భూమి మీద మనిషి అంతరించిపోతే ఏం జరుగుతుందో తెలుసా..

431

ఈ అనంతమైన విశ్వములో ఎన్నో వందల, వేల, లక్షల గ్రహాలు ఉన్నాయి. కానీ జీవులు జీవించడానికి ఉపయోగపడే గ్రహం మాత్రం మన భూమి మాత్రమే. వేరే గ్రహాల మీద ఉండొచ్చు కానీ మనకు తెలీదు. ఈ భూమి పైన కొన్ని లక్షల జీవులు, జంతువులూ జీవిస్తున్నాయి. ఈ జీవులలో అత్యంత తెలివైన జీవి మనిషి. ప్రస్తుతం ఈ భూమి శాసిస్తున్న వాడు మనిషే. ఒక వేళ కొన్ని రోజుల తర్వాత ఈ భూమి పై ఒక్క మనిషి కూడా లేకుండా అంతం అయిపోతే, అప్పుడు భూమి పరిస్థితి ఏంటి? అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మనిషి అనే వాడు భూమి పైన లేకపొతే రోజురోజుకు పరిమాణాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? ఆ విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.

ఈ భూమి పై అధికారం చెలాయిస్తున్న ఏకైక జివి మనిషి. మనిషి ఈ భూమి పైకి వచ్చిన దగ్గర నుండి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. మరెన్నో విషయాలను కనుక్కోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మనం ప్రపంచంలో ఏ వైపు కు వెళ్లిన అక్కడ మనుషులు తిరుగుతూనే కనిపిస్తారు. ఒకవేళ మనుషులంతా ఈ భూమి పై నుండి అంతం అయినా కొన్ని గంటలలోనే, మనం సృష్టించుకున్న సోలార్ సిస్టమ్స్ దుమ్ము దూళితో నిండి పోయి, వాటిని క్లీన్ చేసే మనిషిలేక అవి పాడైపోతాయి. కరెంట్ ను ఉత్పత్తి చేసే విండ్ ఫ్యాన్స్ లో ఉన్న గ్రీస్ ఉన్నంతవరకు పనిచేసి, ఆ తర్వాత వాటిలో గ్రీస్ నింపే మనిషిలేక పాడైపోతాయి. ఈ భూమి మీద ఉండే పెద్ద, పెద్ద పవర్ స్టేషన్స్ అన్ని ఫాజిల్ ఫ్యూయెల్స్ ద్వారానే పని చేస్తాయి. మరి అందులో ఫాజిల్ ఫ్యూయల్ నింపే మనిషి లేకపోతే, అవి పనిచేయక ఆ పవర్ స్టేషన్స్ అన్ని పాడైపోతాయి. మనుషులు అంతమయిన రెండు గంటల్లో భూగర్భ రైళ్లు అన్ని నీటిలో మునిగిపోతాయి. కారణం ఆ భూగర్భంలో చేరే నీరుని మనుషులు ఎప్పటికప్పుడు బయటకి పంపిస్తూ ఉంటారు. అసలు మనుషులే లేకపొతే ఈ నీటిని తోడి బయటకు పంపేదెవరు?

Image result for భూమి మీద మనిషి అంతరించిపోతే

మరో పది రోజుల తర్వాత మనుషులు పెంచుకొనే తమ పెంపుడు జంతువులూ, ఆవులు నీరు, ఆహారం లేక చనిపోతాయి. ఒకవేళ కొన్ని జంతువులూ జీవించి ఉన్న, వీటికన్నా పెద్ద జంతువులూ వీటిని చంపి తినేస్తాయి. మనుషులు ఈ భూమి పై నుండి అంతం అయినా ఓ నెల తర్వాత ఈ భూమి పైన ఉన్న నగరాలూ అన్ని శిధిలం అవ్వటం మొదలు అవుతాయి. అదే సమయంలో ఈ భూమిపైన ఉన్న అన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ లో వాటిని చల్ల బరిచే నీళ్లు లేక ఆ రియాక్టర్స్ లో ఉన్న రేడియం మెల్లగా బయటకు రావటం మొదలు అవుతుంది. అలా బయటకు వచ్చిన ఆ రేడియం ఎఫక్ట్, జపాన్ పైన పడిన అణుబాంబుల కన్నా చాల ఎఫక్టివ్ గా ఉంటుంది. ఈ భూమి పైన ఉన్న కొన్ని జీవులకు క్యాన్సర్ సోకి అవి కూడా చనిపోతాయి.

మరి కొన్ని సంవత్సరాల తర్వాత మనం ప్రయోగించిన ఉపగ్రహాలను కంట్రోల్ చేసే మనుసులు లేక ఆ ఉపగ్రహాలన్నీ వచ్చి భూమి మీద పడతాయి. మరి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమిపైన మనుషులు అనే వాళ్ళు లేక, మనుషులు వేసిన రోడ్స్, నగరాలూ అన్ని అడవులుగా మారిపోయి, జంతువులూ తిరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమి పైన కాలుష్యం అనేది లేకుండా గాలి చాలా స్వచంగా ఉంటుంది. మరికొన్ని సంవత్సరాల తర్వాత ఇనుముతో చేసిన బిల్డింగ్స్, వంతెనలు లాంటివి అన్ని తుప్పు పట్టిపోయి, విరిగిపోయి నేల కూలటం మొదలవుతుంది. నగరాలలో ఉన్న పెద్ద, పెద్ద బిల్డింగ్స్ అన్ని ఇసుకలో కప్పబడిపోతాయి. మనుషులు లేక పోవటం వలన సముద్రంలో జీవించే కొన్ని జీవులు నేల పైకి వచ్చి జీవిస్తాయి. నేలపై ఉండే మరి కొన్ని జీవులు పెద్ద పెద్ద జీవులుగా వృద్ధి చెందుతాయి. 5000 సంవత్సరాల తర్వాత ఈ భూమి పైన అసలు మనుషులు అనే వాళ్ళు జీవించారు అనటానికి గుర్తుగా మనం తయారు చేసిన ప్లాస్టిక్ బాటిల్స్, గ్లాసులు మాత్రమే కనిపిస్తాయి. ప్లాస్టిక్ బాటిల్స్, గ్లాసులు మాత్రమే మనిషి అంతరించిపోయిన 10 లక్షల సంవత్సరాల తర్వాత కూడా కనిపిస్తాయి. ఈ భూమి మీద మనిషి అనే వాడు లేకపొతే ఈ విధంగా ఉంది. ఊహించడానికే భయంగా ఉంది కదా.

Content above bottom navigation