రైలు టికెట్‌ రద్దు: మీకో షాకింగ్‌ న్యూస్‌

63

రైలు ప్ర‌యాణం అంటేనే సేఫ్టీ సెక్యూరిటీ బెస్ట్ స‌ర్వీస్ అనే చెప్పుకుంటాం
ఆ రైలులో షికారు అంటే అబ్బా అంత‌కంటే మెరుగైన ప్ర‌యాణం మ‌రొక‌టి లేదు అంటాం
అయితే అనుకున్న స‌మ‌యానికి కొంద‌రు ప్ర‌యాణాలు చేయ‌లేరు
కొన్ని అనివార్య‌ కార‌ణాల వ‌ల్ల ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలి
అయితే ఇలా చాలా మంది ప్ర‌యాణం ర‌ద్దు అయితే టికెట్ క్యాన్సిల్ చేసుకోకుండా వ‌దిలేస్తారు
ఇలాంటి టికెట్స్ రోజు వేల‌ల్లో క్యాన్సిల్ అవ్వ‌కుండా మిగిలిపోతున్నాయి
ఇదంతా కోట్ట రూపాయ‌ల ఆదాయాన్ని రైల్వే శాఖ‌కి తెచ్చిపెడుతున్నాయి.
మ‌రి మీ డ‌బ్బు వృదాగా పోనివ్వ‌కండి… ఇక్క‌డ మేము చెప్పే కొన్ని విష‌యాలు తెలుసుకోండి

Railways Earned Rs. Nine Thousand Crore From Ticket Cancellation  - Sakshi

భారతీయ రైల్వే కాన్సిలేషన్‌ టికెట్ల ద్వారా కోట్లాది రూపాయలను సంపాదించింది. వినడానికి ఆశ్చర్యంగా వున్నా.. రైల్వే ప్రయాణికులు బుక్‌ చేసుకున్న టికెట్లు రద్దు చేసుకోవడం మర్చిపోయిన టికెట్ల ద్వారా….అక్షరాల 9వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సొంతం చేసుకుంది. గత మూడు ఏళ్లలో దేశవ్యాప్తంగా వెయిటింగ్‌ లిస్టులో ఉండి రద్దు కాని టికెట్ల ద్వారా రూ. 9 వేల కోట్ల ఆదాయం వచ్చిందని స్వయంగా రైల్వే సమాచార సంస్థ కేంద్రం వెల్లడించింది. రాజస్థాన్‌ కోటాకు చెందిన సామాజిక కార్యకర్త సుజిత్‌ స్వామి సమాచార హక్కు చట్టం కింద వివరాలను కోరడంతో సీఆర్‌ఐఎస్‌ ఈ వివరాలను వెల్లడించింది.

జనవరి 1, 2017 నుండి జనవరి 31, 2020 మధ్య కాలంలో (మూడేళ్లు) వెయిటింగ్‌ లిస్టులో ఉన్న 9.5 కోట్ల మంది తమ టికెట్లను రద్దు చేసుకోలేదు. తద్వారా ఈ ప్రయాణికుల నుండి అత్యధికంగా రూ .4,335 కోట్లు సంపాదించింది. అలాగే టికెట్ల క్యాన్సిలేషన​ ద్వారా రూ.4335కోట్లను ఆర్జించింది. ఇలా గత మూడేళ్లలో టికెట్ రద్దు ఛార్జీలు, వెయిట్‌లిస్ట్ టికెట్లను రద్దు చేయకపోవడం వల్ల భారతీయ రైల్వే 9,000 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. ఆన్‌లైన్ ద్వారా ఐఆర్‌సిటిసి రైలు టిక్కెట్ల బుకింగ్‌లో ఖచ్చితమైన పెరుగుదల ఉందని తెలిపింది. 2017- 2020 జనవరి 31 వరకు మొత్తం 145 కోట్ల మంది ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోగా, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల ద్వారా పాత బుకింగ్ పద్ధతిలో 74 కోట్ల మంది టికెట్లను తీసుకున్నారు.


ఇంత‌కీ మీ డ‌బ్బు తిరిగి తీసుకుంటున్నారా, ఆన్ లైన్ అయినా ఆఫ్ లైన్ అయినా మీరు టికెట్ క్యాన్సిల్ చేస్తే మీకు కొంత న‌గ‌దు వ‌స్తుంది అది మ‌ర్చిపోకుండా తీసుకోండి అయితే మీకు ఎంత డ‌బ్బు క‌ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.


ఆన్‌లైన్‌ బుకింగ్‌, కౌంటర్‌ బుకింగ్‌ల మధ్య చాలా వ్యత్యాసం వుంటుంది, రైల్వే టిక్కెట్లను కాన్సిల్‌ చేసినపుడు, పూర్తి డబ్బులు కాకుండా.. సర్వీస్ ఛార్జీలు కోత పెట్టి, మిగతా సొమ్మును వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తుంది.

నిర్ణీత సమయానికి 48 గంటల లోపు టికెట్లను కాన్సిల్‌ చేసుకుంటే.. చార్జీలు ఇలా ఉంటాయి
ఏసీ ఫస్ట్ క్లాస్ / ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్ల రద్దు ఛార్జీ రూ. 240 + జీఎస్టీ అధ‌నంగా విధిస్తారు
ఏసీ 2 టైర్, ఫస్ట్ క్లాస్ టిక్కెట్ల రద్దు ఛార్జీ రూ. 200 + జీఎస్టీ అధ‌నంగా విధిస్తారు
ఏసీ 3 టైర్ / ఏసీ చైర్ కార్ / ఏసీ 3 ఎకానమీ క్లాస్ టిక్కెట్ల కోసం రద్దు ఛార్జీ రూ. 180 + జీఎస్టీ అధ‌నంగా విధిస్తారు
స్లీపర్ క్లాస్ టిక్కెట్ల కోసం, రద్దు ఛార్జీ రూ. 120.
సెకండ్‌ క్లాస్‌ టిక్కెట్లపై రూ. 60


డ‌బ్బులు ఎవ‌రికి ఊరికే రావు.. చాలా మంది ఇలా వ‌దులుకున్న సొమ్ము రైల్వేకి ఆదాయంగా తొమ్మిదివేల కోట్లు వ‌చ్చింది. ఇది మీ డ‌బ్బే ఈ డ‌బ్బు వ‌దులుకోకండి ఇలా టికెట్ క్యాన్సిల్ చేసుకోవ‌డం మ‌ర్చిపోకండి. మ‌రి ఈ విష‌యాన్ని మీ ఫ్రెండ్ కి కూడా షేర్ చేయండి.

Content above bottom navigation