మనుషుల శరీరంలో బయటపడ్డ 5 బతికున్న జీవులు

71

మన చుట్టూ రకరకాలైన జీవులు ఉంటాయి. చీమలు, ఈగలు, పురుగులు..ఇలా రకరకాల జీవులు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అయితే అప్పుడప్పుడు ఆ జీవులు మనం చెవి లోపలికి, ముక్కు లోపలికి వెళ్తుంటాయి. ఆ టైమ్ లో మనం పడే బాధ ఎలా ఉంటుందో మనకు తెలుసు. చిన్న చిన్న జీవులే మన శరీరంలోకి వెళ్తే మనం ఆ బాధను తట్టుకోలేము. అలాంటిది ఇంకొంచెం పెద్ద జీవులు కనుక మన శరీరం లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అయితే అవి లోపలికి వెళ్లి ఇంకా జీవిస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఊహించుకోడానికే భయంకరంగా ఉంది కదా..కానీ కొందరికి ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. అలా మనుషుల శరీరంలోకి బతికున్న జీవులు వెళ్లిన కొన్ని ఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 1. fish in lungs
  పిల్లలు ఆడుకుంటున్నప్పుడు నేను ఇలా చేస్తా ఆలా చేస్తా అని ఛాలెంజ్ లు చేస్తుంటారు. ఈ విధంగానే మధ్య ప్రదేశ్ కు చెందిన అనిల్ బేరేళ్ళ అనే 12 ఏళ్ల కుర్రాడు బతికున్న చేపను మింగుతా అని తన ఫ్రెండ్స్ తో ఛాలెంజ్ చేశాడు. తర్వాత కొన్ని రోజులకు అతనికి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దాంతో ఆ అబ్బాయి తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకెళ్లి X ray తీయించి చుస్తే అతని ఊపిరితిత్తులలో చేప ఇంకా బతికే ఉంది. 45 నిముషాలు ఆపరేషన్ చేసి చేపను బయటకు తీశారు. ఆ చేప పొడవు 3.5 ఇంచులు ఉంది. అతను చేపను మింగినపుడు అన్నవాహిక లోపలికి వెళ్ళడానికి బదులు గాలిగొట్టం నుంచి ఉపిరితిత్తులలోకి వెళ్ళింది. ఘటన 2012 లో జరిగింది.
 2. spider in stomach
  ఆస్ట్రేలియాకు చెందిన 20 ఏళ్ల థామస్ అనే వ్యక్తి ఇండోనేషియాలోని బాలికి వెళ్ళాడు. అక్కడ ఒక హోటల్ లో ఉన్నాడు. అయితే మరుసటి రోజు ఉదయం లేచి చుస్తే అతని కడుపు మీద ఎర్రని మచ్చలు కనపడ్డాయి. దాంతో ఏమైందో అని లోకల్ లో ఉన్న ఒక హాస్పిటల్ కు వెళ్ళాడు. అది ఏదో పురుగు కురిసిన మచ్చ అని చెప్పి, దానికి సంబందించిన మందులు ఇచ్చాడు. అయితే మరుసటి రోజు ఆ మచ్చ ఎలా ఉందొ చూద్దాం అని షర్ట్ విప్పి చుస్తే బొడ్డు నుంచి ఛాతీ వరకు ఒక ఎర్రని గీత కనిపించింది. దీన్ని చూసి థామస్ భయపడిపోయాడు. దాంతో స్కిన్ స్పెషలిస్ట్ ను కలిశాడు. థామస్ కు ఎక్స్ రే తీసి చుస్తే అతని కడుపులో ఒక సాలిడ్ బతికే ఉంది.
  తర్వాత ఆపరేషన్ చేసి ఆ సాలిడ్ ను తీసేశారు. ఈ సాలిడ్ అతని కడుపులోకి ఎలా వెళ్లిందో తెలుసా? థామస్ కు అంతకముందు జరిగిన అపెండెక్స్ ఆపరేషన్ వలన అతని పొట్టపై ఉన్న చిన్న గాటు నుంచి అతని కడుపులోకి వెళ్ళింది. అది వెళ్లినా చోటల్లా ఎర్రని గీతాలాగా ఏర్పడింది.
Image result for మనుషుల శరీరంలో బతికున్న జీవులు
 1. snail in knee…
  2014 లో పాల్ ప్రాంక్లిన్ అనే 4 ఏళ్ల అబ్బాయి కాలిఫోర్నియాలో ఉన్న బీచ్ లో తన ఫ్యామిలీతో ఆడుకుంటున్నాడు. ఆ టైమ్ లో ఆ అబ్బాయిని ఒక రాయి గీసుకుని గాయమయ్యింది. దాంతో అతని తండ్రి ఒక ఆయిన్ మెంట్ రాసి బ్యాండేజ్ వేశాడు. ఒక వారం తర్వాత చుస్తే ఆ గాయం ఇంకా మానలేదు. పైగా ఆ గాయం చుట్టూ నల్లగా అయ్యి కాలు మొత్తం వాచిపోయింది. అయితే డాక్టర్ దగ్గరకు వెళ్తే ఇది నార్మల్ గాయమే అని చెప్పి కొన్ని మందులు ఇచ్చింది. రెండువారాల తర్వాత కూడా గాయం మానలేదు. అయితే లోపల ఏమైనా రాయి లాంటిది ఉందేమో అని ఆ గాయాన్ని పిండేయాలనుకుంది పాల్ వాళ్ళ అమ్మ. గాయాన్ని పిండి చుస్తే అందులో రాయి లేదు ఒక సముద్రపు నత్త అందులో జీవిస్తుంది. ఈ నత్త ఆ గాయంలోకి ఎలా వెళ్లిందో తెలుసా? బీచ్ వద్ద పాల్ కు బ్యాండేజ్ చుట్టినప్పుడు ఆ బ్యాండేజ్ లో నత్త గుడ్డు ఇరుక్కుపోయింది. దాంతో బ్యాండేజ్ తో పాటు గుడ్డు కూడా లోపలికి వెళ్ళిపోయింది. అక్కడే ఆ గుడ్డు పొదిగి పెద్దదయ్యింది.
 2. cockroch in skul..
  2017 లో తమిళనాడుకు చెందిన సెల్వి అనే మహిళ నిద్రలో ఉన్నప్పుడు ఉన్నట్టుండి ముక్కు, కళ్ళ దగ్గర భయంకరమైన నొప్పి మొదలైంది. దాంతో వెంటనే మెలుకువ వచ్చింది. మరుసటి రోజు ఉదయం స్టాన్లీ హాస్పిటల్ కు వెళ్ళింది. అప్పటికే ఆమెకు తలనొప్పి ఎక్కువైంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. దాంతో డాక్టర్స్ ఆమెకు ఎండోస్కోపీ చేశారు. అప్పుడు తెలిసింది ఏమిటంటే..ఆమె రెండు కళ్ళ మధ్య, మెదడుకు దగ్గరలో ఒక బొద్దింక కనిపించింది. తర్వాత 45 నిమిషాల పాటు ఆపరేషన్ చేసి ఆ బొద్దింకను బయటకు తీశారు. అసలు ఆ బొద్దింక ఆమె పుర్రె లోపలికి ఎలా వెళ్లిందో తెలుసా? ఆమె పడుకున్నప్పుడు ఆమె ముక్కులోకి దూరి ఆమె తలలోకి వెళ్ళిపోయింది.
 3. worms in ear..
  2016 మధ్యప్రదేశ్ కు చెందిన రాధికా అనే అమ్మాయి చెవిలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆమె చెవిని ఎక్స్ రే తీసిన డాక్టర్స్ షాక్ అయ్యారు. కృసిమో అనే పురుగు ఇంకా దాని 80 గుడ్లు ఆమె చెవిలో ఉన్నాయి. తర్వాత ఆపరేషన్ చేసి చెవిలో నుంచి 80 పురుగు గుడ్లను బయటకు తీశారు. ఐతే ఈ పురుగు ఆ పాప చెవిలోకి ఎలా వెళ్లాయి అంటే వాళ్ళ ఇంట్లో అంత అశుభ్రంగా ఉంటుంది. అలాంటి ప్లేస్ లో ఈ పురుగులు ఎక్కువగా ఉంటాయి. అలా వాళ్ళ ఇంట్లో ఉన్న ఈ పురుగు టైమ్ చూసుకుని ఆ పాప చెవిలోకి పోయింది. లోపలికి వెళ్ళాకా గుడ్లు పెట్టింది.
Content above bottom navigation