లాక్‌ డౌన్‌ పొడిగించే చాన్స్‌?

145

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లో కూడా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా మొత్తం 650 వందల పై చిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం 13 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే ఈ కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం లాక్ డౌన్ ను కూడా ప్రకటించింది.దేశవ్యాప్తంగా మొత్తం 72 జిల్లాలలో కూడా ఈ నెల 31 వ తేదీ వరకు ఈ లాక్ డౌన్ ని ప్రకటించారు. అయితే ఈ లాక్ డౌన్ కి కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఏమాత్రం సహకరించకపోవడం తో కేంద్రం కీలక నిర్ణయం తీసుకొనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు,పంజాబ్ ఇలా అన్ని రాష్ట్రాలు కూడా పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ని ప్రకటించాయి. కానీ ఈ లాక్ డౌన్ కి ప్రజలు ఏమాత్రం సహకరించడం లేదు.ఎలాంటి పని లేకపోయినా ఎదో ఒక వంకతో బయటకు వస్తుండడం,చుట్టాల ఇళ్లకు వెళ్తుండడం వంటి చర్యలతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తుంది. కరోనా ను నియంత్రించడానికి కేంద్రం ఈ లాక్ డౌన్ పీరియడ్ ను పొడిగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

దేశాన్ని కమ్మేసిన కరోనా వైర్‌సను అరికట్టేందుకు 21 రోజుల లాక్‌ డౌన్‌ సరిపోదని, ఏప్రిల్‌ 15 తర్వాత మరిన్ని రోజులు, అంటే మే 15 వరకు లాక్‌డౌన్‌ ను పొడిగించే అవకాశాలు లేకపోలేదని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే అప్పటికి కరోనా వైరస్‌ అరికట్టే విషయంలో మనం ఎంతవరకు సఫలమవుతామో స్పష్టంగా తెలుస్తుందని ఆయన ఆంధ్రజ్యోతితో అన్నారు. ‘‘ఒక దేశాధినేతగా ప్రధానమంత్రి ఏ చర్యలు తీసుకోవాలో అవే తీసుకుంటున్నారు. అమెరికా, ఇటలీల్లో మాదిరిగా భారీ ఎత్తున మరణాలు సంభవించకుండా చూడడమే ఆయన ఉద్దేశం. ప్రధాని ఈ చర్యలు ప్రకటించడానికి మూడు ప్రధాన కారణాలున్నాయి..

Image result for లాక్‌ డౌన్‌ పొడిగించే చాన్స్‌?

ఒకటి: వైరస్‌ పెద్ద ఎత్తున ప్రబలితే లక్షల మందికి చికిత్స చేసే మౌలిక వైద్య సదుపాయాలు మన దేశంలో అందుబాటులో లేవు.
రెండు: భౌగోళికంగా, జనాభాపరంగా పెద్దదైన భారత్‌లో పరిస్థితులు అదుపు తప్పితే నియంత్రించడం సాధ్యం కాదు… చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందే తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి మాతో జరిపిన సమావేశంలోనే నిర్ణయించారు.
ఇక మూడోది: మన దేశంలో వెద్యుల సంఖ్య కూడా తక్కువే.. ఇప్పటికే ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు చికిత్స నందించ డానికి సరిపడా వైద్యులు లేరు’’ అని ఆ అధికారి వివరించారు. మన దేశం సరైన సమయంలోనే రంగంలోకి దిగిందని, ఫిబ్రవరిలోనే ఐసోలేషన్‌ సెంటర్‌లను ఏర్పాటు చేసి విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను యుద్ద ప్రాతిపదికన రప్పించిందని ఆయన తెలిపారు. ‘‘నిజానికి నెలరోజుల ముందే లాక్‌ డౌన్‌ ప్రకటిస్తే ప్రజల్లో తిరుగుబాటు వచ్చేది.. కరోనా వైరస్‌ తీవ్రత ప్రజలు గ్రహించిన తర్వాత, మన భారతీయులను విదేశాలనుంచి రప్పించిన తర్వాత, విదేశీయుల రాకపోకలు పూర్తిగా అరికట్టిన తర్వాతే ప్రధాని చర్యలు ప్రకటించారు’’ అని ఆయన చెప్పారు.

ఈ 21 రోజుల్లో కరోనా ఎంత ప్రబలిందో, ఏ మేరకు అరికట్టగలమో మాత్రమే తెలుస్తుందని, కానీ ఏదైనా వైరస్‌ వ్యాప్తి చెందేందుకు అవసరమయ్యే సైకిల్‌ మాత్రం పూర్తి కాదని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. వి. శ్రీనివాస్‌ తెలిపారు. ప్రస్తుతం మస్కట్‌ లో కిడ్నీ మార్పిడి కేంద్రాన్ని నెలకొల్పే విషయంలో ఆ దేశ ప్రభుత్వానికి సహాయపడేందుకు వెళ్లిన శ్రీనివాస్‌ ఆ దేశంలో కూడా పరిమిత స్థాయిలో లాక్‌డౌన్‌ ఉన్నదని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి కాకుండా ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం అవసరమైన దానికంటే ఎక్కువ చర్యలే తీసుకుంటున్నారని, భవిష్యత్తు లో ఏ సమస్యలు రాకుండా ఈ చర్యలు సహాయపడతాయని తెలిపారు. మరోవైపు నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని… కేంద్రం మరిన్ని రోజులు లాక్ డౌన్ విధిస్తేనే శ్రమకు తగ్గ ఫలితం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా, ఇటలీలో వేల సంఖ్యలో కరోనా భారీన పడి మృతి చెందుతుండటంతో ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఏ చిన్న తేడా వచ్చినా సరే పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజలను పూర్తిగా కట్టడి చేయడానికి గాను ఎమర్జెన్సి ని ప్రకటించే యోచనలో మోడీ సర్కార్ ఉంది. ప్రజలు బయటకు వస్తే లాఠీ చార్జ్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మాట వినకపోతే మాత్రం అరెస్ట్ చేయడానికి జైల్లో పెట్టడానికి సిద్దమవుతుంది. అవసరం అనుకుంటే దీనిపై ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక లాక్ డౌన్ వలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర సరుకులు కూడా దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో కరోనా విస్తరించుకుంటూపోవడంతో సిటీలోనే జనాలు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయాసాలు పడుతున్నారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు చాలామంది విద్యార్థులు బయలుదేరారు.. పొందుగుల బ్రిడ్జి వద్ద భారీగా నిలిచిపోయిన వాహనాలు. రాత్రి 12గంటల నుంచి పడిగాపులు కాస్తున్నా కూడా ట్రాఫిక్ తగ్గడం లేదు.. లాక్ డౌన్ ఉన్నా కూడా బయటకు రావడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. పోలీసులతో విద్యార్థుల వాగ్వాదంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. . తాగేందుకు నీళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతున్నామంటున్న విద్యార్థులు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా రైళ్లల్లోనూ ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లలో ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయనున్నారు. ట్రైన్-18(ఇండియా మొదటి బుల్లెట్ రైలు) రూపకర్తలు ఇందుకోసం పనిచేయనున్నారు.

Content above bottom navigation