భర్త, తండ్రి ఇద్దరు దూరమయ్యారు.. అమృత సంచలన నిర్ణయం

58

తెలంగాణ రాష్టంలో 2018 సెప్టెంబర్ 14 న జరిగిన ప్రణయ్ హత్య ఘటన ఎంత కలకాలం స్పృష్టించిందో మనకు తెలుసు. వేరే కులం వాడిని కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని, కక్ష్య గట్టి కిరాయి రౌడీలకు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు అమృత తండ్రి మారుతీరావు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనమే స్పృష్టించింది. ఆ తర్వాత పోలీసులు మారుతీరావు అండ్ టీమ్ ను పట్టుకుని జైలుకు తరలించారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదల అయ్యి బయటకు వచ్చాడు. ఈ కేసులో ఇప్పుడు మరొక ట్విస్ట్ ఏర్పడింది. కేసులో ప్రధాన నిందితుడు అయినా మారుతీరావు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌ ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి మారుతీరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి ఆయన ఆర్యవైశ్య భవన్‌లో బస చేశారు. ఉదయాన్నే తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది.. ఆయన గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. విషం తాగినట్లు గుర్తించిన సిబ్బంది అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించారు.

ఇక మారుతీరావు ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. పోలీసుల ఒత్తిడితో చనిపోయారని ఆయన భార్య ఆరోపించారు. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని సోదరుడు భావిస్తున్నారు. ఆత్మహత్య గురించి తెలుసుకున్న మారుతీరావు భార్య ఆమె తరపు బంధువులు ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. భర్త మృతదేహాన్ని చూసి భార్య గిరిజ కుప్పకూలిపోయారు. చేతులతో గుండెలు బాదుకుంటూ ఆమె రోదించిన తీరు అందర్నీ కలచి వేసింది. భర్త శవం వద్ద ఆమె ఏడుస్తూ కింద పడిపోయింది. అయితే తమ కుటుంబంలో ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని మారుతీరావు సోదరుడు శ్రవణ్ చెబుతున్నారు. గత ఏప్రిల్ నుంచి మాటల్లేవని చెప్పుకొచ్చాడు. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే మారుతీరావు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని సోదరుడు శ్రవణ్‌ చెబుతున్నారు.

Image result for మిర్యాలగూడ అమృత

ఇక ఈ ఆత్మహత్యతో ఒక్కసారిగా షాక్ లోకి పోయింది అమృత. కట్టుకున్న భర్తను కన్న తండ్రి చంపాడు. ఆ తర్వాత జైలుకు వెళ్ళాడు. బెయిల్ పై బయటకు వచ్చి నా దగ్గరకు వచ్చెయ్ అని కన్నతండ్రి ఎంత బ్రతిమలాడిన కూడా తండ్రి దగ్గరకు వెళ్ళలేదు. ఇప్పుడు కన్నతండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో అమృత అందరు అమృతను దెప్పి పొడుస్తున్నాడు. ఆమె చేసిన ఒక తప్పు వలన ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. రెండు కుటుంబాలలో పెను విషాదాలు చోటుచేసుకున్నాయి. కన్న తండ్రి, కట్టుకున్న భర్త చావుకు తానె కారణం అని అమృత లోలోపల కుమిలిపోతుందంట. అందుకే ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకుందంట. ఇప్పుడు ప్రణయ్ లేడు, మారుతీరావు లేడు. మిగిలింది కన్న కొడుకు, కన్న తల్లి మాత్రమే. అందుకే వాళ్లిద్దరూ కోసం ఒక నిర్ణయం తీసుకుందట. సూసైడ్ నోట్ లో అమ్మ దగ్గరకు వెళ్ళు అని మారుతీరావు చెప్పాడు. తండ్రి సూసైడ్ చేసుకోవడంతో అమృత తల్లి ఒంటరి అయ్యింది. అందుకే ఇక తానూ కన్నతల్లి దగ్గరకు వెళ్లాలని నిర్ణయం తీసుకుందంట. తండ్రి లేడు, భర్త లేడు, ఉన్నది అల్లా కన్నతల్లి మాత్రమే. ఇప్పుడు ఉన్న బాధలో ఆమె కూడా ఏమైనా చేసుకుంటుందేమో అని భయపడుతుంది అమృత. అందుకే తల్లిని అయినా కాపాడుకుందామని తల్లి దగ్గరకు వెళ్లాలనే నిర్ణయం తీసుకుందంట.

Content above bottom navigation