మార్చి 25 ఉగాది రోజున రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే మీ ఇంట్లో కనకవర్షమే

177

తెలుగు సంవత్సరాల ప్రకారం చైత్రమాసంలోని పాడ్యమితో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రోజునే ఉగాది పండుగ జరుపుకుంటారు. దీని వల్ల కాలాన్ని లెక్కించడానికి వీలవుతుందని పురాతన కాలంలో పండితులు నిర్ణయించారు. ఉగాది వేళ ఘడియలు, గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, రుతువులు, ప్రాణులు కాలస్వరూపమైన ఏడాదిలో నివసిస్తుంటాయి. ఉగాది నాడు ముఖ్యమైంది పంచాంగ శ్రవణం. దీన్ని ఈరోజే నిర్వహించడానికి కారణం తెలుగు సంవత్సరాది ప్రారంభమయ్యేది ఆ పర్వదినంతోనే కాబట్టి. ఉగాది రోజున ఆలయంలోగానీ, ఓ ఆధ్యాత్మిక ప్రదేశంలో గానీ పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఏవైనా దోషాలుంటే వాటి నివారణకు పూజలు నిర్వహించి ఇబ్బందులు తొలగించుకోడానికే పంచాంగ శ్రవణం చేస్తారు. ఒక్కొక్క ఉగాదికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ 2020 మార్చి 25 నుంచి మొదలయ్యే తెలుగు సంవత్సరాన్ని శ్రీ శార్వరి నామ సంవత్సరం అని అంటారు. అయితే ఈ ఉగాది రోజున రూపాయి బిళ్ళతో మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీర్చుకోవచ్చంట..అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

మనలో చాలామంది కుబేరుడికి పూజ చేస్తారు. ఆర్థికపరంగా ఎవరికైనా సరే పురోగతి కావాలన్నా వాళ్ళు తలపెట్టిన పని నిర్విఘ్నంగా పూర్తయ్యి, అవి లాభాన్ని తీసుకురావాలన్న కూడా మనం కుబేరుడికి పూజ చేస్తాం. కుబేరుడు ధనానికి అధిపతి. కుబేరుడి మీద ధనలక్ష్మి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికే కుబేరుడు అప్పు ఇచ్చాడంటే కుబేరుడు ఎంత ధనవంతుడో అర్థం చేసుకోండి. అందుకే ధనలాభం కలగాలంటే మనం కుబేరుడికి పూజ చేస్తాం. అయితే ఈ కుబేరుడికి ఇప్పుడు నేను చెప్పే విధంగా పూజ చెయ్యండి.. మీకున్న సమస్యలన్నీ పోతాయి.. కుబేర పూజ ఎలా చెయ్యాలంటే…

Image result for ఉగాది రోజున రూపాయి బిళ్ళతో

లక్ష్మీదేవితో కలిపి కుబేరుడు, ఆయన భార్య కలిసున్న ఫోటో మార్కెట్ లో దొరుకుతుంది. అలాగే ధనాన్ని కురిపిస్తున్న ఫోటో కూడా అందులో ఉంటుంది. ఈ ఫోటోను ఇంటికి తీసుకొచ్చిన తరువాత ఒక రూపాయి కాయిన్ ను తీసుకొచ్చి ఆ ఫోటో ముందు పెట్టాలి. ఆ ఫోటోను బొట్టు, పువ్వులతో అలంకరించాలి. సువాసన పువ్వులతో అలంకరించిన తర్వాత కుబేరుడికి పాలతో నైవేద్యం పెట్టాలి. ఫోటో ముందు పెట్టిన రూపాయి కాయిన్ కు కూడా పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి పూలు అక్షింతలు పెట్టి స్వామివారి దగ్గర పెట్టాలి. ఆ తరువాత మనకున్న సమస్యలను, మన మనసులో ఉన్న కోరికలను స్వామివారి ముందు పెట్టాలి. ఆ తర్వాత మనం చేయాల్సింది ఏమిటంటే.. పూజంత అయిపోయి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ఆ రూపాయి కాయిన్ ను తీసుకుని ఎవరికీ కనిపించకుండా ఉండే ప్లేస్ లో లేదా మన ఇంట్లో ఎవరు చూడలేనటువంటి బీరువాలో కానీ లేదా ఇంకెక్కడైనా లాకర్ లాగా ఉండే ప్రదేశంలో పెట్టాలి. ఇలా పెడితే ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఆర్థిక సమస్యలతో సతమవుతున్న వాళ్ళు తప్పకుండ ఇలా చేసి చూడండి.

Content above bottom navigation