మరణానంతరం ఐదుగురికి ప్రాణం

167

దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని అనేవారు. ఇప్పుడు ఆ గొప్ప దానాల్లో అవయవ దానం కూడా నిలబడింది. ఎందుకంటే మనం పోయినా మన అవయవాలు ఇతరులకు జీవితాన్ని ఇస్తాయి. దీంతో మనం వాళ్ళల్లో కూడా బతికినట్టే. వాళ్ల విజయంలో మనం భాగస్వాములం అయినట్టే. అవయవ దానం గురించి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో అవగాహన కల్పిస్తున్నాయి. తాజాగా ఓ మహిళ తాను మరణించి మౌనంగా అవయవదానం విశిష్ఠతను చెప్పారు. ఐదుగురికి ప్రాణదాతగా నిలిచారు.

Image result for అవయవ దానం

తాను కన్నుమూసినా ఐదుగురికి ప్రాణదానం చేసింది ఈ మ‌న‌సున్న‌ గృహిణి. నగరంలోని కొత్తపేట ప్రాంతానికి చెందిన గృహిణి బొయినపల్లి రుద్రమదేవి వ‌య‌సు 65 సంవ‌త్స‌రాలు.. తన నివాసంలో ఈ నెల 9 వతేదిన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడినుంచి సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు చికిత్సలు అందించారు.

        ఈ క్రమంలో ఆమె ఈ నెల 11 వ తేదీన జీవన  మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు... దీంతో జీవన్‌దాన్‌ ప్రతినిధులు రుద్రమదేవి కుటుంబ సభ్యులను కలిసి అవయవ దానంపై అవగాహన కల్పించారు. వారు అవయవ దానానికి అంగీకరించారు. దీంతో ఆమె రెండు మూత్రపిండాలు, కళ్లు, కాలేయంను పలు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్న అవసరమైనవారికి అమర్చినట్లు జీవన్‌దాన్‌ ప్రతినిది డాక్ట‌ర్  స్వర్ణలత వివరించారు.

ఇది చాలా గొప్ప విష‌యం మ‌న దేశంలో ఇలా అవ‌య‌వ‌దానం పై ఇటీవ‌ల ప్ర‌చారం బాగా జ‌రుగుతోంది, గ‌తంలో ఇలా అవ‌య‌వ‌దానం అంటే చాలా త‌క్కువ మంది వ‌చ్చేవారు.. కాని ఇప్పుడు చాలా మంది స్వ‌తంత్రంగా ఇస్తున్నారు, అయితే మ‌నం పోయిన త‌ర్వాత ఆ అవ‌య‌వాలు మ‌ట్టిలో క‌లిసిపోతాయి.. అదే అవ‌స‌రం ఉన్న వ్య‌క్తికి ఇస్తే స‌జీవంగా మ‌నం ఉన్న‌ట్లే అని కొంద‌రు ప్ర‌ముఖులు కూడా చెబుతూ ఉంటారు, అయితే చాలా మంది విద్యావేత్త‌లు డాక్ట‌ర్లు ఇలా చేయ‌డానికి ప్ర‌చారం కూడా క‌ల్పిస్తున్నారు, మ‌న దేశంలో కాక‌పోయినా అమెరికా ర‌ష్యా ఇలాంటి దేశాల్లో ఈ మ‌ధ్య వంద‌కి 45 మంది ఇలా ముందే అవ‌య‌వ దానానికి సంత‌కాలు చేస్తున్నార‌ట‌.

Content above bottom navigation