వామ్మో… సంవత్సరం నుంచి నీళ్లు తాగకుండా జీవిస్తున్న మహిళ…

374

నిత్యం నీళ్లు తాగితే వ్యాధులు దరిచేరవని, చర్మం కూడా మెరుస్తుందని చెబుతుంటారు. ముఖ్యంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే తప్పకుండా నీళ్లు తాగాల్సిందేనని అంటారు. మనం కూడా ఒక్క రోజు నీళ్లు తాగకపోతే గొంతు ఎండిపోయి దాహంతో విలవిల్లాడతాం. ఆహారం తిన్నా, తినకపోయినా గుక్కెడు నీళ్లు నోటిలో పడితే ప్రాణం లేచివస్తుంది. కానీ ఒక మహిళ చుక్క నీరు తాగకుండా జీవించేస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడాది నుంచి నీటికి దూరంగా ఉంది. సాధారణంగా మనుషులు నీళ్లు లేకుండా ఒకరోజు లేదా రెండు రోజులు బ్రతక గలరు. కానీ ఈ మహిళ ఏకంగా నీళ్లు త్రాగకుండా దాదాపుగా సంవత్సరం కాలం పాటు జీవిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే నీళ్లు తాగకుండా సంవత్సర కాలం పాటు జీవిస్తున్నా, ఈమె ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఆరోగ్యంగా జీవించడం అందరికి ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఆ మహిళా గురించి పూర్తీగా తెలుసుకుందామా.

ఇండోనేషియాలోని బాలిలో నివసిస్తున్న సోఫియే పార్థిక్ అనే 35 ఏళ్ల మహిళ యోగా శిక్షకురాలిగా పనిచేస్తోంది. అయితే పోయిన సంవత్సరం ఈమె అనేక అనారోగ్య సమస్యలతో బాధపడింది. కీళ్ల నొప్పులు, కళ్ల ఉబ్బరం, ఫుడ్ అలర్జీ, జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడింది. ఆమెను టెస్ట్ చేసిన డాక్టర్స్ ఆమెకు కొన్ని సర్జరీలు చెయ్యాలని సూచించారు. దీంతో సర్జరీలకు భయపడిన ఆమె వేరే మార్గం లేదా అని డాక్టర్స్ ను అడిగింది. దాంతో డ్రై ఫుడ్ డైట్ పాటిస్తే మంచి ఫలితం ఉండొచ్చు అని సూచించారు. దీంతో కొన్నాళ్లు నీళ్లు తాగకుండా జీవించాలని నిర్ణయించుకుంది. ‘నో వాటర్ డైట్’ చేయడం ఆరంభించింది. సోఫియా పూర్తిగా నీటిని తాగడం మానేసి పండ్లు, ఇతర పదార్థాలతో నీటిని తీసుకుంటోంది. అయితే ఇలా ఒక నెల రోజులు పాటించగా మంచి ఫలితాలను రాబట్టింది. దాంతో ఆమె పూర్తిగా నీటిని తాగడం మానేసి ఇతర పదార్థాలతో నీటిని తీసుకోవడం మొదలు పెట్టింది. రోజూ 14 గంటలు పాటు ఆమె నీరు గానీ, నీటిని కలిగిన ఆహారాన్ని గానీ ముట్టుకోదు. ఆ తర్వాత నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయాలను మాత్రమే తింటుంది. ఏడాదిలో డైటింగులో ఆమె 52 గంటలు నిర్విరామంగా నీరు కలిగిన ఏ ఆహారాన్ని ముట్టకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం.

ఇక తన డైట్ గురించి సోఫియా మాట్లాడుతూ… పోషకాలు కావాలంటే కేవలం నీళ్లు మాత్రమే తాగాల్సిన అవసరం లేదని, ఆహరంలో ఉండే నీటి శాతం శరీరానికి సరిపోతుందని చెబుతోంది. పండ్లు, కూరగాయలతో తన శరీరానికి కావాల్సినన్ని పోషకాలు లభిస్తున్నాయని, ఈ డైట్ పాటించిన తర్వాత గతంలో ఎదురైన అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయాయని పేర్కొంది. ఉబ్బిన కళ్లకు చికిత్స చేయించుకోడానికి హాస్పిటల్‌కు వెళ్తే.. డాక్టర్లు సర్జరీ చేయాలన్నారు. దీంతో ఎంతో ఆందోళనకు గురయ్యా. నా సమస్య తెలుసుకున్న ఫ్రెండ్ డ్రై ఫాస్టింగ్ చేయాలని చెప్పింది. నీటిని తాగకుండా కేవలం పండ్లు, కూరగాయలను మాత్రమే ఆహారంగా తీసుకోవాలని సూచించింది. అప్పటి నుంచి నేను ఈ డైట్ పాటిస్తున్నా. బాటిల్ లేదా ట్యాప్ వాటర్‌ను తాగినట్లయితే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. నీళ్ల వల్ల కిడ్నీలు అతిగా పనిచేయాల్సి వస్తుంది. శరీరాన్ని హైడ్రేషన్ చేయడానికి బదులు శరీరాన్ని ఉబ్బేలా చేస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి నీళ్లే తాగాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు డ్రై డైటింగ్ చేస్తే తప్పకుండా ఆ తేడా తెలుస్తుంది. అంతగా దాహం వేస్తే కొబ్బరి నీళ్లు, నీళ్లు కలపకుండా చేసే పండ్ల జ్యూస్‌లను తాగవచ్చని సోఫియా చెబుతుంది. ఏది ఏమైనా మామూలుగా మానవులు ఐదారు గంటల వరకు నీళ్లు తాగకపోతేనే అల్లాడిపోతున్నారు. అలాంటిది సోఫియా మాత్రం ఏకంగా సంవత్సరం నుండి నీళ్ళు తీసుకోకుండా జీవిస్తుందంటే ఆశ్చర్యం కలిగించే విషయమే..

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation