మహాశివరాత్రి రోజు అద్భుతం : హైదరాబాద్ లో శివ లింగానికి అభిషేకం చేసిన పాములు

దేశవ్యాప్తంగా మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు భక్తులు. శివనామస్మరణలతో శైవ క్షేత్రాలు.. మార్మోగాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం శ్రీరాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ లోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు బారులు తీరి దైవ దర్శనం చేసుకుంటున్నారు. శివుడికి అభిషేకాలు, అర్చనలు చేశారు. అయితే ఎన్నడూ లేనంతగా ఒక ఆలయంలో ఈసారి మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ ఆలయమే హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్‌ లో మూసీ నది తీరాన్న ఉన్న కాశీ బుగ్గ ఆలయం. ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది.

1822లో రాజా రాఘవ్ రామ్‌జీ నిర్మించిన ఈ ఆలయంలో శివలింగం భూగర్భంలో ఉంటుంది. మానవ ప్రమేయం లేకుండా 365 రోజులు నిరంతరాయంగా శివుడికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఈ ఆలయాన్ని నిర్మించిన రోజుల్లోనే శివలింగానికి ప్రతిరోజు అభిషేకం జరిగేలా ఏర్పాట్లు చేశారు. శివలింగానికి సమీపంలో ఉన్న చిన్న రంథ్రం నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఎన్నో ఔషద గుణాలు గల ఈ నీటిని రోజూ సేవిస్తే.. క్యాన్సర్ వంటి రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. మధుమేహం సమస్యలతో బాధపడేవారు సైతం ఇక్కడికి వచ్చి.. ఆ పవిత్ర జలాన్ని బాటిళ్లలో నింపుకుని తీసుకెళ్తారు. ఈ ఆలయానికి ప్రస్తుతం రాజ్‌కుమార్ భరత్ లాల్‌ జీ ట్రస్టీగా ఉన్నారు.

Image result for కిషన్‌బాగ్‌ లో మూసీ నది తీరాన్న ఉన్న కాశీ బుగ్గ ఆలయం.

రోజూ తెల్లవారుజామున 3 గంటలకు పాములు ఆలయంలోకి చేరి గర్భగుడిలో ఉన్న శివుడికి అభిషేకం చేస్తాయని భక్తులు అంటున్నారు. ఉదయాన్నే ఆలయానికి వెళ్లేవారికి శివ లింగంపై పాములు కనిపిస్తాయని చెబుతున్నారు. నిన్న మహాశివరాత్రి రోజున కూడా పాములు వచ్చి శివలింగానికి అభిషేకం చేశాయి. ఇంతటి విశిష్టత గల ఈ ఆలయానికి చేరుకునేందుకు భక్తులకు సరైన సదుపాయాలు లేకపోవడంతో చాలా తక్కువ మందే ఇక్కడికి వచ్చేవారు. మూసి నది దాటి ఆలయానికి రావాలంటే తాత్కాలికంగా నిర్మించిన వంతెన ఒక్కటే దిక్కని, నీటి ప్రవాహం పెరిగితే ఆ వంతెన మునిగిపోతుందని వార్తలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి అభివృద్ధి పనులు చేపట్టింది. సమీపంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఈ ఏడాది మహాశివరాత్రి రోజున భారీ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

Content above bottom navigation