రాత్రి హోటల్లో ట్రంప్ ఫ్యామిలీ బాహుబలి సినిమా చూసి ప్రభాస్ గురించి ఏమన్నారో చూడండి.. v

151

భారత పర్యటనకు ట్రంప్ సకుటుంబ సపరివార సమేతంగా వచ్చిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం 11.30 గంటల సమయంలో కుటుంబ సమేతంగా ఇండియాకు వచ్చాడు ట్రంప్. ఆ తర్వాత సబర్మతి ఆశ్రమం వెళ్లారు. ఆ తరువాత అహ్మదాబాద్ లో ఉన్న మొతేరా క్రికెట్ స్టేడియంకు వెళ్లారు. అక్కడ నమస్తే ట్రంప్ పోగ్రామ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆగ్రా చేరుకొని తాజ్ మహల్ అందాలను సందర్శించారు. ఆ తర్వాత ఢిల్లీ చేరుకొని అక్కడ మౌర్య హోటల్ లో బస చేశారు. అయితే రాత్రి హోటల్ లో ఉన్న మినీ థియేటర్ లో ట్రంప్ ఫ్యామిలీ కోసం ఒక స్పెషల్ షో వేశారు. తెలుగు సినిమా, భారతీయ సినిమా స్థాయిని ఆకాశానికి తీసుకెళ్లిన బాహుబలి సినిమాను హోటల్ లో ప్రదర్శించారు. ఇప్పటివరకు బాహుబలి సినిమా గురించి వినిందే కానీ చూడలేదు, అందుకే ట్రంప్ ఫామిలీ కూడా ఈ సినిమాను చూడాలని కోరుకున్నారంట. దాంతో హోటల్ యాజమాన్యం బాహుబలి సినిమాను ప్రదర్శించారు.

ఇక సినిమా చూసినంతసేపు ట్రంప్ ఫ్యామిలీ మైమరచిపోయారంట. సినిమాలో ఉన్న కథ, విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్ ప్లే, ప్రభాస్, రమ్యకృష్ణ, రానా, అనుష్క నటన..ఇలా ప్రతి ఒక్కటి కూడా ట్రంప్ కుటుంబానికి నచ్చిందంట. అస్సలు ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా రెండు భాగాలను చూశారంట. ఇక ఈ సినిమాను మొత్తం తిలకించిన ట్రంప్ కుటుంబం, ఆ తర్వాత బాహుబలి సినిమాను మెచ్చుకున్నారు. ఇదోక అద్భుతమైన సినిమా అని, ఇలాంటి సినిమాలు హాలీవుడ్ లోనే వస్తుంటాయి, ఇలాంటి సినిమాలను ఇండియన్స్ కూడా తెరకెక్కిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. బాలీవుడ్ సినిమాలను అమెరికాలో చాలా ఎక్కువమంది చూస్తారు. బాహుబలి సినిమా కూడా అమెరికాలో అద్భుతంగా ప్రదర్శించారు. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా మేము చూడలేకపోయాం. ఇప్పుడు ఈ సినిమాను చూసే అవకాశం వచ్చింది. ఇంత మంచి సినిమాను చూపించినందుకు థాంక్స్ అంటూ సినిమాను పొగడ్తలతో ముంచెత్తారు.

Image result for trump family india

ఇక ఈ సినిమాలో ప్రభాస్ నటన, రాజమౌళి సినిమా టేకింగ్ విధానం ట్రంప్ ఫ్యామిలీకి ఎంతాగానమో నచ్చిందంట. ముఖ్యంగా బాహుబలి ప్రభాస్ హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని వాడిలా ఉన్నాడని ప్రభాస్ ను మెచ్చుకున్నాడు. ఇది ఒక ఇండియన్ సినిమాలాగా లేదని, హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉందని కొనియాడారంట. ఇలాంటి సినిమాలు ఇంకా ఇండియాలో తెరకెక్కాలి. ఇండియన్ సినిమా తారాస్థాయికి వెళ్ళాలి. అమెరికాలో ఇండియన్ సినిమాను ఇంకా ఎక్కువగా రిలీజ్ చేసేలా మేము చర్యలు తీసుకుంటాం అని ట్రంప్ చెప్పారు. నిన్న మొతేరా క్రికెట్ స్టేడియంలో జరిగిన మీటింగ్ లో కూడా ఇండియన్ సినిమాల గురించి ప్రస్తావించాడు ట్రంప్. దిల్వాలే దుల్హనే లేజాయేంగే, షోలే సినిమాల గురించి ప్రస్తావించి ఇండియన్ సినిమా ప్రియుల మనస్సు దోచుకున్నారు. ఇప్పుడు బాహుబలి సినిమాను పొగడ్తలతో ముంచెత్తడం అభిమానులను మరింత ఆనందాన్ని ఇస్తుంది.

Content above bottom navigation