మహాశివరాత్రి రోజున మహాద్భుతం… మారిపోయిన అర్చకుడి జీవితం

80

యావత్తు భారతావని కూడా మహాశివరాత్రిని జరుపుకుంది. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 5 గంటల నుంచే ఆలయానికి క్యూ కట్టారు భక్తులు. ఓం నమః శివయ్య, హరహరమహదేవ నినాదాలతో ఆలయాలు హోరెత్తాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులంతా వేకువజాము నుంచే శివాలయాలకు చేరుకొని శివుడుకు ప్రీతిపాత్రమైన బిల్వ, మారేడు, జిల్లేడు, విభూద, క్షీరాభిషేకాలు చేసారు. శివాలయాలు వద్ద భక్తులు సౌకర్యార్థం కోసం ఆయా ఆలయ కమిటీలు ప్రత్యేక బ్యారికేడ్లను ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు ఏర్పాటు చేసారు. ఇక ఈ మహాశివరాత్రి రోజున ఒక ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. సాక్షాత్తు ఆ పరమశివుడి లీలగానే పరిగణిస్తున్నారు ప్రజలు. మరి ఏమైందో చూద్దామా.

ఆంద్రప్రదేశ్ రాష్టంలోని పెద్దచంద్రపాడు పుణ్యక్షేత్రంలో ఉన్న నంది విగ్రహం పై శివలింగం నుంచి వెలుగు ప్రసరించింది. ఈ వెలుగు కారణంగా ఆలయ అర్చకుడి జీవితమే మారిపోయింది. ఈ పుణ్యక్షేత్రంలో ఉన్న శివలింగం నిలువెత్తు ఉంటుంది. ఇది సాధారణ క్షేత్రమే అయినా ఇక్కడ ఉండే నందీశ్వరుడు నిల్చుని ఉంటాడు. అంటే శివలింగం ఎత్తులో నంది విగ్రహం కూడా నిల్చుని ఉంటుంది. ఇక మహాశివరాత్రి రోజున అర్చకులు స్వామివారికి అర్చన చేస్తుండగా ఒక్కసారిగా మూడవకన్ను వద్ద కదలిక కనిపించింది. దాంతో అర్చకులు దూరంగా జరిగి ఏం జరుగుతుందో అని చూశారు. అప్పుడు శివలింగం నుంచి వెలువడిన కాంతి నందీశ్వరుడి మీద పడి, ఆలయం అంతా కళ్ళు మిరమిట్లు గొలిపే వెలుగుతో నిండిపోయింది. అయితే ఇక్కడే అసలైన అద్భుతం చోటుచేసుకుంది.

Image result for mahashivratri

ఆ ఆలయంలో ఎంతో కాలంగా అర్చకుడిగా పనిచేస్తున్న త్రిభున స్వామికి పోలియో కారణంగా కాళ్ళు చచ్చుబడిపోయాయి. దాంతో ఎప్పుడు కుంటుతూనే నడుస్తుండేవాడు. ఆ స్వామి గొప్ప శివ భక్తుడు. చిన్నప్పటినుంచి శివారాధన చేస్తున్నా, ఒక్కసారి కూడా కనుకరించలేదంటూ బాధపడేవాడు. కానీ ఇన్నాళ్లకు ఆ శివయ్య త్రిభున స్వామిని కనికరించాడు. తన అధీన శక్తితో త్రిబున స్వామి లోపాన్ని పోగొట్టాడు. ఆలయంలో ఒక్కసారిగా వచ్చిన కాంతిని తట్టుకోలేక త్రిబున స్వామి వెనక్కి పడిపోయాడు. ఆ తర్వాత పైకి లేవగానే రెండవ కాళ్ళు కూడా పనిచెయ్యడం ప్రారంభించింది. ఇన్నాళ్లు అనుభవించిన బాధంతా పోయి, మళ్ళి నార్మల్ గా నడవడం మొదలుపెట్టాడు. త్రిబున స్వామి అందరిలా నార్మల్ గా నడుస్తుండడంతో గ్రామస్థులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయాను. త్రిబున స్వామి కుటుంబ సభ్యులే జరిగింది ఏంటో అర్థం కాక అయోమయంలో పడిపోయారు. ఈ విషయం తెలిసి చుట్టూ పక్కల గ్రామస్థులు కూడా ఈ ఆలయానికి తండోపతండాలుగా చేరుకుంటున్నారు. ఇది నిజంగా శివుడి మహిమకు నిదర్శనం అని భక్తులు నమ్ముతున్నారు. మహాశివరాత్రి రోజున ఆ ముక్కంటి తానేంటో చూపించాడని ఆలయ అర్చకులు చెబుతున్నారు.

Content above bottom navigation