వెస్టిండీస్ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు

మీరు వెస్టిండీస్ దేశం గురించి వినే ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, వెస్టిండీస్ అనేది దేశం కాదు. ఇది ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో, అమెరికాకు తూర్పుగా, ఎన్నో దీవులు కలిసున్న ఒక ప్రాంతం. ఇక్కడ కెమెన్ ఐలాండ్స్, క్యూబా, డోమెనికన్ రిపబ్లిక్, జమైకా లాంటి ఎన్నో ఐలాండ్ నేషన్స్ ఉన్నాయి. వెస్టిండీస్ లో దాదాపు 7 వేల ఐలాండ్స్ ఉన్నాయి. ఇవి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఫ్లోరిడా నుంచి మొదలై, వెనిజులా వరకు 3 వేల కిమీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. ఈ ఐలాండ్స్ లో దాదాపుగా 28 దేశాలు ఉన్నాయి. వీటన్నిటి కలయికనే వెస్టిండీస్ అంటారు. అలాంటి వెస్టిండీస్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for west indies
  1. వెస్టిండీస్ లో 7 వేలకు పైగా దీవులు ఉన్నా, కేవలం 2 శాతం దీవులు మాత్రమే మనుషులు జీవించడానికి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ నివసించే చాలామంది ఆఫ్రికా దేశం వంశస్తులు. వీరి పూర్వీకులను, యూరోపియన్స్ బానిసలుగా చేసి, ఇక్కడికి తీసుకొచ్చి, వీరితో చెరుకు పంటను పండించేవారు. బానిసత్వం అంతరించిపోయాకా కూడా వీళ్ళు ఇక్కడే ఉన్నారు.
  2. కరేబియన్ ఐలాండ్స్ లలో చాలామంది ఇండియన్స్ కూడా ఉంటారు. వీరి సంఖ్యా అక్కడ లక్షల్లో ఉంటుంది. వీరిని ఇండో కరేబియన్స్ అని కూడా అంటారు. వీరు కూడా బ్రిటిషర్లు బానిసలుగా తీసుకొచ్చినవాళ్ళే. వెస్టిండీస్ క్రికెట్ టీమ్ లో శివనారాయణన్ చందర్ పాల్, దినేష్ రామ్ దిన్, సునీల్ నరైన్ లాంటి ప్లేయర్స్ ఇండియాకు చెందిన వాల్లే.
  3. వెస్టిండీస్ రీజియన్ లో ఇండియా ప్రభావం ఎంతలా ఉంటుందంటే, ఇక్కడి ఫుడ్ మన ఇండియన్ ఫుడ్ లాగానే ఉంటుంది. పూరీ, పొటాటో కర్రీ, పులావ్, మటన్ కర్రీ, దాల్ లాంటి డిషెస్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఇండియన్స్ ఇక్కడికి టూర్ కు వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
  4. మీరు పైరేట్స్ అఫ్ కరేబియన్ సినిమా చూసే ఉంటారు. ఆ సినిమా షూటింగ్ మొత్తం ఇక్కడే జరిగింది.
Image result for west indies island
  1. వెస్టిండీస్ లోని జమైకా ప్రాంతంలో ఒక స్క్వేర్ మైల్ ప్రాంతంలో చాల చర్చిలు ఉన్నాయి. ఇన్ని చర్చిలు ప్రపంచంలో ఎక్కడ లేవు. ఈ విషయం గిన్నిస్ బుక్ లో కూడా రికార్డ్ అయ్యింది.
  2. కరేబియన్ కు చెందిన 75 శాతం జనాభా క్యూబా, డోమెనికన్ రిపబ్లిక్, హయతి అనే మూడు దేశాల్లోనే ఉంటారు. ఈ మూడు దేశాల్లో దాదాపు 3 కోట్ల మంది జనాభా ఉంటారు.
  3. వెస్టిండీస్ క్రికెట్ టీమ్ ప్రపంచంలో ఉన్న మిగతా టీమ్స్ కంటే కొంత ప్రత్యేకమైనది. కానీ నిజం చెప్పాలంటే వెస్టిండీస్ అనే దేశమే లేదు. ఈ టీమ్ ను వెస్టిండీస్ కు చెందిన 15 టెర్రరిస్ నుంచి తయారుచేస్తారు. ఇందులో వెస్టిండీస్ కు చెందిన అన్ని ప్రాంతాల ప్లేయర్స్ ఉంటారు. అందుకే అన్ని టీమ్స్ లాగా ఈ టీమ్ మ్యాచ్ కు ముందు జాతీయ గీతాన్ని చదవరు. వీళ్ళు క్రికెట్ గీతాన్ని పాడతారు.
  4. కరేబియన్ ఐలాండ్స్ సరదాగా గడిపేందుకు అద్భుతమైన ప్రదేశాలు. ఇక్కడికి ఏటా లక్షల మంది టూరిస్టులు వస్తుంటారు. ఎక్కువగా డొమరికన్ రిపబిక్ దేశానికి వస్తుంటారు. ఇది బాగా డెవలప్ అయినా కరేబియన్ దేశాల్లో నెంబర్ 1 స్థానములో ఉంది.
  5. మీరు కరేబియన్ ఐలాండ్స్ కు వెళ్తే.. బెర్ముడా ట్రయాంగిల్, కెమెన్ ఐలాండ్ వైలెట్., డోమెనికన్ ఐలాండ్ వాటర్ ఫాల్స్, ట్రెక్కింగ్ అడ్వాంచర్ లాంటివి ఎన్నో ఉంటాయి. ఇక ఇక్కడ ఉన్న పక్షులు గురించి మాట్లాడాలంటే.. ఇక్కడ మీకు బ్లాక్ బిల్ ప్యారెట్స్, బ్లాక్ స్వీప్ జమైకన్ లిజార్డ్, కరేబియన్ మార్టిన్, వైట్ టేల్ ట్రాఫిక్ బర్డ్ లాంటి ఎన్నో పక్షులు, జంతువులూ ఉంటాయి.
  6. ఇక ఈ ప్రాంతంలో ఆల్కహాల్ అనేది 24 గంటలు దొరుకుతుంది. ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు.

ఇవేనండి వెస్టిండీస్ దీవుల గురించి కొన్ని ఆశ్చర్యమైన విషయాలు. మరి మేము చెప్పిన వెస్టిండీస్ విశేషాల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింద వీడియో చూడండి:

Content above bottom navigation