భారతదేశంలో దెయ్యాలు తిరిగే 10 రహదారులు

197

దెయ్యాలు నిజంగా ఉన్నాయా.. అసలు దెయ్యాలు ఎలా ఉంటాయి అనే విషయాల గురించి చాలా మంది పరిశోదనలు చేస్తూనే వస్తున్నారు.. అసలు దెయ్యాలు ఎక్కడ ఉన్నాయి.. నిజంగానే సినిమాల్లో చూపించినట్లు దెయ్యాలు రక్తాన్ని తాగుతాయా..మనుషులను హింసిస్తాయా.. అనే విషయాలు ఇప్పటికి కూడా రుజువవ్వడం లేదు. కానీ కొన్ని ప్రదేశాలలో దెయ్యాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అలా దెయ్యాలు ఉన్న ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 1. కల్కా సిమ్లా రైల్వే సొరంగం
  ఒకానొక కాలంలో కల్కా, సిమ్లా మధ్య ఉన్న ఒక ప్రాంతంలో రైల్వే సొరంగం నిర్మించాల్సి వచ్చింది. అప్పుడు కొంత మంది కార్మికులతో కలిసి కలొనెల్ బరోగ్ అనే వ్యక్తి సొరంగం పనులు మొదలు పెట్టారు. అయితే ఎంతకీ సొరంగం పని పూర్తి అవ్వలేదు. దాంతో అందరు బరోగ్‌ ను ద్వేషించడం స్టార్ట్ చేశారు. ఇది భరించలేని బరోగ్ ఆ సొరంగం నిర్మాణంలో కాల్చుకుని చనిపోయాడు. ఆ తరువాత అతడిని అక్కడే ఖననం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అతని ఆత్మ అక్కడే తిరుగుతోందని రూమర్స్ వినిపించాయి.
 1. రెండు లైన్ల ఈస్ట్ కోస్ట్ రహదారి
  ఈ రహదారిలో ప్రయాణించిన వారు ఆ రోజంతా సంతోషంగా ఉంటారట, కాని వారికి చీకటి పడేంత వరకు తెలియదంట ఆ రోడ్ మహత్యం. ఆ రోడ్డు మీద ప్రయాణించిన డ్రైవర్లు, ప్రయాణికుల కథనం ప్రకారం… అర్థరాత్రి పూట ఒక యువతి తెల్లటి చీర కట్టుకుని రహదారి నడి బాగంలో తిరుగుతూ ఉంటుందని తెలిపారు. అయితే ఆ రోడ్డులో జరిగే ప్రమాదాలు ఎక్కువ శాతం ఆ దెయ్యం వలనే జరిగాయని చెబుతున్నారు.
 2. ఢిల్లీ కంటోన్మెంట్ రోడ్డు
  ఈ రోడ్డు మీద బాగా చీకటి అయ్యాకా ఒక దెయ్యం తెల్లని చీరలో, రోడ్డు మధ్యలో ఉంటుందని, అటుగా వచ్చిన వారిని మట్టుబెడుతుందని అక్కడ ఉండే స్థానికులు చెబుతున్నారు.. అయితే దీని గురించి ఒక వ్యక్తి మాట్లాడుతూ.. మీరు ఆ రోడ్డు మీదకు వెళ్లిన తరువాత మీ వాహనాన్ని రాకెట్ వేగంతో నడపాలి లేదంటే ఆమె మిమ్మల్లి వెంటాడుతుందని తెలిపాడు.
 3. రాంచీ జంషెడ్‌పూర్ జాతీయ రహదారి
  దీనిని 33 వ జాతీయ రహదారి అంటారు. ఈ హైవేలో ఉన్న 40 కిలోమీటర్ల మేర దెయ్యాలు మాటు వేసి ఉంటాయంట. గత మూడేళ్లలో కేవలం ఈ 40 కిలోమీటర్ల పరిధిలో దాదాపుగా 243 మంది ప్రాణాలు కోల్పోయారు.
 4. మార్వి అండ్ మధ్ ఐలాండ్ రోడ్డు
  ఉదయం పూట ఈ రోడ్డులో జర్నీ ఎంతో హాయిగా ఉంటుంది కానీ రాత్రి వేళలో భయంకరంగా ఉంటుంది. ఒక మహిళ పెళ్లి దుస్తులు ధరించి అటుగా వెళ్లే వారికి ముచ్చెమటలు పట్టింస్తోందట. అంతేకాకుండా అటుగా వెళ్లేవారికి వినపడేలా వింత వింత శబ్ధాలు చేస్తూ తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తోందట.
 1. ముంబాయ్ – నాసిక్ జాతీయ రహదారి
  దెయ్యాల స్థావరాలుగా ముంబాయి, నాసిక్ హైవే మీద ఉండే కాసర‌ఘాట్ అనే ప్రాతం ఫెమస్ అయ్యింది. కాసర్‌ ఘాట్ అనే ప్రాంతంలోకి వెహికల్స్ వెళ్లే సరికి అక్కడ చుట్టుప్రక్కల ఉన్న అడవి లోని చెట్లు, పొదలు ఎంతో భయంకరంగా ఊగుతాయి. వాటి మీద తలలేని మహిళ కనిపిస్తుంది. దాంతో వెహికల్ నడిపేవారు భయపడి యాక్సిడెంట్ చేస్తారు.
 2. జాతీయ రహదారి – 209 , సత్యమంగళం
  సత్యమంగళం ఒక అభయారణ్యం. ఇది ఒకప్పుడు వీరప్పన్ తలదాచుకున్న ప్రాంతం. అప్పట్లో వీరప్పన్ డబ్బు కోసం అటుగా వెళ్లే వారిని వెంబడించేవాడు. అయితే వీరప్పన్ చనిపోయాక కూడా అదే విధంగా చీకట్లో లైట్లు వెలిగేవి, భయంకరమైన శబ్దాలు వినిపించేవి. అక్కడ వీరప్పన్ ఆత్మ ఏమైనా తిరుగుతుందా అనే డౌట్ అందరికి ఉంది.
 3. కాషేడి ఘాట్, ముంబాయ్-గోవా హైవే
  ముంబాయి – గోవా రహదారి మధ్యలో వచ్చే కాషేడి ఘాట్ రోడ్ ఒక మిస్టరీ రోడ్డుగా ఫెమస్ అయ్యింది. ఎందుకంటే ఈ ఘాట్ రోడ్డు ఎంతో ఎత్తులో ఉంటుంది. చాలా వరకు మలుపులతో కూడుకున్నది. అయితే అటుగా వెళ్లే కార్లు, బస్సులు మలుపుల వద్ద తిరుగుతున్న సమయంలో కుడు చేతి వైపున ఒక వ్యక్తి వచ్చి స్టాప్ అనే సంకేతాన్ని చూపిస్తాడు. దాంతో డ్రైవర్లు భయపడి వాహనాన్ని అలాగే లోయలోకి నడిపేస్తారు. ఇలా ఎన్నో ప్రమాదాలు జరిగాయి.
 4. బెసంత్ అవెన్యు రోడ్
  చెన్నైలోని ఈ బెసంత్ అవెన్యు రోడ్డు వెనుక ఒక కథ ఉంది. ఈ రోడ్డు పగులంతా సందడిగానే ఉంటుంది. అయితే చీకటి పడేకొద్దీ అక్కడ పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఈ రోడ్డులో వింత శబ్దాలు వినిపిస్తాయి. అక్కడ రాత్రిపూట వెళ్లేవారు ఎవరో తమను తరుముతున్నట్టు అనిపించింది అని చెప్తారు. రాత్రిపూట వెళ్లిన ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు.
 5. ముంబాయి – పూణే పాత హైవే
  ఈ హైవేలో నైట్ టైమ్ ప్రయాణిస్తే ఒక అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది. అమ్మాయి కదా అని లిఫ్ట్ ఇస్తే కొంత దూరంలో దిగిపోతుంది. మళ్ళి కొంతదూరంలో అదే అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది. భయపడి ఇవ్వకుండా వెళ్తే గట్టిగా నవ్వే శబ్దాలు వినిపిస్తాయి. కొందరికి యాక్సిడెంట్ లు కూడా అయ్యాయి. ఆ యాక్సిడెంట్ అయినా ప్రదేశంలో దెయ్యం సంతకం కూడా ఉంటుంది. ఇలా ఆ రూట్ లో వెళ్లే ప్రతి ఒక్కరికి జరుగుతుంది.

ఇలా కొన్ని ప్రదేశాల్లో దెయ్యాలు ఉన్నాయని చాలామంది చెబుతారు. కాని ఇది నిజమో లేక వారి కల్పిత కథనో అర్థం కాదు కాని ఈ ప్రదేశాలలో తిరగాలంటే మాత్రం జనాలు భయంతో వనికిపోతుంటారు.

Content above bottom navigation