మాతృభూమి రుణం తీర్చుకునే ఇండియన్ గూర్ఖాలు.. Special Story ….. telugutv

59

మాతృభూమి రుణం తీర్చుకునే దేశ రక్షకులు…ప్రాణాలకు తెగించి పోరాడే యుద్ధ వీరులు.. ‘పిరికివాడిగా బతకడం కంటే చావడమే మేలు’ అని నినాదిస్తు.. దేశ సేవలో తరిస్తున్న నిజమైన హీరోలు.. వీళ్ళ కత్తి కోన భరతమాతకు రక్త తిలకం లాంటిది. నీటి ప్రవాహ అడుగును బట్టి శత్రువుల గుట్టును తెలుసుకునే పోరాట యోధులు వీళ్ళు. వాళ్ళే ‘గూర్ఖా రైఫిల్స్‌’ . వీళ్ళ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా పోరాడే వీళ్ళ మీద ఒక చిన్న స్టోరీ మీకోసం..

ఇండియన్‌ ఆర్మీలో భాగమైన ‘గూర్ఖా రైఫిల్స్‌’ రెండు శతాబ్దాలుగా మాతృభూమి రక్షకులుగా ఉన్నారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ 1815వ సంవత్సరం, ఏప్రిల్‌ 24న గూర్ఖాలను తొలిసారిగా నియమించింది. బ్రిటీషర్స్‌ పరిపాలనలో ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో పాల్గొని శత్రువుల్లో వణుకు పుట్టించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం గూర్ఖాలను యథావిధిగా కొనసాగించింది. ప్రస్తుతం భారతదేశంలో ఏడు గూర్ఖా రెజిమెంట్లు, రైఫిల్స్‌ (1,3,4,5,8,9,11) ఉన్నాయి. ప్రతి రెజిమెంట్లో 5 లేదా 6 బెటాలియన్లు ఉంటాయి. ప్రతి బెటాలియన్లో 800 మంది సైనికులుంటారు. ఏడు రెజిమెంట్లలో దాదాపు 30 వేల మంది గూర్ఖాలు సేవలిందిస్తున్నారు. సైనికుల్లో 65 శాతం మంది నేపాలీ నుంచే వస్తున్నారు. 35 శాతం మంది సైనికులు డార్జిలింగ్‌, డెహ్రడూన్‌, ధర్మశాల, ఇంకా ఇతర ప్రదేశాల నుంచి వస్తున్నారు.

Image result for గూర్ఖా రైఫిల్స్‌

1814-16 సంవత్సరాల్లో ఆంగ్లో నేపాల్‌ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో గూర్ఖాల పరాక్రమం చూసిన బ్రిటీష్‌ వాళ్లు వాళ్లని ‘బ్రిటీష్‌ ఇండియన్‌ ఆర్మీ’ లో భాగం చేశారు. ప్రస్తుతం ‘గూర్ఖా రైఫిల్స్‌’ గా కొనసాగుతున్నా, ఇంతకు ముందు దీన్ని ‘ నుస్సిరీ రెజిమెంట్‌ ‘ అని పిలిచేవారు. భారతదేశం స్వాతంత్య్రం పొందాక 1,3,4,5,8,9 రెజిమెంట్లకు చెందిన ఆరు గూర్ఖా రైఫిల్స్‌ ను ఇండియన్‌ ఆర్మీలో భాగం చేసుకోగా, 2,6,7,10 జీఆర్‌ లు బ్రిటీష్‌ ఆర్మీలో బ్రిగేడ్స్‌ గా సేవలందిస్తున్నాయి. ఆర్మీలో చాలా కీలకమైన పాత్రను వీరు పోషిస్తారు. 1962 సంవత్సరం లడఖ్‌ లో జరిగిన యుద్ధంలో, 1965, 1971 సంవత్సరాల్లో జమ్మూకశ్మీర్‌ లో జరిగిన యుద్ధాల్లో శత్రువులను మట్టుపెట్టి, వీరులుగా నిలిచినందుకు యుద్ధ పురస్కారాలు పొందారు.

భారత్‌, శ్రీలంక మధ్య శాంతిని నెలకొల్పడంలో కూడా వీరి పాత్ర గొప్పది. 3 పరమ వీర చక్ర, 33 మహావీరచక్ర, 84 వీరచక్ర వీరి ఖాతాలో ఉన్నాయి. గూర్ఖాల శౌర్యానికి ఇవి ప్రతీకలుగా నిలుస్తాయి. గూర్ఖా రైఫిల్స్‌ కు చెందిన ప్రతి సైనికుడు దగ్గర ‘ ఖుక్రీ ‘ అనే ఆయుధమంటుంది. ఖుక్రీ అనేది నేపాలీకి చెందిన ఒక రకమైన ఖడ్గం. జవాన్లకు దానితో మనిషి గొంతు కోయడంలో కూడా ట్రైనింగ్ ఇస్తారు. గూర్ఖాలంతా గోర్ఖలి భాషలోనే మాట్లాడుతారు.

Content above bottom navigation