మారుతీరావు ఆత్మహత్యకు వీలునామానే కొంపముంచిందా? సంచలన నిజాలు

27

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. కేసుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రణయ్‌ని హత్య చేసినందుకు పశ్చాత్తపం చెందాడా అన్నది తెలియాల్సి ఉంది. ఆత్మహత్య చేసుకోవాలని మారుతీరావు ముందే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. శనివారం మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన మారుతీరావు.. అంతకంటే ముందు నల్గొండకు వెళ్లాడు. అక్కడ ఎప్పుడూ వెళ్లే ఓ ఫర్టిలైజర్ షాపుకు వెళ్లి పురుగుల మందు కొని హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆర్యవైశ్య భవన్‌లో మారుతీరావు గది అద్దెకు తీసుకున్నాడు. అదే రోజు రాత్రి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుసుకున్న డ్రైవర్ హోటల్ సిబ్బందిని పిలిచాడు. ఆ తర్వాత అందరు కలిసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికి మంచంపై అతను విగతజీవిగా కనిపించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు.

మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంపై ఎన్నో రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడంతా ఆయనకు ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపైనే చర్చ జరుగుతోంది. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే, మారుతీరావు సంపాదించిన రూ.వందల కోట్ల ఆస్తే ఆయన ఆత్మహత్యకు కారణంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మారుతీరావు రాసిన వీలునామా పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. సోదరుడు శ్రవణ్‌తో ఆస్తి తగాదాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఆ ఆరోపణలను శ్రవణ్ ఖండిస్తున్నప్పటికీ.. ఇటీవల మారుతీరావు వీలునామాలో సోదరుడి పేరును తొలగించడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ప్రస్తుతం వీలునామాపై కూడా దర్యాప్తు జరుపుతున్నారు.

Image result for మారుతీరావు వీలునామా

ప్రణయ్ హత్యకు ముందు 2018 మార్చిలో మారుతీరావు ఆస్తి వీలునామా రాశాడు. అందులో తన సోదరుడు శ్రవణ్‌కు కూడా ఆస్తి పంపకాలు చేశాడు. అయితే జైలు నంచి విడుదలై బయటకొచ్చాక కొన్ని కారణాలతో ఈ మధ్యే వీలునామాను మారుతీరావు మార్చాడు. ఆస్తి మొత్తం తమ్ముడికి దక్కకుండా చేయాలనే ఉద్దేశంతో వీలునామా నుంచి తన తమ్ముడి పేరును తొలగించాడని తెలుస్తోంది. అంతేకాకుండా, కూతురు అమృతతో సయోధ్య కోసం కొంత కాలంగా మారుతీరావు మధ్యవర్తిత్వం పంపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. తన ఇంటికి వచ్చేస్తే ఆస్తి కూతురికి రాసిస్తానని, అంతేకాక, తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పేలా కూడా మారుతీరావు అమృతను కోరినట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనే మారుతీరావు ఆత్మహత్య వెనుక ఆస్తి తగాదాలు ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మారుతీరావు వీలునామా మార్చడానికి దారి తీసిన పరిస్థితులపైనా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు, తాను చెబితేనే మారుతీరావు వీలునామాలో తన పేరు లేకుండా చేశాడని సోదరుడు శ్రవణ్ ఆదివారం మీడియాకు చెప్పాడు.

Content above bottom navigation