మన శరీరంలో మాత్రలు ఎలా పనిచేస్తాయి..

112

మనకి ఆరోగ్యం బాగోలేనప్పుడు మెడిసిన్స్ వేసుకోవడం అనేది సహజం. మెడిసిన్స్ వేసుకున్న కొద్దిసేపటిక ఏదైనా నొప్పి కానీ, వ్యాధి కానీ నయం అవ్వడం, మనకి ఉపశమనం కలగడం అనేది జరుగుతుంది.. అయితే అసలు మనం వేసుకున్న మెడిసిన్స్ మన శరీరంలోకి వెళ్ళాక ఎలా పని చేస్తాయి? మనం వేసుకున్న మందుకి నేరుగా పలానా ప్రదేశానికే వెళ్ళాలి అని ఎలా తెలుస్తుంది? మనం మెడిసిన్ వేసుకున్న కొద్ది సేపటికే ఉపశమనం ఎలా కలుగుతోంది? ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మనం మెడిసిన్ వేసుకున్నప్పుడు, అది కడుపులోని చిన్న ప్రేగు నుంచి కాలేయంలోకి ప్రయాణిస్తుంది, అక్కడ మనం వేసుకున్న మెడిసిన్ అతి చిన్న చిన్న భాగాలుగా విచ్ఛిన్నమై, దాని అవశేషాలు రక్తంతో కలిసి, శరీరంలోని అన్ని అవయవాలు, కణజాలాలకు ప్రయాణించడం మొదలుపెడతాయి. అయితే రక్తంలో కలిసిన డ్రగ్ కి నొప్పి శరీరంలోని పలానా భాగంలో ఉంది, నేరుగా ఆ ప్రదేశానికే వెళ్ళాలి అని ఏమీ తెలియదు. అదృష్టవశాత్తూ, మన శరీరానికి ఒక వ్యవస్థ ఉంది. అదేమిటంటే రక్తంతో కలిసి వచ్చిన డ్రగ్ ని, వ్యాధి ఉన్న ప్రదేశం ఆటోమేటిక్ గా స్వీకరించడం మొదలుపెడుతుంది. రక్తంతో కలిసి ఉన్న డ్రగ్ కూడా నొప్పి లేదా వ్యాధి ఉన్న ప్రదేశం చేరుకున్న తరువాతనే రియాక్ట్ అవ్వడం మొదలవుతుంది.

ఆ ప్రదేశం దొరకనంత వరకు కూడా రక్తంతో పాటుగా శరీరం మొత్తం తిరుగుతుంటుంది తప్ప రియాక్ట్ అవ్వడం మాత్రం జరగదు. ఇది అంతా బాగానే ఉంది కానీ, నొప్పి లేదా వ్యాధి ఉన్న ప్రదేశం చేరుకునేంతవరకు డ్రగ్ అనేది రియాక్ట్ అవ్వకపోవడం నిజమయితే మరి సైడ్ ఎఫెక్ట్స్ సంగతేమిటనే డౌట్ మీకు రావొచ్చు.. ఒక్కొక్కసారి డ్రగ్స్ కూడా లక్ష్య ప్రదేశంతో కాకుండా ఇతర ప్రదేశాలతో రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది.

Image result for మన శరీరంలో మాత్రలు ఎలా పనిచేస్తాయి

సాధారణంగా ఇలాంటి సందర్భాలను కీమోథెరపీ తీసుకుంటున్న కాన్సర్ బాధితులలో మీరు గమనించవచ్చు. డ్రగ్ అనేది వ్యాధి కన్నా ముందు శరీరంలోని వేగంగా పెరిగే, వేగంగా విభజించే కణాల కోసం వెతుకుతాయి. అందుకే వ్యాధి ఉన్న ప్రదేశం కన్నా ముందు జుట్టు కణాలతో రియాక్ట్ అవ్వడం మొదలుపెడతాయి. కీమోథెరపీ బాధితులకు జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి కారణం ఇదే..ఇలా మన శరీరంలోకి వెళ్లిన మెడిసిన్ వ్యాధి, నొప్పి ఉన్న బాగాల్లోనే పనిచేస్తుంది.

Content above bottom navigation