాన్ ..బస్సు రామనాథ పురం బస్ స్టాండ్ కు వెళ్ళింది.. అయితే బ‌స్సు దిగే స‌మ‌యంలో వారు చైన్ మెల్లిగా ఆమెకు తెలియ‌కుండా దొంగిలించారు, ఈ స‌మ‌యంలో చైన్ లేదు అని ఆమె తెలుసుకుంది, బ‌స్సు దిగి పారిపోతున్న ఈ ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను చూసి దొంగ దొంగ అని అరిచింది, వెంట‌నే ప‌క్క‌న ఉన్న‌వారు వారిలో ఒక‌రిని ప‌ట్టుకున్నారు మ‌రో అమ్మాయి పారిపోయింది.

అయితే అదృష్ట‌వశాత్తు ఆమె చైన్ దొరికిన దొంగ ద‌గ్గ‌ర ఉంది, వెంట‌నే పోలీసుల‌కు ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు, దీంతో ఆమెని పోలీసులు అరెస్ట్ చేశారు, ఆ చైన్ పోలీసులు ఆ పెద్దావిడ‌కు అప్ప‌గించారు. అయితే బ‌య‌ట‌కు వెళుతున్న స‌మ‌యంలో ఇలా బంగారం వేసుకువెళ్ల‌కూడ‌దు అని పోలీసులు చెబుతున్నారు.

దొరికిన మహిళ‌ని పోలీసులు త‌మ స్టైల్లో విచార‌ణ చేశారు.. ఆ ఇద్దరు మహిళలు తూత్తుకుడికి చెందినవారు అని తెలిసింది..అందులో ఒకరి పేరు ఇసికి అమ్మాల్,మరొకరి పేరు కాలేస్వరి అని తెలిసింది.. వీరు గ‌తంలో చాలా దొంగ‌త‌నాలు చేశారు అని తెలుసుకున్నారు, వీరు రైల్లు బ‌స్సుల్లో ఇలాంటి స్కెచ్ వేస్తున్నారు అని తెలుసుకున్నారు పోలీసులు. చూశారుగా కొత్త‌గా వ‌చ్చి మీకు ప‌రిచ‌యం లేక‌పోయినా మాట‌లు క‌లిపితే వారి నుంచి కాస్త జాగ్ర‌త్త‌గా ఉండండి.

Content above bottom navigation