మహాశివరాత్రి రోజున సిగరెట్లు వెలిగించి శివుడికి పూజలు.. భక్తి చాటుకున్న జనం

151

దేశవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. నిష్ఠతో ఉపవాసం, భక్తితో జాగారానికి దేశవ్యాప్తంగా భక్తులు సిద్ధమై శివరాత్రి వేడుకలు జరుపుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. భోళా శంకరుడి మొక్కులు చెల్లించుకోవడానికి తెల్లవారుజాముననే నిద్రలేచి, పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కొందరు పాలు, పళ్లు ఫలాలు మాత్రమే తీసుకుని ఉపవాసం ఆచరించారు. శివలింగానికి అభిషేకాలు, పూలు, పళ్లు సమర్పించి దీపాలు వెలిగించి అగరుబత్తులు వెలిగించారు. అయితే సాధారణంగా తమ కోరికలు తీరితే భక్తులు దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం పరిపాటి. తలనీలాలు, నగదు, నగలు ఇంకా ఇతర రూపంలో మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే ఓ శివాలయంలో భక్తులు సిగరెట్లతో మొక్కులు చెల్లించుకుంటారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. నిన్న శివరాత్రి రోజున ఆ మహాశివుడికి సిగరెట్లను సమర్పించారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఓ శివాలయంలో మాత్రం వింత ఆచారం ఏళ్లుగా అమలులో ఉంటోంది. సోలన్ జిల్లాలోని లూట్రా మహాదేవ్‌ ఆలయంలో కొలువైన శివ లింగానికి ఇతర ఆలయాల్లోలాగా అగరుబత్తులను వెలిగించకుండా, భిన్నంగా సిగరెట్లతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే, ఇక్కడ భక్తుల విశ్వాసం మరోటి ఉంది. సిగరెట్లను గర్భ గుడిలోని శివలింగంపై ఉంచగానే వాటంతట అవే వెలుగుతున్నాయనేది ఇక్కడి భక్తులు నమ్ముతున్నారు. సిగరెట్ వెలిగాక అచ్చం మనం పొగ పీల్చినట్టుగానే సిగరెట్ నుంచి పొగ వస్తుంది. శంకరుడికి ఇలా సిగరెట్లను సమర్పించడం వల్ల భక్తుల కోరికలు తీరుతాయని వారు నమ్ముతారు. ఈ మందిరాన్ని 1621లో నిర్మించారట. కొండల నడుమ ఎంతో దివ్యంగా వెలిసింది ఈ ఆలయం. ప్రతీ ఏడు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు అక్కడికి తండోపతండాలుగా వస్తుంటారు.

Image result for సిగరెట్లు వెలిగించి శివుడికి పూజలు

ఇక ఈ విషయం మీద ఏ ఒక్క హిందువు కూడా తప్పు పట్టడం లేదు. కాశీలో కూడా శివుడికి పరామభక్తులు ఉంటారు. స్మశానాలలో తిరుగుతూ ఆ మహాశివుడ్ని పూజిస్తారు. అలాగే శివుడికి పరామభక్తులు అయినా అఘోరాలు కూడా సిగరెట్లు, చుట్టలు తాగుతూ ఉంటారు. ఇవి అంటే శివుడికి ఇష్టమే అని అక్కడి భక్తులు చెప్తున్నారు. ఇక విషయం తెలిసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయినా శివుడ్ని ఆరాధించడం ముఖ్యం, ఎలా ఆరాదిస్తే ఏముంది. ఎలా పూజించిన కూడా ఆ శివపార్వతుల కరుణ భక్తుల మీద ఉంటుందని కొందరు అంటున్నారు.

Content above bottom navigation