మారుతీరావు ఆత్మహత్యకు స్నేహితుడే కారణమా? పురుగుల మందు తీసుకొచ్చి ఇచ్చింది ఎవరు?

139

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటన్నది ఇప్పటివరకు స్పష్టం కాలేదు. కేసుల ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రణయ్‌ని హత్య చేసినందుకు పశ్చాత్తపం చెందాడా అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు సోదరుడు శ్రవణ్‌తో ఆస్తి తగాదాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఆ ఆరోపణలను శ్రవణ్ ఖండిస్తున్నప్పటికీ.. ఇటీవల మారుతీరావు వీలునామాలో సోదరుడి పేరును తొలగించడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు ప్రస్తుతం వీలునామాపై కూడా దర్యాప్తు జరుపుతున్నారు.

ఆత్మహత్య చేసుకోవాలని మారుతీరావు ముందే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. శనివారం మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన మారుతీరావు.. అంతకంటే ముందు నల్గొండకు వెళ్లాడు. అక్కడ ఎప్పుడూ కలిసే ఓ ఫర్టిలైజర్ షాపులోని మిత్రుడి వద్దకు వెళ్లాడు. చాలా ఏళ్లుగా మారుతీరావుకు అదే అడ్డా. అదే షాపులో మారుతీరావు పురుగుల మందు బాటిల్‌ ను కొనుగోలు చేశాడు. అయితే అది ఎందుకు అని అడగగా పొలానికి కావాలని చెప్పాడంట. అయితే ఎప్పుడు తీసుకెళ్తాడు అని ఆ షాప్ ఓనర్ కూడా దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఆ స్నేహితుడే మారుతీరావుకు పురుగుల మందు అమ్మాడు. ఇక పురుగుల మందు తీసుకున్నాకా హైదరాబాద్ బయలుదేరారు. కారులో హైదరాబాద్‌ కు వస్తున్న సమయంలో పురుగుల మందు బాటిల్ గురించి డ్రైవర్ ఆరా తీశాడు. అయితే ఇంటి వద్ద చెట్లకు కొట్టేందుకు తీసుకున్నానని మారుతీరావు చెప్పినట్టు సమాచారం. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆర్యవైశ్య భవన్‌ లో మారుతీరావు గది అద్దెకు తీసుకున్నాడు. కాసేపటికి డ్రైవర్‌ తో కలిసి బయటకు వెళ్లి పానీపురి తిన్నాడు.

Image result for మారుతీరావు  పురుగుల మందు

అనంతరం డ్రైవర్‌ ను కారులోనే పడుకోమని చెప్పి.. తాను మాత్రం గదిలోకి వెళ్లి పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు ఓ న్యాయవాదిని కలిసేందుకు వెళ్లాలని, ఉదయం సిద్దంగా ఉండాలని డ్రైవర్‌ తో చెప్పాడు. మారుతీరావు చెప్పినట్టే.. డ్రైవర్ ఉదయాన్నే సిద్దమై అతన్ని లేపేందుకు గదిలోకి వెళ్లాడు. మారుతీరావును లేపేందుకు ప్రయత్నించగా, ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు. దీంతో ఆర్యవైశ్య భవన్ సిబ్బందికి విషయం చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికి మంచంపై అతను విగతజీవిగా కనిపించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు. ఉస్మానియాలో పోస్టుమార్టమ్ పూర్తయిపోవడంతో మృతదేహాన్ని మిర్యాలగూడకు తరలించే ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో మిర్యాలగూడలోని మారుతీరావు, అమృత ప్రణయ్‌ ల ఇళ్ల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మారుతీరావు బస చేసిన హోటల్ గదిలో క్లూస్ టీమ్ పలు ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. మారుతీరావు సోదరుడు శ్రవణ్ మాట్లాడుతూ.. కేసులో ట్రయల్ పూర్తయిపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురై ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. మారుతీరావు పశ్చాత్తపడ్డారా అని మీడియా అడగ్గా.. పశ్చాత్తపం చెందాల్సిన అవసరం లేదని కేసు గురించే ఆందోళన చెంది ఉంటాడని అన్నారు. ఏడాది కాలంగా అన్నతో తనకు మాటల్లేవని, కాబట్టి ఆయన ఆత్మహత్యకు సంబంధించి తనకెలాంటి వివరాలు తెలియవన్నారు.

Content above bottom navigation