వద్దన్నా క్రికెట్ ఆడిన పాకిస్తాన్.. ఇప్పుడు ఆటగాళ్లందరికి కరోనా ?

135

కరోనా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌.. ప్రస్తుతం 164 దేశాలకు వ్యాప్తిచెందింది. దాదాపు 2 లక్షల మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. సుమారు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. చైనా తర్వాత ఇటలీ, ఇరాన్, స్పెయిన్‌లో వైరస్ మరణాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు దీని భారిన పాకిస్తాను క్రికెటర్స్ కూడా పడ్డారని వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే..

ఒకవైపు కరోనా ప్రపంచం మొత్తాన్ని వణికిస్తుంటే పాకిస్తాన్ మాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేక ఇప్పుడు విపరీతంగా నష్టపోయింది. కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించడం వల్ల దక్షిణాఫ్రికాతో జరిగాల్సిన సిరీస్ ను బిసిసిఐ నిలిపివేసింది. అలాగే ఈ నెలాఖరులో జరిగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను కూడా ఏప్రిల్ 15వ తేదీ వరకు వాయిదా వేసింది. ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ సిరీస్ కూడా వాయిదా పడింది. చాలాదేశాలు క్రికెట్, ఫుట్ బాల్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క ఈవెంట్ ను నిలిపివేస్తే పాకిస్తాన్ మాత్రం వారి దేశంలో జరిగే టి20 క్రికెట్ లీగ్ అయినా పాకిస్తాన్ సూపర్ లీగ్ ను అలాగే కొనసాగించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ కరోన్ భయం లేకుండా పాకిస్తాన్ ఈ లీగ్ ను కొనసాగించడంతో అందరు ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు ఈ లీగ్ ను ఆపేస్తున్నట్టు ప్రకటించింది.

నిన్న జరగాల్సిన నాకౌట్ మ్యాచ్ ను, రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే ఇన్ని రోజులు ఎవరి మాటలు లెక్కచేయకుండా కొనసాగించిన క్రికెట్ లీగ్ ను ఉన్నఫలంగా పాకిస్తాన్ ఎందుకు నిలిపివేసింది అనే చర్చ మొదలైంది. దానికి కారణం నిన్న ఒక్కరోజే వారి దేశంలో దాదాపు 130 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఎంతోమంది పేరున్న ఇంటర్నేషనల్ ఆటగాళ్ళు వచ్చి ఆడుతుంటారు. వారి ఆటను చూసేందుకు విదేశీ అభిమానులు పాకిస్తాన్ కు తరలి వచ్చారు.

Image result for pakistan cricket team

ఇంకేముంది మైదానంలో ఆటగాళ్ళు అటు ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోతుంటే, స్టాండ్స్ లో ప్రేక్షకులు ఉత్సాహంతో ఊగిపోతూ ఒకరికొకరు కరోనా వైరస్ అంటించుకుంటూ ఉండిపోయారు. ఆ క్రికెట్ మ్యాచ్ కు వెళ్లిన చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలిసింది. దీంతో పాకిస్థాన్ కు చివరికి బుద్ధి తెచ్చుకుని లీగ్ ముగిసేందుకు మూడు మ్యాచ్ లు మిగిలి ఉండగా, లీగ్ ను ఆపివేసింది. కరోనా లక్షణాలు ఉన్న ఒక విదేశీ ఆటగాడిని, అతని దేశానికి పంపించేసినట్లు కూడా సమాచారం. అదే కనుక నిజమైతే అతనితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్న పాక్ ఆటగాళ్ళకు మరియు మిగిలిన వాళ్లకు కూడా ముప్పు పొంచి ఉంది. ఒకవేళ ఏమైనా జరిగితే అది పాకిస్తాన్ బాధ్యతనే అవుతుంది..డ్రెస్సింగ్ రూమ్ లో ఆ క్రికెటర్ తో ఉన్న అందరికి కూడా కరోనా టెస్ట్ లు చేయనుంది పాకిస్తాన్ ప్రభుత్వం.

Content above bottom navigation