భార్యకు కరోనా సోకిందని బాత్‌రూమ్‌లో లాక్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే

181

ప్రస్తుతం ప్రపంచదేశాలన్నింటినీ కరోనా వైరస్ మహమ్మారి భయబ్రాంతులకు గురి చేస్తోంది.. ఇప్ప‌టికే మ‌న దేశంలో ఈ వైర‌స్ విజృంభిస్తోంది, 31 మందికి పాజిటీవ్ అని తేలింది, అయితే ఈ వైర‌స్ సోకింది అనే అనుమానం వ‌స్తే వెంట‌నే డాక్ట‌ర్ ని సంప్ర‌దించాలి, లేక‌పోతే అస‌లుకే మోసం వ‌స్తుంది, తాజాగా ఈ వైర‌స్ సోకింది అనే అనుమానంతో ఓ భ‌ర్త భార్య‌కి విధించిన శిక్ష చూస్తే మ‌తిపోతుంది, ఎక్క‌డైనా భార్య‌కి అనారోగ్యం ఉంటే హ‌స్ప‌ట‌ల్ కి తీసుకువెళ‌తారు, కాని ఈ భ‌ర్త మాత్రం అత‌ని భార్య‌పై క‌నిక‌రం లేకుండా చేశాడు, ఇంత‌కీ ఈ శాడిస్ట్ భ‌ర్త ఏం చేశాడో చూద్దాం.

తన భార్యకు కరోనా వైరస్ సోకిందని అనుమానంతో శాడిస్ట్ భర్త ఆమెను బాత్‌రూమ్‌లో పెట్టి లాక్ చేశాడు. ఎంత చెప్పినా కూడా వినకుండా బయటికి రానివ్వకపోవడంతో ఆ అనుమానపు భర్త నిర్వాకాన్ని ఆమె ఎలాగోలా పోలీసులకు తెలియజేసింది. ఇంత‌కీ బాత్రూమ్ లోకి వెళ్లిన ఆమె సెల్ ఫోన్ తీసుకువెళ్ల‌డం అల‌వాటు, ఆమె అలాగే సెల్ తీసుకువెళ్లింది, ఈ స‌మ‌యంలో భ‌ర్త‌ని డోర్ ఓపెన్ చేయ‌మ‌ని కోరింది ,అత‌ను మాత్రం నీకు క‌రోనా సోకింది నువ్వు లోప‌లే ఉండు అని ఏడిపించాడు, దాదాపు నాలుగు గంట‌లు బాత్ రూమ్ లోనే బంధించాడు, ఆమె బాత్రూంలో ఇక ఉండ‌లేక త‌న సెల్ ఫోన్ తో పోలీసుల‌కి కాల్ చేసింది..

ఈ …సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆమెను బాత్రూం నుంచి బయటికి తీసుకొచ్చి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో కరోనా సోకలేదని నిర్ధారణ అయింది. ఇంతకీ ఆ భర్తగారికి తన భార్యకు కరోనా సోకిందని అనుమానం ఎప్పుడొచ్చిందంటే.. కరోనా ప్రభావం మొదలైన తర్వాత ఇటలీ నుంచి వచ్చిన ఓ వ్యక్తితో ఆమె మాట్లాడిందని తెలుసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ తారాస్థాయికి చేరుకుంది. వెంటనే అతడిలో అనుమానాలు మొదలయ్యాయి. తన భార్యకు కరోనా సోకినట్లు డాక్టర్లకు చెప్పడమే కాకుండా ఆమె ఎక్కడికీ వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెడికల్ టెస్టులు నిర్వహించాలని తెలిపాడు. ఇందులో భాగంగానే ఆమెను బాత్‌రూమ్‌లో పెట్టి లాక్ వేశాడు. కాగా, ఈ శాడిస్ట్ భర్త నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే భ‌ర్త అతి తెలివికి ఆమె న‌వ్వాలో ఏడ్వాలో తెలియ‌క అత‌నిని వ‌దిలెయ్య‌మ‌ని పోలీసుల‌కి కోరింది, చూశారుగా ఎవ‌రైనా హ‌స్ప‌ట‌ల్ కి తీసుకువెళ్లి టెస్ట్ చేస్తారు కాని ఇత‌ను ఎంత‌ వింత‌గా ఆలోచించాడో..

Content above bottom navigation