భారీగా పెరిగిన బంగారం ధ‌ర

మార్కెట్లో రెండు రోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న బంగారం తాజాగా పరుగులు పెట్టింది. బంగారం ధర భారీగా పెరిగింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర కూడా పైపైకి కదిలింది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరగడంతో మన మార్కెట్‌పై కూడా అదే ఎఫెక్ట్ పడింది. కరోనా వైరస్ వల్ల చైనా ఆర్థిక వ్యవస్థతోపాటు గ్లోబల్ ఎకానమీపై కూడా ప్రతికూల ప్రభావం పడొచ్చనే అంచనాలు బంగారం ధర పెరుగుదలకు కార‌ణం అయింది.గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.31 శాతం పెరిగింది. 1,578.25 డాలర్లకు చేరింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.18 శాతం పెరుగుదలతో 17.72 డాలర్లకు ఎగసింది.

Image result for gold

హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది. పసిడి ధర 10 గ్రాములకు రూ.250 పైకి కదిలింది. దీంతో ధర రూ.38,730 నుంచి రూ.38,980కు చేరింది.అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా పైకి కదిలింది. రూ.190 పెరిగింది. దీంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.42,330 నుంచి రూ.42,520కు చేరింది.బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.500 పెరుగుదలతో రూ.49,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయరీదారుల నుంచి డిమాండ్ పెరగడం ఇందుకు కారణం.

Image result for gold

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.38,980కు చేరింది. వెండి ధర కూడా రూ.49,000కు పెరిగింది. ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా కొనసాగింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిలకడగానే ఉంది. రూ.40,700 ద‌గ్గ‌రే కొనసాగుతోంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.39,500 ద‌గ్గ‌ర స్థిరంగా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ.49,000 ద‌గ్గ‌ర‌ కొనసాగుతోంది.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల ద‌గ్గ‌ర ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

ఈ క్రింది వీడియోని చూడండి

పసిడి రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు.దేశీ మార్కెట్‌లో బంగారం ధర గతేడాది 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఈ క్రింది వీడియోని చూడండి

Content above bottom navigation