మారుతీరావుకు తలకొరివి ఎవరు పెడుతున్నారో తెలిస్తే షాక్

104

మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఘటన తెలుగు రాష్టాల్లో ఎంత సంచలన స్పృష్టించిందో మనకు తెలుసు. కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుందని, 2018 సెప్టెంబ‌ర్ 14న అల్లుడు ప్రణయ్‌ ని అత్యంత దారుణంగా నడి రోడ్డుపై హత్య చేయించాడు. ఆ తర్వా మారుతీరావు 7 నెలలుగా వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఉన్నారు. అనంతరం గత ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌పై విడుదల బయట తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కారు డ్రైవర్, హోటల్ సిబ్బంది చూసి పోలీసులకు ఇంఫార్మ్ చేశారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత అతడి భార్యకు మృతదేహాన్ని అప్పగించారు. రాత్రి మారుతీరావు మృతదేహాన్ని మిర్యాలగూడకు తరలించారు. మరికాసేపట్లో మారుతీరావు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిర్యాలగూడలోని హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు చేయనున్నారు. ఆయన నివాసానికి కుటంబసభ్యులు, స్నేహితులు చేరుకుంటున్నారు.

కాగా మారుతీరావుకి ఆయన సోదరుడు శ్రవణ్ తలకొరివి పెట్టనున్నారు. కూతురు ఉన్నా కానీ ఆమె రాలేని పరిస్థితి. అయితే కడసారి తండ్రిని చూడాలని అమృత ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆమె తండ్రిని కడసారి చూడాలని భావించింది. కానీ ఆమె రాకను బాబాయ్ శ్రవణ్, తల్లి గిరిజా నిరాకరించారు. దీంతో తనకు పోలీసుల భద్రత కావాలంటూ అమృత కోరుతోంది. తనకు పోలీసులు భద్రత కల్పిస్తే చివరిసారిగా తండ్రి శవాన్ని చూస్తానని ఆమె పోలీసులను వేడుకోవడం గమనార్హం. అయినప్పటికీ అమృత రాకుండానే మారుతీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె చివరి చూపు కూడా దక్కించుకోలేకపోయింది.

Image result for మారుతీరావుకు తలకొరివి ఎవరు

మరోవైపు మారుతీరావు మృతి మిస్టరీగా మారింది. ఆయన మృతిపై పోలీసులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆయనది హత్యా… లేక ఆత్మహత్యా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటికైతే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. కేసుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రణయ్‌ని హత్య చేసినందుకు పశ్చాత్తపం చెందాడా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు సోదరుడు శ్రవణ్‌తో ఆస్తి తగాదాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఆ ఆరోపణలను శ్రవణ్ ఖండిస్తున్నప్పటికీ.. ఇటీవల మారుతీరావు వీలునామాలో సోదరుడి పేరును తొలగించడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ప్రస్తుతం వీలునామాపై కూడా దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసుల వేధింపుల వల్లే ఆయన ఆత్మ హత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Content above bottom navigation