మ్యాజిక్ పెన్నుతో మాయ‌లు

115

ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తారు అందరూ..
నిరుద్యోగులు వేయి క‌ళ్ల‌తో చూస్తారు.. కాని ఇప్పుడు ద‌ళారుల చేతుల్లోకి ఈ ఉద్యోగాలు వెళ్లిపోతున్నాయి..
చాలా మందికి ఈ ఉద్యోగాలు చేయాలి అని క‌ళ‌, కాని ఇది నిజంగానే క‌ల‌గానే మారిపోతోంది.
ఈ ఉద్యోగాల‌కు సంబంధించి పేప‌ర్ లీక్ అనే ఘ‌ట‌న‌లు గ‌తంలో వెలుగుచూశాయి.
వెంట‌నే ప‌రీక్ష‌ని ర‌ద్దు చేసిన సంద‌ర్బాలు ఉన్నాయి.
దేశంలో ఆయా ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఉద్యోగాలు ఎంతో ప్లాన్ తో నిర్వ‌హించినా పేప‌ర్ల లీకేజీ బెడ‌ద డ్యామేజ్ చేస్తోంది.

తాజాగా త‌మిళ‌నాడులో ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఉద్యోగాలలో న‌యా మోసం వెలుగుచూసింది, వీరు ఇదంతా ఓ మేజిక్ పెన్ తో చేశారు, అవును న‌మ్మ‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా, అతి తెలివితేట‌ల‌తో ఈ మోసం చేశారు, కాని క‌ష్ట‌ప‌డి పోటీ ప‌రీక్ష‌లు రాసిన నిరుద్యోగులు ఈ మోసాన్ని బ‌య‌టపెట్టారు.. అస‌లు ఎలా వీరు మోసం చేశారో చూద్దాం.

Image result for digital pen

సాధార‌ణంగా అంద‌రూ ఈ ప‌రీక్ష రాయ‌డానికి వ‌చ్చారు, దాదాపు ల‌క్ష‌ల మంది ఈ ప‌బ్లిక్ సర్వీస్ పరీక్ష త‌మిళ‌నాడులో రాశారు. పేప‌ర్ చాలా ట‌ఫ్ గా ఉంది అనుకున్నారు, కాని ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది, కొంద‌రు ద‌ళారుల‌తో కుమ్మ‌క్క‌య్యారు నిరుద్యోగులు.

వారికి ద‌ళారులు ఓ డిజిట‌ల్ పెన్ ఇచ్చారు.. ఇది ఇంక్ రిమూవ‌బుల్ పెన్ , దీంతో వీరికి తోచినట్లు అన్నీ స‌మాధాన‌ల‌కి మార్క్ చేశారు. అయితే మార్క్ అనేది ప‌రీక్ష ముగిసే 20 నిమిషాల ముందు చేశారు, ఇలా చేసి ఆన్స‌ర్ ఓఎంఆర్ షీట్ ని అక్క‌డ ఇన్విజిలేట‌ర్ కు ఇచ్చారు, అయితే ఆ త‌ర్వాత మ‌రో క‌థ న‌డిచింది

ఇక్క‌డ ఇన్విజిలేట‌ర్ స్కాన‌ర్ ద‌గ్గ‌ర‌కు పంపే క్ర‌మంలో ఈ దళారులు డ‌బ్బులు ఇచ్చిన వారి పేప‌ర్లు బ‌య‌ట‌కు తీస్తారు.. అక్క‌డ నిరుద్యోగి టిక్ చేసిన ఇంక్ మార్క్ 20 నిమిషాల్లో పోతుంది…ఎందుకు అంటే అది కేవ‌లం 20 నిమిషాలు మాత్ర‌మే ఇంక్ విజిబుల్ గా ఉంటుంది.. సో ఈ ఆన్స‌ర్ పేప‌ర్ జీరోగా క‌నిపిస్తుంది, అప్పుడు ఆన్స‌ర్లు అన్నీ ఆ ద‌ళారులు టిక్ చేస్తారు, దీంతో వీరికి 150 కి 140 మార్కులు వచ్చాయి… ఈ మోసంతో అస‌లైన ర్యాంక‌ర్లు ఉద్యోగాలు కోల్పోయారు..

ఏమీ చ‌ద‌వని వారికి ఎలా ఇన్ని మార్కులు వ‌చ్చాయి అని డౌట్ తో తీగ లాగితే డొంక అంతా క‌దిలింది.. ఈ చీట‌ర్ల‌పై ద‌ళారుల‌పై కేసు న‌మోదు చేశారు పోలీసులు .. దాదాపు 200 మందికి ఈ పెన్స్ ఇచ్చార‌ట‌, చూశారా ఎంత‌టి మోసాల‌కి పాల్ప‌డుతున్నారో, ఇలా చేస్తే ఇక క‌ష్ట‌ప‌డి పోటీ ప‌రీక్ష‌ల‌కి ప్రిపేర్ అయ్యే వారి ప‌రిస్దితి ఎలా ఉంటుంది.

Content above bottom navigation