రామాయణం తర్వాత లవ కుశులు ఏమయ్యారు?

343

మనకు రామాయణం గురించి తెలుసు. సీతారాముల పెళ్లి, రామలక్ష్మణులు సీతాసమేతంగా అరణ్యవాసం చెయ్యడం నుంచి సీతాదేవి తన తల్లి భూదేవి దగ్గరకు వెళ్లడం వరకు అంతా తెలుసు. అయితే రామాయణం తర్వాత ఏం జరిగింది. సీతాదేవి భూదేవి దగ్గరకు వెళ్లిన తర్వాత ఏం జరిగింది. సీతారాముల పిల్లలు లవకుశల రామాయణం తర్వాత లవ కుశులు ఏమయ్యారు. ఇది చాలా మంది మదిలో ఉన్న ప్రశ్న. ఆ వివరాల్లోకి పూర్తీగా వెళ్తే..

రావణ సంహారం తర్వాత రాక్షస లంక నుండి సీతాదేవిని తీసుకువచ్చిన తర్వాత రాముడికి ఎన్నో అవమానాలు ఎదురు అయ్యాయి. అయోధ్య నగరంలో సీత గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవటం, ఆ మాటలు రాముడు చెవిన పడటం జరిగింది. రాముడు చేసేది ఏమి లేక సీతను తానేమిటో నిరూపించుకోమని అగ్ని పరీక్ష పెడతాడు. ఈ అగ్ని పరీక్షలో సీతాదేవి ప్రతివ్రత అని నిరూపించుకుంటుంది. అయినా సరే రాజ్యంలోని ప్రజలు సీతాదేవి గురించి తప్పుగా మాట్లాడటం ఆపలేదు. దాంతో ఆ వేదనను తట్టుకోలేక సీతాదేవి అయోధ్యను విడిచి పెట్టి వెళ్ళిపోతుంది. ఆ విధంగా సంపా నది చివరన ఉన్న వాల్మికి ఆశ్రమంలోకి చేరుతుంది. అయోధ్యను విడిచి పెట్టె సమయంలో గర్భిణీగా ఉన్న సీతాదేవి కొన్ని రోజులకు లవ కుశులకు జన్మనిస్తుంది. లవ కుశులు ఆ ఆశ్రమంలోనే పెరిగి పెద్దవారు అవుతారు.

అక్కడే యుద్ధ విద్యలో శిక్షణ పొందుతారు. ఆ సమయంలోనే రామాయణం గురించి తెలుసుకుంటారు. కానీ ఆ రామాయణంలో ఉన్న సీతాదేవి తమ తల్లి అని,రాముడు తండ్రి అని వారికీ తెలియదు. రామాయణం గురించి తెలుసుకున్న లవ కుశులు రాముడు దేవుడు కాదని సీతాదేవిని కష్టాలు పెట్టి అయోధ్య నుండి వెళ్లకొట్టిన వాడని ఒక భావం ఉండిపోయింది. లోక కళ్యాణం కోసం రాముడు చేస్తున్న అశ్వమేధ యాగంలో అశ్వము ప్రపంచం మొత్తం తిరిగి చివరకు ఈ ఆశ్రమం వద్దకు వస్తుంది. ఈ అశ్వము రాముడిది అని తెలుసుకున్న లవకుశులు రాముడితోనే యుద్దానికి దిగుతారు.

Image result for లవకుశులు

రాముడు చేసేది ఏమి లేక సీతాదేవిని, కొడుకులను అయోధ్యకు తిరిగి తీసుకువెళ్లాలని భావిస్తాడు. అయితే సీతాదేవి తాను ఇక అయోధ్య రాలేనని తన తల్లి భూమాతలో ఐక్యం అయ్యిపోతుంది. ఆ తర్వాత రాముడు లవ కుశులను అయోధ్యకు తీసుకువెళ్లి రాజులను చేస్తాడు. రాముడు తర్వాత లవకుశులు రాజ్యాన్ని పాలించటం ప్రారంభిస్తారు. అలా వారు పాలించిన ప్రాంతాలలో లాహోర్ నగరం కూడా ఉంది. ప్రాచీన కాలంలో ఈ నగరాన్ని కలవపురి అని పిలిచేవారు. అంతేకాక కసుడు అనే నగరాన్ని కూడా పాలించారు. ఆ తర్వాత లవుడు సావాస్తి అనే నగరాన్ని, కుశుడు కుషావతి అనే నగరాలను నిర్మించారు. లవుడు నిర్మించిన దేవాలయం ఇప్పటికి లాహోర్ లోని సాహిర్ జిలాల్లో ఉంది. ఇక కుశుడు పాలించిన కుషావతిని గోరాపూర్ లోని కష్ గా గుర్తించారు. అంతేకాక కుషావతి అనే నది కూడా ఉంది. ఈ నది పశ్చిమ భారతదేశంలోని గోవాలో ఉంది. ఆ తర్వాత వీరి కాలం కూడా చెల్లింది. ఇది లవ కుశుల కధ.

Content above bottom navigation