మహాశివరాత్రి రోజున మహాద్భుతం… జీవితంలో మళ్ళి చూడలేరు

139

శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుడిని పూజించడం హైందవుల ఆచారం. పరమశివుడు కాలుడు అనే పేరుతో పిలవబడుతుంటాడు. కాలము అనే మాటకు సర్పము అనే అర్థం కూడా చెప్పబడుతోంది. ఇందుకు సంకేతంగానే శివుడు నాగుపామును మెడలో ధరించి కనిపిస్తుంటాడు. చిత్రపటాల్లోను విగ్రహ రూపాల్లోనూ శివుడు పాముని ధరించి కనిపిస్తూ ఉంటాడు. సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా అక్కడ పాముల ప్రతిరూపాలు విగ్రహాలుగా చెక్కబడి ఉండటం మనం చూస్తూ ఉంటాం. పామును మనం దేవుడిలా పూజిస్తాం. శివుడంతటి వాడే పామును మెడలో ఆభరణంగా ధరించాడు. చాలా వరకు అన్ని దేవాలయంలో ఒక చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది. అవి మానవులు గీసినవి, చెక్కినవి కనుక పెద్దగా పట్టించుకోము. అయితే నాగుపాము నేరుగా శివుని మెడలో చుట్టుకోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే విషయమని చెప్పక తప్పదు. అలాంటి మహిమాన్వితమైన సంఘటనే ఇప్పుడు జరిగింది. అది కూడా మహాశివరాత్రి రోజు జరిగింది. మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

పంజాబ్ అమృత్ సర్ కు దగ్గరలో ఉండే ఒక చిన్న పల్లెటూరులో ఉండే పొలంలో ఒక చిన్న శివుని విగ్రహం ఉంది. ఆ విగ్రహం చాలా చిన్నగా ఉండటంతో పీఠాన్ని కొద్దీ ఎత్తులోనే నిర్మించారు. అయితే ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక నాగుపాము శివుని కంఠాన్ని అలంకరించింది. సాధారణంగా నాగుపామును 10 సెంమీ కన్నా పడగ ఉండదు కానీ ఈ పాముకు 20 సెంమీ మేర పడగ విస్తరించి ఉండటమే కాకుండా కేవలం తోకమీదనే పడగ విప్పడం చూసి అందరు షాక్ అయ్యారు. ఆ పాము బుసలు దాదాపు 100 మీ వరకు వినిపించడం మరొక ఆశ్చర్యపోయే విషయం. ఆ పామును నాగదేవతగా భావించిన అక్కడివారు పాము ఇతర ఆహారపదార్థాలను ఉంచిన ఆ పాము ముట్టుకోలేదు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసిన శివుని మెడలో నుంచి కిందికి దిగలేదు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడటంతో జనాలు తండోపతండాలుగా వచ్చారు.

సాధారణంగా పాము కొంచెం నల్లగా ఉంటుంది కానీ ఈ పాము పూర్తీగా నల్లగా ఉంది. పురాణాల్లో శివుడి మెడలో ఉండే పాముకు ఉండే లక్షణాలన్నీ ఈ పాములో కూడా కనిపిస్తుండటంతో పండితులు ఆశ్చర్యపోతున్నారు. ఇలా శివుని విగ్రహానికి అది కూడా శివరాత్రి రోజున ఒక నిజమైన త్రాచుపాము ఇలా చుట్టుకోవడం అంతా వింతగా ఉందని, భక్తులకు ఇలా శివుని మెడలో పాము కనిపించడం లో భక్తులు భక్తి పారవశ్యం లో మునిగి తేలుతున్నారు …శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు అని భావించే మనుషులకు ఇలా పాము శివుని విగ్రహానికి చుట్టుకోవడం ఆ శివుని ఆజ్ఞ తోనే ఇలా ఆ పాము దర్శనము ఇచ్చిందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.

Content above bottom navigation