మహాశివరాత్రి స్పెషల్ : పాకిస్తాన్ లో ఉన్న శివాలయం గురించి ఎవరికీ తెలియని విషయాలు ..

మన దాయాది దేశం పాకిస్తాన్‌ లో హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయి. అయితే అవన్నీ కూడా ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడం వలన అవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. అందులో ఒక ఆలయం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

హిందువుల దేవాలయాల్లో చారిత్రక విశిష్టత కలిగిన దేవాలయం కటాసరాజ ఆలయం. పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్టంలోని చక్వాల్‌ జిల్లాలోని కటాస్‌ గ్రామంలో ఉన్నది. ఇది ఒక శివాలయం. మహాభారతకాలంలో పాండవులు తమ అరణ్యవాసంలో కొంతకాలాన్ని ఈ ప్రదేశంలో గడిపినట్టు భావిస్తారు. పాకిస్తాన్‌ ప్రభుత్వం, ఈ ప్రాంతానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తేవాలని భావిస్తోంది. మూడు దశల్లో, దీని పునరుద్ధరణకు కొంతకాలం క్రితం 20 మిలియన్లు కేటాయించాలని కూడా ప్రతిపాదించింది. దక్ష యజ్ఞసమయంలో, సతీదేవి ప్రయో ప్రవేశం చేసినదన్న వార్త తెలిసినపుడు శివుని కంటి నుండి రెండు కన్నీటిబొట్లు రాలాయి. అవి భూమి మీద పడినపుడు, ఒకటి ఇక్కడి కటాస క్షేత్రంలోని అమృతకుండ్‌ తీర్థంగానూ, రెండవది భారతదేశంలోని రాజస్థాన్‌ రాష్ట్రంలోని అజమేరులోని పుష్కర రాజ్‌ తీర్థంగానూ మారాయి. మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి తాను అగ్నిని మధించే ఆరని ఒక చెట్టు కొమ్మలో దాచాననీ, అప్పుడే వచ్చిన ఒక దుప్పి, ఆ కొమ్మను రాచుకోన్నందున ఆరణి దాని కొమ్ములలో చిక్కుకొని పోయినదని, దానిని తెచ్చి ఇవ్వవలసినదిగా కోరగా ధర్మరాజు నలుగురు తమ్ములతో లేడిని పట్టుకోవడానికి బయలుదేరుతారు. కొంతసేపటికి ఆ లేడి మాయమవుతుంది.

Image result for కటాసరాజ ఆలయం

వెతికి వెతికి అలసట చెంది మంచి నీరు తెమ్మని నకులుని పంపగా… అతను ఎంతకూ రాకపోవడంతో సహదేవుని పంపుతారు. అదే విధంగా అర్జునుడు, భీముడు ఎవరు తిరిగిరారు. చివరకు ధర్మరాజు బయలుదేరి మంచినీటి కొలను ప్రక్కనే పడివున్న నలుగురు తమ్ములను చూసి దుఃఖంతో భీటిల్లుతాడు. అంతలో అదృష్యవాణి ఇలా పలుకుతుంది. ‘‘ధర్మనందనా నేను యక్షుడను. ఈ సరస్సు నా ఆధీనంలో ఉన్నది. నేనడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక, నీ తమ్ములు అహంభావంతో దాహం తీర్చుకోబోయి నందుననే ఈ గతి పట్టినది. నీవయిన, నా ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ దాహం తీర్చుకో అన్నా డు యక్షుడు. దానికి సరే అన్నాడు ధర్మరాజు. వీటినే, యక్షప్రశ్నలుగా హిందువులు చెప్పుకుంటూ ఉంటారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ దేవాలయం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఇదొక్కటే కాదు పాకిస్తాన్ లో ఉన్న అనేక హిందూ దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఈ ఆలయక్షేత్రాన్ని ప్రపంచవారసత్వ సంపదగా గుర్తింపజేయాలని పాకిస్తాన్‌ ప్రయత్నిస్తోంది. 2006-07లో ఇక్కడి ఏడు ఆలయా లలో విగ్రహాలను పునఃప్రతిష్టించేందుకు నిర్ణయించి 51.06 మిలియన్‌ రూపాయలను కేటాయించింది. భారతదేశం నుండి ఈ విగ్ర హాలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించు కొంది. ఈ పని మీద, ముగ్గురు పురాతత్వ వేత్తల జట్టు భారతదేశంతోపాటు, శ్రీలంక, నేపాల్‌లలో కూడా సందర్శించింది. 2005 సంవత్సరంలో భారత మాజీ ఉపప్రధాని లాల్‌ కృష్ణ అద్వానీ ఈ ఆలయాన్ని సందర్శించారు.

Content above bottom navigation