లవ్ ప్రపోజ్ ఫస్ట్ ఎవరు చేయాలి.. అమ్మాయిలా? అబ్బాయిలా?

ప్రేమ.. ఓ అందమైన అనుభూతి.. దీనిని అంతే అందంగా అనుభవించాలి.. దీనిలో పడ్డాక ఆడవారైనా, మగవారైనా సరే ఆ అనుభూతిని పొందుతారు. మరి ఇలాంటి బంధం విషయంలో ఎవరు ముందుగా ప్రపోజ్ చేయాలి.. ఈ విషయంలో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇలాంటి విషయాలన్నీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం..

ప్రస్తుతం స్త్రీలు పురుషులకు దీటుగా విభిన్న రంగాల్లోనూ అడుగుపెట్టారు. ఇంటా బయట ఎదురయ్యే సవాళ్లను అధిగమించి తమని తాము నిరూపించుకుంటున్నారు. ప్రతి విషయంలో మగవారి కన్నా ఒక అడుగు ముందే ఉంటున్నారు. కానీ, బంధం విషయానికి వచ్చేసరికి వెనకే ఉంటున్నారు. బంధం విషయంలో ఎక్కువగా మగవారిపై ఆధారపడుతున్నారు. ముందుగా మగవారు ఈ విషయాన్నీ చెబితే బాగుంటుందని భావిస్తున్నారు. కానీ ఆడవాళ్లు ముందు ప్రపోజ్ చేస్తేనే మంచిగా ఉంటుంది. మగవారు మొదటినుంచి ఓ రిలేషన్‌ కి నాయకత్వం వహించాలనే ఉద్దేశ్యంతోనే ఉంటారు. మొదటి కలయికకు, డేట్ చేద్దామని అడగటానికి సిగ్గుపడతారు. మరో విషయం ఏంటంటే, కొందరు వారికి ఇష్టం లేకపోయినా ఒక రిలేషన్‌ ని మెయింటెయిన్ చేస్తారు. ఎందుకంటే, వారు తమ సమస్యలను బయటకి చెప్పుకోలేరు. వాటి గురించి బయటికి చెప్పడానికి భయపడతారు. అందుకే మహిళలు తమ లవ్ రిలేషన్‌ ని అందంగా మార్చేందుకు కొన్ని విషయాలను గుర్తుకుపెట్టుకోవాలి. అవేమిటి అంటే..

నెంబర్ 1… మహిళలు అన్ని విషయాల్లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. ఇంటిని చూసుకోవడంలో, సమస్యలు వ్యవహరించే సమయంలో ఇలా అన్నింటిలోనూ చాలా ఆలోంచించి నేర్పుతో వ్యవహరిస్తారు. కానీ ఒక వ్యక్తితో బంధం విషయంలో ధైర్యం చేయరు. అనేక ఆలోచనలు చేస్తారు. చాలా మంది మహిళలు తమ జీవితం గురించి, ముఖ్యంగా వారి సంబంధం గురించి నిర్ణయాలు తీసుకునేంత సామర్థ్యం తమకి లేదని అనుకుంటారు. అందుకు కారణం వారిలోని భయం, ఇది వారిని వెనక్కి లాగుతూ ఉంటుంది. వారి బంధం గురించి మహిళలు తమకు అవకాశం ఇచ్చే సమయం ఇది.
నెంబర్ 2… మీ శృంగార జీవితాన్ని నియంత్రించడంలో ఒక ముఖ్యమైన దశ మీ భావోద్వేగాలను గుర్తించడం, సౌకర్యంగా ఉండటం. ఒక స్త్రీ ప్రేమలో పడటం, బయటపడటం గురించి తన గొంతు విప్పే స్వేచ్ఛ ఉండాలి. ఒక బంధాన్ని స్టార్ట్ చెయ్యడానికి, ఆ బంధాన్ని బ్రేక్ చేయటానికి కూడా తనకి దైర్యం ఉండాలి. చాలా మంది వారి బంధంలో సంతోషంగా లేనప్పటికీ వారు రాజీ పడుతూ వస్తారు. సమాజం తమ గురించి ఏం అనుకుంటుంది. కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో అని భయపడతారు. కానీ ఎవ్వరి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు.. మీరు ఏ నిర్ణయాన్ని అయినా ధైర్యంగా తీసుకోండి.

నెంబర్ 3… మనపై మనకి విశ్వాసం ఉండాలి. మహిళలు ఎప్పుడు దైర్యంగా ఉండాలి. ఎప్పుడు పురుషులే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని అనుకుంటారు. కానీ మహిళలు దైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి.. మగాళ్లు కూడా ధైర్యంగా, నమ్మకంగా ఉన్న మహిళలను మరింతగా ఇష్టపడతారు.

నెంబర్ 4… కొన్ని సంవత్సరాలుగా, మహిళలు జీవితంలోని చాలా కోణాల్లో మూస పద్ధతులను మార్చారు. కానీ ఇప్పటికి కూడా కొందరు ఇదే ధోరణిలో ఉన్నారు. కాబట్టి మహిళలు మూసధోరణిలో లేకుండా కొత్తకొత్తగా ఆలోచించాలి.

Image result for లవ్ ప్రపోజ్ ఫస్ట్ ఎవరు చేయాలి.. అమ్మాయిలా? అబ్బాయిలా?

నెంబర్ 5… మహిళలు మార్గదర్శకంగా ఉండాలి. ముఖ్యంగా ఇప్పటి తరాల స్త్రీలు అన్ని రంగాల్లోనూ ముందున్నారు. వారి మనోధైర్యం, కుటుంబం పట్ల శ్రద్ద, ఇవన్నీ మహిళలకు ఒక ప్రత్యేకతను ఏర్పరచాయి. ఇంట్లో, పని చేసే చోటు.. ఇలా ప్రతి చోట మహిళా ప్రతి చోట ఒకరికి ఆదర్శంగా ఉండాలే కానీ, భయపడకూడదు.

ఇలా మహిళలు కొన్ని విషయాలలో ఆలోచించాలి. స్త్రీ సాధించలేనిది ఏమీ లేదు. వారి ప్రేమ జీవితాన్ని చూసుకునే స్వేచ్ఛ ప్రతి మహిళకి ఉంది. కాబట్టి ఈ విషయాలు గుర్తుకుపెట్టుకుని జీవితాన్ని అద్భుతం మలుచుకోండి..

Content above bottom navigation