రూ.100 ఇస్తే ఏం చేస్తావు? ఆ స్టూడెంట్ ఆన్సర్ కి టీచర్ ఫిదా..!

ఎవరైనా ఒక వ్యక్తి తన జీవితంలో ఎదగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒక్క సంఘటన చాలు ఒక మనిషి ఏదైనా సాధించాలనే కంకణం కట్టుకోడానికి. ఒక్క సంఘటన చాలు ఒక మనిషిలో స్ఫూర్తీ నింపడానికి. అలా ఒక జిల్లాకు కలెక్టర్ అయినా వ్యక్తి జీవితంలో కూడా ఎప్పటికి మర్చిపోలేని సంఘటన ఒకటి ఉంది. ఆ సంఘటన అతను ఇప్పటికి కూడా గుర్తుకుపెట్టుకున్నాడు. అసలు ఆ కలెక్టర్ జీవితంలో ఏమైందో చూద్దామా.

అది ఒక మారుమూల గ్రామంలో ఒక స్కూల్. బయట జోరుగా వర్షం పడుతుంది. తరగతి గదిలో టీచర్ పాఠం చెప్తున్నారు. పిల్లలు శ్రద్దగా వింటున్నారు. కానీ వాతావరణం డల్ గా ఉండడంతో ఆ ఎఫెక్ట్ పిల్లల ముఖాల్లో కూడా కనిపిస్తుంది. వాళ్ల మైండ్స్ ని జనరేట్ చేయాలనే ఉద్దేశంతో జేబులో నుండి వంద రూపాయలు తీసి ఇప్పుడు నేను ఈ వంద రూపాయలు ఇస్తే మీరేం చేస్తారు అంటూ ప్రశ్నించారు టీచర్. నేను బొమ్మకారు కొనుక్కుంటా అని సమాధానం చెప్పాడొక స్టూడెంట్. నేను ఫ్రెండ్స్ తో కలిసి సమోసాలు కొనుక్కుని తింటాను అంటూ చెప్పాడు మరోక విద్యార్ధి. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం సర్.. నేను ఆ డబ్బులతో క్రికెట్ బ్యాట్ కొనుక్కుంటాను అన్నాడు మరొక విద్యార్ధి. నేను మా అమ్మకి కళ్లజోడు కొంటాను సర్ అని చివరగా ఒక విద్యార్ధి సమాధానం ఇచ్చాడు. వెంటనే టీచర్ ఆ స్టూడెంట్ దగ్గరకు వెళ్లి, మీ అమ్మకి నువ్వెందుకు కళ్లజోడు కొనడం? ఆ పని మీ నాన్న చేస్తాడు. కాబట్టి ఈ వంద రూపాయలతో నీకోసం నువ్వు ఏం కొనుక్కుంటావ్ అని మళ్ళీ అడిగాడు.

నాకు మా నాన్న లేడు సర్, చనిపోయాడు. మా అమ్మ టైలర్ పని చేసి నన్ను మా చెల్లిని చదివిస్తుంది. బట్టలు కుట్టేటప్పుడు మా అమ్మ కళ్లు కనపడక చాలా ఇబ్బంది పడుతుంది. తను సంపాదించింది మా చదువులకి, తిండికే సరిపోవట్లేదు. అందుకే కళ్లజోడు కొనుక్కోవట్లేదు. మీరు ఈ డబ్బులిస్తే మా అమ్మకి కళ్లజోడు కొంటాను అంటూ మళ్లీ అడిగాడు. ఆ స్టూడెంట్ చెప్పిందంతా విన్నాక ఆ టీచర్ కళ్లు చెమర్చాయి. కన్నీళ్లను తుడుచుకుంటూ సరే ఇస్తాను, కానీ ఒక షరతు అని అన్నాడు. చెప్పండి సర్ మీరేం చెప్పినా చేస్తాను, మా అమ్మకి కళ్లజోడు కొనిపెట్టడం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అంటూ హుషారుగా అన్నాడు. దాంతో ఆ టీచర్ వంద రూపాయలు ఆ కుర్రాడి చేతిలో పెడుతూ రేపు నువ్వు పెద్దయ్యాక పెద్ద ఆఫీసర్ అవుతావు కదా ,అప్పుడు నాకు ఈ వంద రూపాయలు తిరిగి ఇచ్చేయాలి. అంతేకాదు నువ్వు పెద్దయ్యాకా కష్టాల్లో ఎవరైనా ఉంటె వారికి సహాయం చెయ్యాలి. ఇదే నా షరతు అన్నాడు. ఆ తర్వాత ఆ స్టూడెంట్స్ వంద రూపాయలు తీసుకుని వాళ్ళ అమ్మకు కళ్ళజోడు కొనిచ్చాడు. అలాగే తానూ జీవితంలో గొప్ప స్థానానికి రావాలి అని నిర్ణయించుకున్నాడు. టీచర్ చేసిన సహాయాన్ని జీవితంలో మర్చిపోనని ఆ స్టూడెంట్ అప్పుడు తన స్నేహితులతో అన్నాడు. ఇది 20 ఏళ్ల కింద ఒక స్కూల్ లో జరిగిన సంఘటన.

ఈ సంఘటన జరిగిన 20 ఏళ్ల తర్వాత ఆ స్కూల్ ముందు ఒక కారు వచ్చి ఆగింది. ఆ రోజు కూడా వర్షం కురుస్తుంది. తరగతి గదిలో టీచర్ పాఠం చెప్తున్నారు. ఎక్స్క్యూజ్ మి సర్ అంటూ ఆ స్టూడెంట్ తరగతి బయట ఉండి అన్నాడు. దాంతో ఎస్ అంటూ సమాధానం ఇస్తూ టీచర్ తలతిప్పారు. క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఎవరు వచ్చారా అని క్లాస్ రూమ్ డోర్ వైపు చూశారు..సర్ నన్ను గుర్తుపట్టారా..నేను మీతోనే చదువుకున్నా. మీరు నాకు అప్పుడు 100 రూపాయలు ఇచ్చారు. ఆ వంద రూపాయలు మీకిద్దాం అని వచ్చాను. ఇప్పుడు నేను కలెక్టర్ అయ్యాను సర్..ఇదంతా మీరు చెప్పిన చదువు వల్లనే అని ఆ టీచర్ కు పాదాభివంధనం చేస్తూ చెప్పాడు. చెప్పాడు. తన స్టూడెంట్ ఒక జిల్లాకు కలెక్టర్ అయ్యాడని తెలిసి ఆ టీచర్ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. కొద్దిసేపు స్కూల్ అంతా తిరిగి పాత జ్ఞాపకాలను తల్చుకుని సంతోషించాడు ఆ కలెక్టర్.

ఈ కథను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. ఒక మనిషి ఎప్పుడూ తన కోసం కాకుండా తన దేశం కోసం, తన కుటుంబం కోసం ఆలోచిస్తూ, దయాగుణం, మానవతా హృదయం కలిగి ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. మనలోని అవలక్షణాలే మనల్ని జీవితంలో పైకి ఎదగకుండా వెనక్కి లాగుతుంటాయి అనడానికి ఈ స్టోరి ఒక చక్కటి ఉదాహరణ. కాబట్టి మీరు కూడా నిస్వార్తంగా బతకడం అలవాటు చేసుకోండి. కుటుంబం, దేశం కోసం బతకండి.

Content above bottom navigation