మారుతీరావు ఆత్మహత్యపై ప్రణయ్ తండ్రి సంచలన కామెంట్స్

143

2018 సెప్టెంబర్ 14 న మిర్యాల గూడలో జరిగిన ప్రణయ్ హత్య ఘటన ఎంత కలకలం స్పృష్టించిందో అందరికి గుర్తుకుండే ఉంటుంది. ఇప్పుడు ఈ కేసులో ప్రధాన నిందితుడు అయినా మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి ప్రాణం తీసుకున్నాడు. నిన్న రాత్రి ఆయన సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే మారుతీరావు ఆత్మహత్యపై ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందించారు. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే…

హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌ ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి మారుతీరావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రి ఆయన ఆర్యవైశ్య భవన్‌లో బస చేశారు. ఉదయాన్నే తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది.. ఆయన గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. విషం తాగినట్లు గుర్తించిన సిబ్బంది అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. పోలీసుల వేధింపుల వల్లే ఆయన ఆత్మ హత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్షం చెబితే ఆస్తి తన పేరున రాస్తానని మధ్య వర్తులతో మారుతీరావు, అమృతకు రాయబారం పంపినట్లు తెలిసింది. పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల కిందట విడుదలైన మారుతీరావు అప్పటి నుంచి కూతురు అమృతను వేధిస్తున్నట్లు తెలిసింది. అమృత ఫిర్యాదుతో మారుతీరావును ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు మిర్యాలగూడ పోలీసులు. ఆ తర్వాత మళ్లీ బెయిల్ పై విడుదలయ్యారు. కూతురు దూరమైందని తీవ్ర మనస్తాపంతో మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారా అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు… ఆత్మహత్యకు కారణం పోలీసుల వేధింపులే అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

Image result for ప్రణయ్ తండ్రి

ప్రణయ్ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఈలోగా మారుతీరావు ఆత్మహత్య చేసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. మారుతీరావు భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసుల ఒత్తిడితోనే ఆయన చనిపోయినట్లు మారుతీరావు భార్య అంటున్నారు. ఇక మారుతీరావు మరణంపై ప్రణయ్ తండ్రి స్పందించాడు. మారుతీరావు ఆత్మహత్య విషయం మాకు ఎవరూ చెప్పలేదు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు టీవీలో చూసాం. ప్రణయ్‌ను చంపిన పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడు. అసలు ఏమైందనే విషయం మాకు తెలీదు. ఏమైనా రేపే చెప్పగలం. బహుశా తప్పు తెలుసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు. లేక ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయేమో మాకు తెలీదు. తండ్రిని చూడటానికి వెళ్ళమని మేము మా కోడలికి చెప్తున్నాం. కానీ తాను వెళ్ళను అని చెప్తుంది. ఈ విషయంలో తన నిర్ణయాన్ని తనకే వదిలేస్తున్నాం అని బాలస్వామి మీడియాకు తెలియజేశాడు.

Content above bottom navigation