రెండ్రోజుల్లో పెళ్లి… వరుడి మొబైల్‌ లో వేరే మగాడితో వధువు నగ్న దృశ్యం..

అది 2019 డిసెంబర్ 13. మరో రెండ్రోజుల్లో ఓ భారీ పెళ్లి జరగాల్సి ఉంది. అందమైన అమ్మాయి తనకు భార్యగా రాబోతోందని ఆ పెళ్లి కొడుకు చాలా ఆనందపడ్డాడు. కానీ డిసెంబర్ 13న అతని మొబైల్‌ కి కొన్ని ఫొటోలు వచ్చాయి. అవి కొత్త నంబర్ నుంచీ రావడంతో, వాటిని చూసేందుకు కూడా ఇష్టపడలేదు. వాటిని డిలీట్ చేద్దామనుకునేసరికి, ఆ ఫొటోల్లో ఉన్న అమ్మాయి అచ్చం తన కాబోయే భార్య లాగే ఉంది. అందుకే వాటిని ఓపెన్ చేసి చూసి ఆశ్చర్యపోయాడు. తనకు వచ్చిన ఫొటోలను మళ్లీ మళ్లీ చెక్ చేసి చూశాడు. అన్నింట్లో ఉన్నది అతని భార్యే. ఆ పక్కన ఆమెతో మరో యువకుడు ఉన్నాడు. అతనెవరు, అతనితో నా కాబోయే భార్య అంత క్లోజ్‌ గా ఎందుకుంది అని ఆలోచించుకునేలోపు, మరో ఫొటో వచ్చింది. అందులో ఆ యువకుడు ఆమెను డీప్ కిస్ పెడుతున్నట్లు ఉంది. అది చూసి అతని గుండె ఆగిపోయినంత పనైంది.

ఇంతలో మొబైల్ రింగైంది. అతని చేతులు జల్లున వణికాయి. ఆ టెన్షన్ లోనే కాల్ రిసీవ్ చేసుకున్నాడు. అవతలి నుంచీ “విషయం అర్థమైందనుకుంట. అయినా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. “ఎవరు నువ్వు.. నీకూ తనకూ సంబంధమేంటి? అని అడిగాడు. అది పెద్ద డోంగ్రీ… దాన్ని నమ్మకు. నన్ను అడ్డంగా మోసం చేసింది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి… నా డబ్బంతా తినేసి… అసాంతం రోడ్డున పడేసి… ఇప్పుడు నీ డబ్బును చూసి నిన్ను చేసుకుంటోంది” అన్నాడు.వెంటనే కొత్త పెళ్లికొడుకు “చూడు… పెళ్లికి ముందు ఏం జరిగిందో నాకు తెలీదు. నాకు అనవసరం కూడా. ఇలాంటి మార్ఫింగ్ ఫొటోలు చూసి నేను మోసపోను” అన్నాడు. “అరే బ్రదరూ… నాలాంటోళ్లు నిజం చెబితే… నీలాంటోళ్లు నమ్మరే… నీకు విజువల్ ఎవిడెన్స్ ఇస్తేగానీ నమ్మవేమో… వీడియో క్లిప్ పంపుతా… ఆ తర్వాత చేసుకుంటావో, మానుకుంటావో నీ ఇష్టం” అని కాల్ కట్ చేశాడు.

కొత్త పెళ్లికొడుకు మనసులో ఏవోవే ఆలోచనలు, గందరగోళం, టెన్షన్, ఆతృత అన్నీ ఒకేసారి వచ్చి మీదపడ్డాయి. అంతలో మరోసారి మెసేజ్ వచ్చింది. ఆతృతగా చూశాడు. ఇదివరకు ఫొటోలు పంపిన యువకుడే… ఈసారి ఓ వీడియో క్లిప్, దాని కింద తన మొబైల్ నంబర్ పంపాడు. ఆ వీడియోలో ఆ కుర్రాడితో ఆమె ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకున్న నగ్న దృశ్యాలున్నాయి. అంతే.. అది చూసీ చూడనట్లు చూసిన కొత్త పెళ్లికొడుక్కి పిచ్చెక్కినట్లైంది. పిచ్చి కోపం వచ్చింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కాసేపు జుట్టు పీక్కొని, వెంటనే ఆమెను కాల్ చేశాడు… ఒకటే ప్రశ్న “ఎవడాడు” అని అడిగాడు.

ఇద్దరి మధ్యా పెద్ద వాదనే జరిగింది. ఇద్దరి మొబైళ్లూ పగిలిపోయేంతలా మాట్లాడుకున్నారు. ఎంత అడిగినా… అతనెవరో తనకు తెలియదనీ, ఈ విషయంలో ఇంకా ప్రశ్నిస్తే సూసైడ్ చేసుకుంటానని బెదిరించింది. తనను వంద శాతం నమ్మమంది. ఎవరో మార్ఫింగ్ చేసిన వీడియోలు, ఫొటోలూ పంపితే, వాటిని నమ్మేస్తారా… ఇదేనా నాపై ఉన్న నమ్మకం అంటూ సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టింది. పడిపోయాడు. వాటిని డిలీట్ చేసేశాడు. మొబైల్ నంబర్ మాత్రం అలాగే వదిలేశాడు. పెళ్లైపోయింది. పెళ్లైతే అయ్యిందే గానీ, పీకుళ్లాట అలాగే ఉంది. రోజూ మనసులో ఏదో అనుమానం. ఎక్కడో తేడా కొడుతోందన్న ఫీల్. అతని అనుమానమే నిజమైంది. తాజాగా అతన్ని మరోసారి కాంటాక్ట్ అయ్యాడు. నాకూ తనకూ పెళ్లైపోయింది. బట్… తన వాలకం చూస్తుంటే నువ్వు నిజమే చెప్పిన్నట్లు అనిపిస్తోంది అన్నాడు.

Image result for రెండ్రోజుల్లో పెళ్లి…

ఇప్పుడు లైన్లోకి వచ్చావ్… నాకూ తనకూ గత ఏడేళ్లుగా ఫ్రెండ్షిప్ ఉంది. ఫిజికల్ కాంటాక్ట్ కూడా ఉంది. 2019 జూన్‌లో మాకు నిశ్చితార్థం జరిగింది. కానీ తను మారిపోయింది. నన్ను వదిలేసి… నిన్ను చేసుకుంది. నాకెలా ఉంటుంది చెప్పు. అందుకే నీకు నిజం చెప్పాను. అయినా నువ్వు అర్థం చేసుకోలేదు. దాన్నే నమ్మావ్. నీ ఖర్మ. నాకూ తనకూ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ కూడా పంపుతున్నాను చూసుకో అంటూ స్క్రీన్ షాట్లు పంపాడు. వాటిలో అతనంటే తనకు ఎంతో ఇష్టమనీ, తనతో ఏం చెయ్యడానికైనా సిద్ధమని ఆమె చేసిన చాట్ డైలాగ్స్ ఉన్నాయి. చాట్ స్క్రీన్ షాట్లను తీసుకెళ్లి హసన్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. కేసు రాశారు. ఆల్రెడీ ఒక వ్యక్తితో ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకొని, ఆ విషయాన్ని దాచిపెట్టి… ఇతన్ని మోసం చేసి పెళ్లికున్నట్లుగా ఆమెపై కేసు నమోదైంది. ఆమె క్యారెక్టర్ అలాంటిదని… ఆమె తల్లిదండ్రులకు కూడా తెలుసనే అనుమానం వ్యక్తం చేశాడు బాధితుడు. దర్యాప్తులో అన్ని విషయాలూ తెలుస్తాయని పోలీసులు రొటీన్ డైలాగ్ చెప్పారు.

Content above bottom navigation