మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న కొణిదెల కోడలు ఉపాసన.. ఏం చేసిందో తెలిస్తే గ్రేట్ అంటారు..

64

ఆమె పెద్దింటికి కోడలు.. పెద్ద ఫ్యామిలీ నుంచే వచ్చింది.. కోట్లకు పడగలెత్తిన తల్లిగారి కుటుంబం ఒకవైపు.. టాలీవుడ్ లోనే నంబర్ 1 ఫ్యామిలీ అత్తింటి వారు మరోవైపు ఆమెకు అండగా ఉన్నారు.. అంతటి కుబేరుల ఫ్యామిలీ కోడలు అంటే ఏకోశానా కొంచెం గర్వం ఉంటుంది. కానీ ఇవేమి ఆమెకు లేవు. ఈపాటికే మీకు అర్థం అయ్యి ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నానో. ఆమెనే కొణిదెల కోడలు ఉపాసన.సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే ఈమె తాజాగా పేదల కోసం మరో మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు తన ఫాలోవర్స్ కి దాని పట్ల అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది ఉపాసన. దానికి సంబందించిన పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ గ్రూపుల చైర్‌ పర్సన్‌ ఉపాసనది ఎంత గొప్ప మనసో మనకు తెలుసు. ఎప్పటికప్పుడు మంచి మంచి కార్యక్రమాలు చేసి తన గొప్ప మనసును చాటుకునే ఉపాసన మరోసారి తన మంచి మనసు చాటుకుంది. బిజినెస్‌ లతో బిజీగా ఉండే ఉపాసన సామాజిక సేవ కోసం కూడా సమయాన్ని కేటాయిస్తున్నారు. పేదలకు తనవంతు సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగమవుతూ సోషల్ మీడియాతో తన ఫాలోవర్స్‌ కు అవగాహన కల్పిస్తున్నారు ఉపాసన. అందరినీ తమవంతు సాయం అందించాలని కోరుతున్నారు.

తాజాగా ఉపాసన పేదల కోసం మరో మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. మనం మన కోసమే కాకుండా జనం కోసం కూడా ఆలోచించాలంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది ఉపాసన కొణిదెల. మన జ్ఞాపకాలతో ముడిపడనివి, వాడేసిన వస్తువులు, దుస్తులు ఏమైనా ఉంటే వాటిని ఇచ్చే ఏర్పాటు చేయాలంటున్నారామె. అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ గ్రూపులకు చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తనవంతు సమాజసేవ చేస్తుండడటం చూస్తున్నాం. ఈ మేరకు ఇప్పుడు మనకు అవసరం లేనివి, వాడేసిన వస్తువులు, దుస్తులను పేదలకు ఇచ్చే ఏర్పాటు చేయాలంటూ ఈ కార్యక్రమం చేపట్టింది ఉపాసన. ఈ మేరకు తన ఇంట్లో వాడకం మొదలుపెట్టి 10 నెలలు దాటిన అలాంటి వస్తువులను జనం కోసం వినియోగించేందుకు సిద్ధమవ్వాలంటూ సోషల్ మీడియాతో పిలుపునిస్తూ ఓ ఫోటో షేర్ చేసింది. దీంతో ఆమె మంచి మనసు చూసి ‘దటీజ్ ఉపాసన’ అంటూ పొగుడుతున్నారు నెటిజన్స్. మా మెగా కోడలు బంగారం అంటూ కామెంట్స్ పెడుతున్నారు మెగా ఫాన్స్.

Content above bottom navigation