యుగాంతం సమయానికి మనుషులు ఎలా మారతారో తెలుసా ?

ప్ర‌స్తుతం మ‌నం అంద‌రం ఉన్న‌ది క‌లియుగంలోనేన‌ని అంద‌రికీ తెలుసు. ఈ యుగంలోనే యుగాంతం వ‌స్తుంద‌ని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌లియుగంలో మనుషులు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారని, అందుకు అవ‌స‌ర‌మైతే అడ్డదారులు కూడా తొక్కుతారని, వయసు, ఎత్తు, బలం, జ్ఞానం, ఆకర్షణ వంటివన్నీ రానురాను కలియుగంలో తగ్గిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. అవ‌న్నీ జ‌ర‌గ‌డం కూడా మ‌నం చూస్తున్నాం. అయితే వేదాలు కూడా క‌లియుగం గురించి కొన్ని నిజాల‌ను మ‌న‌కు చెబుతున్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కలియుగంలో వర్ణ, ఆశ్రమ సంబంధిత ప్రవర్తన ఉండదని వ్యాసుడు చెబుతూ ఉండేవాడు. వేదాలను ఎవరు అనుసరించరు. వివాహ ధర్మాన్ని ఎవరు పాటించరు. గురుశిష్యుల మధ్య ఉండాల్సిన గౌరవ మర్యదలు ఉండవు. కుమారులు కూడా తమ ధర్మాన్ని నెరవేర్చరు. కొద్దిపాటి ధనంతోనే గర్వం తలకెక్కుతుంది. స్త్రీలకూ తాము అందంగా ఉన్నామనే గర్వం ఎక్కువవుతుంది. స్త్రీలు మాన, భర్తలను వదిలేస్తారు. డబ్బున్న మగవారే ఆ స్త్రీలకూ భర్తలు అవుతారు. డబ్బు కోసం ఆడవారు ఇతర మగవారితో సంబంధాలు పెట్టుకుంటారు. ఒక మనిషికి ఉన్న గుణ గ‌ణాలు, పేరు గాక అత‌నికి ఉండే ఆస్తి అంటేనే ఇత‌రులు ఎక్కువ‌గా విలువ‌నిస్తారు. డ‌బ్బును బ‌ట్టే మ‌నిషి గుణ గ‌ణాలు నిర్ణ‌యిస్తారు. దానధర్మాలు అంతమైపోతాయి. బుద్ధి డబ్బుల మధ్య యుద్ధం మొదలవుతుంది. డబ్బంతా విలాసాలకు ఖర్చు అవుతుంది. కలియుగంలో స్త్రీలు తమ ఇష్టానుసారం బతుకుతారు. త‌ల్లిదండ్రుల‌ను మోసం చేసే పిల్ల‌లు, పిల్ల‌ల‌ను మోసం చేసే త‌ల్లిదండ్రులు ఉంటారు. కలియుగంలో ప్రజలు ఎప్పుడు భయాందోళనలతోనే జీవిస్తారు. వర్షాలు పడవు. పంటలు లేని కారణంగా ప్రజలు పండ్లు, గడ్డి తిని బతకాల్సి వస్తుంది. ఆరోగ్యం కుంటుపడుతుంది. బ్రహ్మచారులు బ్రహ్మచర్యాన్ని పాటించకుండానే వేదాలను చదువుతారు.

గృహస్థులు కూడా తమ ధర్మాన్ని పాటించకుండా సత్యం, ధర్మాన్ని మర్చిపోతారు. ఈ కారాలన్నిటితో మనుషుల ఆయుష్షు పడిపోతుంది. 8 సంవత్సరాల బాలికలు 10 సంవత్సరాల బాలురతో కలిసి సంతానాన్ని కంటారు. కలియుగం చివర్లో మనిషి ఆయుష్షు 20 సంవత్సరాలే ఉంటుంది. మనుషులు మంద బుద్ధిగల వారిలా మారతారు. భయంకరమైన యుద్దాలు సంభవిస్తాయి. విపరీత గాలులు, భీభత్సమైన సునామీలు సంభవిస్తాయి. దొంగలు విజృంభిస్తారు. డబ్బు, బట్టలు అన్ని దోపిడీకి గురవుతాయి. దొంగలు దొంగలనే దోచుకుంటారు. హత్యలు జరిగి చాలామంది హంతకులుగా మారుతారు. క‌లియుగం అంతం అవుతుంద‌న‌గా ఆవులు ఉండ‌వు. చ‌నిపోతాయి. ఎక్క‌డా ఆల‌యాలు ఉండ‌వు. క‌నుమ‌రుగైపోతాయి. క్రోధ, లోభ, మధ, మాత్సర్యాలతో మనుషులు దిగజారిపోతారు. రోగాలు విజృంభిస్తాయి.

కలియుగాంతారంలో కొంతమంది సత్పవర్త సేవ చేసి సత్కర్మలు చేసి దర్మం కనీసం ఒక పాదం మీద అయినా నడిచేటట్టు చేస్తారు. వారి వలన లోకకల్యాణం జరుగుతుంది. ధర్మాన్ని అనుసరించడం ప్రజలు మొదలుపెడతారు. ధర్మమే గొప్పదని నమ్మడం మొదలుపెడతారు. పోనుపోను అధర్మం పోయి ధర్మస్థాపన జరుగుతుంది. భూమి మీద ధాన్యం మొలవదు. చెట్లన్నీ పచ్చదనం కోల్పోతాయి. గోవులు పాలు ఇవ్వడం మానేస్తాయి. ప్ర‌ళ‌యం వ‌చ్చి భూమిపై అంతా ఎటు చూసినా నీరే ద‌ర్శ‌న‌మిస్తుంది. 4 లక్షల 32 వేల సంవత్సరాల తర్వాత సత్యయుగం ప్రారంభం అవుతుంది. తర్వాత ద్వాపర, త్రేతా యుగాలు వచ్చి చివర్లో మళ్ళి కలియుగం ప్రారంభం అవుతుంది. ఈ కాలచక్రం నడుస్తుంది. ఈ రకంగా కలియుగం అంతమైపోయి సత్యయుగం ప్రారంభం అవుతుంది.

Content above bottom navigation