భార్య భర్తల మధ్య ఆ గ్యాప్ వస్తే ఏమౌతుందో తెలుసా?

132

కొందరు భార్య భర్తలూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఒకరిని వదిలి ఇంకొకరు ఉండలేరు. కానీ సడెన్ గా ఏదో ఒక చిన్నవిషయంపై వారి మధ్య విభేదాలు ఏర్పడతాయి. అంతవరకూ ఒకరి కోసం ఒకరుప్రాణమిచ్చే వాళ్లిద్దరూ బద్ద శత్రువులుగా మారిపోతారు. అసలు మళ్లీ కలిసి మాట్లాడుకుందాం.. సమస్యను పరిష్కరించుకుందామనే విషయంలో ఇద్దరిలో ఓ ఒక్కరూ శ్రద్ధ చూపరు. ఇది ఒక వ్యక్తిని మాత్రమే చెడుగా మార్చదు. దీనికి ఇద్దరూ కారణమవుతారు. రిలేషన్ ఇలా అప్పుడప్పుడు బ్రేక్ కావడానికి కారణాలేంటో అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం చాలా అవసరం.

భార్య భర్తల మధ్య అన్యోన్యత ఉంటేనే ఆ కాపురం చక్కగా ఉంటుంది. అందంగా ఉంటుంది. ఇద్దరి మధ్య ఎలాంటి కలహాలు లేకుండా చక్కగా నడుచుకోగలుగుతారు. అలా కాకుండా ఇద్దరి మధ్య ఏదైనా చిన్న గ్యాప్ వస్తే, దాని వలన వచ్చే ఇబ్బందులు అన్నీఇన్నీ కాదు. చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా ఇద్దరు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇద్దరిలో ఎవరిపైన తప్పు చేశారని తెలిసిన తరువాత ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యి గ్యాప్ మొదలౌతుంది. ఆ గ్యాప్ ను వీలైనంత త్వరగా సర్దుకుపోయి పూడ్చుకునే ప్రయత్నం చేయాలి తప్పించి, మరో విధంగా ఉండకూడదు.

కేవలం అభిప్రాయాలను పంచుకునే విషయంలో మాత్రమే కాదు…శృంగారం విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. శృంగార సామర్థ్యానికి అనేక శారీరక మానసిక కారణాలు దోహదం చేస్తాయి. ముఖ్యంగా భాగస్వామిపై తీవ్రమైన ఆకర్షణ ఉండాలి. ప్రేమ, ఇష్టం, భాగస్వామి సహాయ సహకారాలు, ప్రేరణ, ఉత్సాహం, ఆరోగ్యం అవసరం. అవకాశం, పరిసరాలు, పరిస్థితులు ఇటువంటి అనేక అంశాలు రతి సామర్థ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఒకరిపై ఒకరికి ఎప్పుడు ఆకర్షణ ఉంటేనే భార్యాభర్తల మధ్య బంధం బలపడుతుంది. ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా దానిని భాగస్వామితో చెప్పి ఆ బంధాన్ని నిలబెట్టుకునే విధంగా చూసుకోవాలి. అంతేకాదు, జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కొంతసమయం ఇంటికి, భాగస్వామికి కేటాయించినపుడు ఆ లైఫ్ హ్యాపీగా ఉంటుంది.

Image result for husband and wife india

కమాండింగ్, డిమాండింగ్ నేచర్ రిలేషన్ ని నాశనం చేస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలాగే ఫైనాన్స్ విషయంలో మీ భాగస్వామి తన కోసం ఖర్చుచేసుకోవడానికి సరిగా అనుమతించకపోవడం, అతిగా కంట్రోల్ చేయడం సరైన ఆలోచన కాదు. దీనివల్ల మీ రిలేషన్ పై వ్యతిరేకత పెరుగుతుంది. వాళ్లలో స్వతంత్రత కోల్పోయామన్న ఫీలింగ్ పెరుగుతుంది. కాబట్టి ఖర్చుల విషయంలో మరీ ఎక్కువగా కట్టడి చేయకూడదు. ఇగో రిలేషన్ ని నాశనం చేసేవాటిల్లో అహం చాలా కీలక పాత్ర పోషిస్తోంది. రిలేషన్ లో కాంప్రమైజ్ అవడం కంటే.. ఇగోలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది చాలా కామన్ గా కనిపిస్తున్న సమస్య. కాబట్టి మీ రిలేషన్ కు ఇగో అనేది సమస్య కాకుండా.. జాగ్రత్త పడటం అవసరం. గౌరవించకపోవడం ఒకరినొకరు కామెడీ చేసుకోవడం కామన్. బావుంటుంది. కానీ.. శారీరక హింస అనేది భరించలేనిది. అలాగే మీ భాగస్వామిని గౌరవించడం చాలా ముఖ్యమైన అలవాటు. గౌరవం కోల్పోయినప్పుడు ఇద్దరి మధ్య గొడవలు పెరిగిపోతాయి. కాబట్టి.. భార్య భర్తలిద్దరూ ఈ సూత్రాలు పాటిస్తే జీవితాంతం హ్యాపీలైఫ్ అనుభవించవచ్చు.

Content above bottom navigation